కంకలినీ దేవాలయం
కంకలినీ దేవాలయం, తూర్పు నేపాల్‌లోని ఒక దేవాలయం, శక్తి పీఠం. భరదహ విడిసి, సప్తరి జిల్లా హెడ్ క్వార్టర్ రాజ్‌బిరాజ్‌కి తూర్పున 19 కి.మీ.ల దూరంలో భారత సరిహద్దు బీర్‌పూర్‌కు సమీపంలో ఉంది. నేపాల్, భారతీయ యాత్రికులకు ఈ దేవాలయం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి బడా దశాయిన్ ప్రజలు వస్తుంటారు.[1] దసరా సమయంలో ఇక్కడ కొన్ని వేల మేకలను బలి ఇస్తారు.[2] మహేంద్ర హైవే భరదా విభాగానికి సమీపంలో ఈ దేవాలయం ఉంది.
కంకలినీ దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 26°33′N 86°55′E / 26.55°N 86.92°E |
దేశం | నేపాల్ |
రాష్ట్రం | సాగరమాత |
జిల్లా | సప్తరి జిల్లా |
ప్రదేశం | భరదహ |
సంస్కృతి | |
దైవం | కంకలినీ |
ముఖ్యమైన పర్వాలు | దసరా |
చరిత్ర
మార్చుచరిత్ర, హిందూ పురాణాల ప్రకారం భరదహలో ఒక గ్రామాన్ని స్థాపించడానికి భూమిని త్రవ్వినప్పుడు దుర్గాదేవి రాతి విగ్రహాం బయటపడింది. అప్పుడు కంకలినీ దేవాలయంలో ఆ దుర్గా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు.[3] ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తే భక్తుల కోరిక నెరవేరుతుందని అక్కడి స్థానికులు నమ్ముతారు.[4]
రోడ్డు రవాణా
మార్చుమహేంద్ర హైవేపై ఉన్న ఈ దేవాలయానికి రోడ్డుమార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సమీప నగరమైన రాజ్‌బిరాజ్ నుండి 17 కి.మీ దూరంలో ఉంది.[5]
వాయు రవాణా
మార్చుఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, సమీప నగరైన రాజ్‌బిరాజ్‌లో సుమారు 20 కి.మీ దూరంలో రాజ్‌బిరాజ్ విమానాశ్రయం ఉంది. శ్రీ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆధ్వర్యలంఓ రాజ్‌బిరాజ్, ఖాట్మండు మధ్య రోజువారీ విమాన సౌకర్యం ఉంది.[6]
మూలాలు
మార్చు- ↑ "कंकालिनी मन्दिर". Madesh Special. Archived from the original on 2017-06-30. Retrieved 2021-11-29.
- ↑ "Kankalini Temple". Boss Nepal. Retrieved 29 November 2021.
- ↑ Dāsa, Harikāntalāla (2003). Saptarī Jillākā pramukha sāṃskr̥tika sthalaharu : eka adhyayana : laghuanusandhānakārya (1. saṃskaraṇa. ed.). Kāṭhamāḍauṃ: Nepāla Rājakīya Prajñā-Pratishṭhāna. p. 120. ISBN 9789993350569.
- ↑ "Kankalini Temple is another famous temple situated in Saptari district". Saptari Online. Archived from the original on 23 జనవరి 2021. Retrieved 29 November 2021.
- ↑ http://bossnepal.com/kankalini-temple/
- ↑ [1]