కాఠ్మండు
కాఠ్మండు నేపాల్ దేశ రాజధాని. 2015లో సంభవించిన భూకంపం లో ఈ నగరం సర్వనాశనమైనది.
కాఠ్మండు మెట్రోపాలిటన్ నగరము काठमाण्डू महानगर, यें देय् | |
---|---|
![]() పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు , దెగుతలేజు నేపధ్యములో కాఠ్మండు దర్బార్ స్క్వేర్, బుద్దనాధ స్థూపము, బాగ్‌మతి నది, బుద్దనీల్‌కంఠ, సింఘ దర్బార్, స్వయంభూనాధ్ ఆలయము రాత్రి వేళ, పశుపతినాథ్ దేవాలయం | |
Motto(s): My legacy, my pride, my Kathmandu | |
![]() | |
దేశము | నేపాల్ |
Development Region | Central |
జోన్ | బాగ్‌మతి జోన్ |
జిల్లా | కాఠ్మండు జిల్లా |
పేదరిక సూచీ | ![]() |
పేదరిక సూచీ | ![]() |
అక్షరాస్యత శాతము | ![]() |
Established | 900s BC[2] |
ప్రభుత్వం | |
• ముఖ్య కార్యనిర్వహణ అధికారి | పూర్ణ భక్త తందుకర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 49.45 కి.మీ2 (19.09 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 1,400 మీ (4,600 అ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,003,285[3] |
• సాంద్రత | 20,288.8/కి.మీ2 (52,548/చ. మై.) |
భాషలు | |
• Local | నేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, షెర్పా భాష, తమంగ్ భాష, గురుంగ్ భాష, మంగర్ భాష, సునువర్ భాష/కిరాంతీ భాష, టిబెటన్ భాష |
• అధికారిక భాష | నేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, ఆంగ్లము |
ప్రామాణిక కాలమానం | UTC+5:45 (నేపాల్ ప్రామాణిక కాలము) |
పిన్‌కోడ్ | 44600 (GPO), 44601, 44602, 44604, 44605, 44606, 44608, 44609, 44610, 44611, 44613, 44614, 44615, 44616, 44617, 44618, 44619, 44620, 44621 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 01 |
జాలస్థలి | www |
పేరు వెనుక చరిత్రసవరించు
కాఠ్మండు నగరానికి ఆ పేరు కాష్ఠమండపము ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతములో కాష్ఠ (काष्ठ) అనగా కొయ్య , మండప్ (/मण्डप) అనగా కప్పబడిన ప్రదేశము అని అర్థము. స్థానిక భాషలో దీనిని మారు సతాల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది[4].
చరిత్రసవరించు
ఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో ఇక్కడ నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి. ఈ త్రవ్వకాలలో భాగంగా మలిగావ్లో క్రీస్తు శకం 185వ సంవత్సరానికి చెందిన ప్రతిమ లభించినది[5]. దండోచైత్య సొరంగంలో బ్రహ్మీ లిపిలో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైనది. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనిని 2000 సంవత్సరాలనాటిగా అంచనా వేస్తున్నారు[5].
భౌగోళిక ప్రాంతముసవరించు
కాఠ్మండు నగర పరిధిసవరించు
అధికారికంగా కాఠ్మండు నగర పరిధి నిర్థారించనప్పటికీ, ఈ నగర పరిధి మూడు జిల్లాలలో విస్తరించి ఉన్నది . ఈ మూడు జిల్లాలలోనే దేశ జనాభాలో అత్యధిక జనాభా కేంద్రీకృతమై ఉంది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పరిపాలనా జిల్లా | విస్తీర్ణము (km²) | జనాభా (2001 జనాభా లెక్కలు) | జనాభా (2011 జనాభా లెక్కలు) | జన సాంద్రత (/km²) |
---|---|---|---|---|
కాఠ్మండు | 395 | 1,081,845 | 1,740,977 | 4408 |
లలిత్‌పూర్ | 385 | 337,785 | 466,784 | 1212 |
భక్తపూర్ | 119 | 225,461 | 303,027 | 2546 |
కాఠ్మండు నగర పరిధి | 899 | 1,645,091 | 2,510,788 | 2793 |
వాతావరణముసవరించు
నేపాల్ లో ముఖ్యంగా ఐదు రకాలైన వాతావరణ ప్రదేశాలు చూడవచ్చు. ఈ కేంద్రాలలో భాగంగా కాఠ్మాండు ఉష్ణ ప్రాంతములో ( సముద్ర మట్టానికి 1,200–2,300 మీటర్లు (3,900–7,500 ft) ) విస్తరించి ఉంది. ఈ నగరంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలుసవరించు
చిత్రమాలికసవరించు
మూలాలుసవరించు
- ↑ "An Overview of the Central Development Region (CR)" (PDF). Internal-displacement.org. Archived from the original (PDF) on 2012-02-02. Retrieved November 25, 2013.
- ↑ "History". Kathmandu.gov.np. Retrieved 16 May 2010.
- ↑ "National Population and Housing Census 2011" (PDF). National Planning Commission Secretariat, Central Bureau of Statistics (CBS), Government of Nepal. November 2012.
- ↑ "Introduction". Kathmandu Metropolitan City, Government of Nepal. Retrieved 2009-12-12.
- ↑ 5.0 5.1 "सुस्त उत्खनन » पुरातत्व » सम्पदा :: नेपाल ::". Ekantipur.com. 2010-06-09. Archived from the original on 2010-09-11. Retrieved 2012-01-15.