ఓ పిట్ట కథ (2020 సినిమా)

చెందు ముద్దు దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఓ పిట్ట కథ 2020, మార్చి 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ఈ చిత్రంతో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దర్శకుడు చెందు ముద్దు 2015లో ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అనే సినిమాను రూపొందించాడు.[1][2]

ఓ పిట్ట కథ
ఓ పిట్ట కథ సినిమా పోస్టర్
దర్శకత్వంచెందు ముద్దు
నిర్మాతఆనంద్ ప్రసాద్
తారాగణంవిశ్వంత్, సంజయ్ రావు, నిత్యాశెట్టి
ఛాయాగ్రహణంసునీల్ కుమార్ ఎన్
కూర్పుడి. వెంకట ప్రభు
సంగీతంప్రవీణ్ లక్కరాజు
నిర్మాణ
సంస్థ
భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ
6 మార్చి 2020 (2020-03-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

వీర్రాజు కాకినాడలో ఉంటుంటాడు. అతని దగ్గరకు విశ్వంత్ చైనా నుండి వచ్చి తన మేనల్లుడిని అని, వీర్రాజు కుమార్తె వెంకట లక్ష్మి (నిత్య శెట్టి) ని ప్రేమిస్తున్నానని చెప్పగా వీర్రాజు కూడా వీళ్ళిద్దరి పెళ్ళికి ఓకే అంటాడు. స్నేహితులతో అరకు టూర్ బయలుదేరిన వెంకటలక్ష్మి కిడ్నాప్ అవుతుంది. ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి విశ్వంత్, వీర్రాజు స్టేషనుకు వస్తారు. ఎస్సై (బ్రహ్మాజీ) అశోక్ కుమార్‌కు వీర్రాజు దగ్గర పనిచేసే ప్రభు (సంజయ్ రావ్) మీద అనుమానం ఉందని విశ్వంత్ చెప్తాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో విశ్వంత్ – వెంకటలక్ష్మిల ప్రేమకథ ఎస్సైకి తెలుస్తుంది. ఎస్సై ప్రభును విచారించడం మొదలుపెట్టాక వెంకటలక్ష్మితో తనకు కూడా ప్రేమ కథ ఉందని తెలుసుకుంటాడు. ఆ దిశగా ఎంక్వైరీ మొదలు పెట్టిన ఎస్సైకి ఈ కేసుకు సంబంధించిన వీడియో దొరకుతుంది. ఆ వీడియోలో ఏం ఉంది, అసలు వెంకటలక్ష్మీని ఎవరు కిడ్నాప్ చేశారు, వెంకటలక్ష్మి దొరికిందా లేదా అన్నది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: చెందు ముద్దు
  • నిర్మాత: ఆనంద్ ప్రసాద్
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ ఎన్
  • కూర్పు: డి. వెంకట ప్రభు
  • నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్

నిర్మాణం

మార్చు

తన కొడుకు తొలి చిత్రంలో బ్రహ్మాజీ కూడా నటించాలనుకున్నాడు. దర్శకుడు సాగర్ చంద్ర అతన్ని చెందు ముద్దుకు పరిచయం చేశాడు.[2]

పాటలు

మార్చు

ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.[3]

పాటపేరు గాయకుడు
"ఏదో ఏదో" స్వీకార్ అగస్తీ
"ఎదో మనసున" లిప్సిక భాష్యం
"రాకాసుడే" ప్రవీణ్ లక్కరాజు
"ఏమై పోతానే" ప్రవీణ్ లక్కరాజు
"ఎయ్ కొంటెదాన" శ్రీనివాస్ జోష్యుల

మూలాలు

మార్చు
  1. "With unexpected twists, O Pitta Katha is thrilling: Anil Ravipudi". The Times of India. 5 March 2020.
  2. 2.0 2.1 Rajasekhar, Paturi (19 April 2020). "I am very happy with the kind of response O Pitta Katha is receiving online: Chendu Muddu". The Times of India.
  3. "O Pitta Katha Movie Review : With funny and thrilling twists, o pitta katha is an entertaining watch". The Times of India. 6 March 2020.

ఇతర లంకెలు

మార్చు