కండరము

(కండరాలు నుండి దారిమార్పు చెందింది)

కండరాలు (Muscles) శక్తిని ఉపయోగించి చలనము కలిగిస్తాయి. ఈ చలనము బహిర్గతం కాని అంతర్గతంగా కాని ఉంటుంది. కండరాలలో మూడు రకాలున్నాయి. వీటిలోని గుండె, ప్రేగు కండరాల సంకోచ వ్యాకోచాలు మనిషి మనుగడకు అత్యవసరం. మనిషి శరీర చలనానికి సంకల్పిత కండరాలు ముఖ్యం. మన శరీరంలో ఇంచుమించు 639 కండరాలున్నట్లు ఒక అంచనా. గుండె, ప్రేగుల కండరాలు అసంకల్పిత కండారాలు అనగా వీటి కదలిక మనకు తెలియకుండానే జరిగిపోతుంది.

కండరాలలో రకాలు.

కండరాల నిర్మాణంసవరించు

అస్థి కండరాలుసవరించు

కండర తంతువులు (Muscle fibres or Myocytes) అనే కండర కణాలతో ఈ కండరాలు ఏర్పడి ఉంటాయి. కండరం మొత్తాన్ని ఆవరించి కొల్లాజన్ తంతువుల ఎపీమైసియమ్ (Epimyceum) అనే సంయోజక కణజాల నిర్మితమైన తొడుగు ఉంటుంది. ఈ తొడుగు లోపలికి విస్తరించి, కండరాన్ని కొన్ని కట్టలు (Fascicles) గా విభజిస్తూ వాటి చుట్టూ ఆచ్ఛాదనంగా పనిచేస్తుంది. దీనిని పెరిమైసియమ్ (Perimyceum) అంటారు. ఇది కండరపు కట్టలోకి ప్రవేశించి ప్రతి కండర కణం చుట్టూ మరో సున్నిత ఆచ్ఛాదనం ఏర్పరుస్తుంది. దీనిని ఎండోమైసియమ్ (Endomyceum) అంటారు. కండర కణజాలం వెలుపలికి విస్తరించిన ఈ తంతు నిర్మిత కణజాలపు తొడుగులు అన్నీ కలసి స్నాయు బంధనాలుగా ఏర్పడతాయి. ఇవి ఎముకలతో అంటి పెట్టుకోవడమే కాకుండా, వాటిలోని కొల్లాజన్ తంతువులు అస్థిక చుట్టూ ఉండే సంయోజక కణజాల నిర్మితమైన పరి అస్థిక (Periosteum) తో కలసిపోయి ఎముక - కండరం మధ్య సంధానం దృఢంగా అతికి ఉండేందుకు తోడ్పడతాయి.

ముఖ్య లక్షణాలుసవరించు

 • క్ష్యోభ్యత (Irritability) : కండారాలు ఉద్దీపనలను గ్రహించి వాటికి అనుగుణంగా అనుక్రియను జరుపుతాయి.
 • సంకోచత్వం (Contractility) : కండరాలు ప్రేరేపణలు, వాటి బలాలను బట్టి సంకోచిస్తాయి.
 • వహనం (Conduction) : కండరంలో ఒకచోట గ్రహించబడిన ఉద్దీపనాన్ని కండరమంతా ప్రసారం చేస్తాయి.
 • స్థితిస్థాపకత (Elasticity) : కండరం సంకోచం లేదా సడలిక చెందిన తరువాత తిరిగి తన మామూలు స్థితికి చేరుకుంటుంది.

కండరములలో రకములుసవరించు

 
బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు. a) అస్థి కండరములు; b) నునుపు కండరములు; c) హృదయ కండరములు

కండరముల అమరికను బట్టిసవరించు

ఇవి రెండు రకాలు. మొదటిది, ఫేసిక్ కండరములు ( Phasic muscles). ఈ కండరముల మూలములు బాహ్య, అంతర అస్థి పంజర నిర్మాణముల వద్ద ఏర్పడి వాటిపైన చొచ్చుకొని ఉండును. ఇవి ఉపాంగాల కదలికలకు బాధ్యత వహించును.
రెండవది, టోనిక్ కండరములు (Tonic muscles). ఇవి సున్నిత అవయవములైన గుండె మూత్రాశయము, జీర్ణవ్యవస్థ, శరీరకుడ్యముల వంటి భాగములలో ఉండును. ఇవి నెమ్మదిగా శంకోచించును.

బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములుసవరించు

హృదయ కండరములోని ఒక కణం కొట్టుకొనటం

ఇవి మూడు రకాలు. మొదటిది, అస్థి కండరములు ( Skeletal muscles). వీటిని చారల కండరములని కూడా అంటారు.ఇవి జీవి యొక్కఇచ్ఛకు అధీనముగా పనిచేయును. కనుక సంకల్ప కండరములు అంటారు. ఎముకలకు కలుపబడి లేక అతుకబడి ఉండును. కనుక అస్థి కండరములు అంటారు. ఇవి శరీర బరువులో 40 నుండి 50 శాతం ఉండును.[1]
రెండవది, నునుపు కండరములు (Smooth muscles). ఈ కండరములపై చారలుండవు. కనుక వీనిని నునుపు కండరములు అంటారు. ఇవి జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, మూత్రాశయము, ధమనులు, సిరలు మొదలగు అంతర్నిర్మాణములలో ఏర్పడి ఉండును. కనుకనే ఈ కండరములనువిసరల్ కండరములు అంటారు.
మూడవది, హృదయ కండరములు (Cardiac muscles). ఇవి హృదయములో మాత్రమే ఉండును . హృదయము కండరము అసంకల్పితముగా పని చేయును. హృదయము కండరమునందు అంతర్ చక్రికలు (Inter calated discs ) ఏర్పడి యుండి విద్యుత్ తరంగములను తరలించును.[2][3]

