కంచర్ల శ్రీకాంత్

కంచర్ల శ్రీకాంత్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి 

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మార్చి 2023 - 29 మార్చి 2029

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 29
అత్తంటివారిపాలెం, వోలేటివారిపాలెం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కంచర్ల రామయ్య, ధనలక్ష్మి
జీవిత భాగస్వామి సరిత
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం పామూరు రోడ్ , కందుకూరు, నెల్లూరు
పూర్వ విద్యార్థి బీటెక్‌, ఎంబీఏ ఎంఐఈ
మతం హిందూ మతము

రాజకీయ జీవితం

మార్చు

కంచర్ల శ్రీకాంత్ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కందుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి 2017, 2019లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జెడ్పీటీసీ అవార్డు అందుకున్నాడు. ఆయన 2021లో ఐ.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[2] శ్రీకాంత్  2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 34108 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3]

కంచర్ల శ్రీకాంత్ 2024 నవంబర్ 12న శాసనమండలిలో విప్‌గా నియమితుడయ్యాడు.[4][5][6]

మూలాలు

మార్చు
  1. Eenadu (18 March 2023). "పట్టభద్రుల స్థానాల్లో రెండు తెదేపాకే". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  2. Andhra Jyothy (19 October 2021). "ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంచర్ల శ్రీకాంత్‌". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  3. A. B. P. Desam (18 March 2023). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బూస్ట్- ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ అభ్యర్థుల విజయం". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  4. Eenadu (13 November 2024). "అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  5. Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  6. Eenadu (13 November 2024). "శాసనసభలో విప్‌గా థామస్‌.. మండలిలో కంచర్ల". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.