అస్థికండర తంతువు సామాన్య నిర్మాణము (General Structure of A Skeletal Muscle Fibre )సవరించు

కండరానికి కండర తంతువులు నిర్మాణాత్మక ప్రమాణాలు.అనేక కండర తంతువుల కలయిక వలన కండరము ఏర్పడుతుంది.కండర తంతువుల పరిమాణము కండరము ఏర్పడటానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధమును కలిగి ఉండదు.సాధారణంగా కండర తంతువులను కప్పుతూ కొల్లాజిన్ పోగులు, బంధన కణజాలము ఉంటుంది. కండరతంతువుల కొనలు స్నాయు బంధనాలుగా ఏర్పడి వాటి సహాయముతో ఎముకలకు అతికి ఉంటాయి.

 • భౌమన్ ( BOWMAN 1940 ) ఆభిప్రాయం ప్రకరము ప్రతికడర తంతువు పొడవుగా డండి, బహుకేంద్రక సహితమై, సార్కోలెమ్మా త్వచముతో కప్పబది ఉంటుంది. కండర తంతువులోపల అర్ధద్రవ జీవ పదార్ధమైన సార్కోప్లాసమ్ ను (ROLLET,1891) కల్గి, అనేక ఆయుత సంకోచ నిర్మాణాలైన కండరసూక్ష్మ తంతువులు ( Myofibrils) లేక కండర సూక్ష్మ పోగులు (Myofilaments) ఉంటాయి.
 • చరల కండర తంతువులు ఒక దాని నుండి మరొకటి పల్చని త్వచమైన ఎండోమైసియమ్ (Endomysium) తో వేరుచేయబది ఉంటాయి.చారల కండర తంతువుల కట్టను ఫాసిక్యులై అంటారు.ప్రతి ఫాసిక్యులస్ ను చుట్టి పెరిమైసియమ్ (Perimysium) అనుబంధన కణజాలపు తొడుగు ఉంటుంది. అన్ని ఫాసిక్యులైను చుట్టి ఎపిమైసియమ్ (Epiomysium) అను స్థితిస్థాపక తొడుగు ఉంటుంది.
 • ప్రతి కండర తంతువు మధ్యలో ఉబ్బి కొనలు మొనదేలి ఉంటాయి. కొనలను స్నాయుబంధనాలు అంటారు. ఈ కండరాలు జివి ఇష్టానిష్టాలకనుగుమణ్యంగా పనిచేయటంవలన వీటిని నియంత్రిత కండరాలు అని కూడా అంటారు.
 • అస్థి కండర తంతువును సాధారణ సూక్షదర్శినిలో పరిశీలించినపుడు దీని మీద ముదురు పట్టీలు కాంతి రహితంగా కనబడతాయి. ఈ చీకటి భాగాలను అసమప్రసారక (Anisotropic-A పట్టి) అని, కాంతి వంతమైన భాగాలను సమప్రసారక పట్టీలు (Isotropic I పట్టి) అంటారు.
 • ఎలక్ర్టాన్ సూక్ష్మదర్శినిలో గమనించినపుడు ప్రతికండర సూక్ష్మతంతువుమీదా నిర్ణీతప్రాంతాలలో అడ్డంగా విభజింపబడిన అనేక త్వచాలంటాయి. వీటిని Z త్వచాలంటారు. రెండు Z త్వచాల మధ్యనున్న కండర సూక్ష్మ తంతువు భాగమును సార్కోమియర్ అంటారు.

సార్కోమియర్ ( Sarcomere)  : ప్రతి సార్కోమియర్ లో రెండు రకాల సున్నితమైన తంతువులు క్రమబద్ద్ంగా అమరి ఉంటాయి. అవి దళసరి మయోసిన్ తంతువులు, సున్నితమైన ఏక్టిన్ తంతువులు. ఏక్టిన్ తంతువు ఒక కొన Z త్వచముతో అతికి, రెండవ కొన స్వేచ్ఛగ ఉంటుంది. రెండు ప్రక్క ప్రక్కనే ఉన్న Z త్వచాలను అంటి పెట్టుకొని ఉన్న ఏక్టిన్ పోగులు కండరము వ్యాకోచ స్థితిలో ఉన్నప్పుడు మధ్యలో కలిసి ఉండవు. సార్కోమియర్ మధ్యలో ఉన్న మందమైన మయోసిన్ పోగులు, Z త్వచాల వరకు చేరక వాటి కొనలు స్వేచ్ఛగా ఉంటాయి. కాబట్టి ఏక్టిన్ పోగులు సార్కోమియర్ మధ్యలో కలసి ఉండవు. కనుక సార్కోమియర్ మధ్య భాగము మయోసిన్ పోగులతో ఆక్రమించబడి ఉంటుంది. ఈ ప్రాంతమును H పట్టీ .

ముఖ్యమైన కండరాలుసవరించు

వ్యాధులుసవరించు


మూలాలుసవరించు

 1. Marieb, EN; Hoehn, Katja (2010). Human Anatomy & Physiology (8th ed.). San Francisco: Benjamin Cummings. p. 312. ISBN 978-0-8053-9569-3.
 2. Pollard, Thomas D. and Earnshaw, William. C., "Cell Biology". Philadelphia: Saunders. 2007.
 3. Olivetti G, Cigola E, Maestri R, et al. (July 1996). "Aging, cardiac hypertrophy and ischemic cardiomyopathy do not affect the proportion of mononucleated and multinucleated myocytes in the human heart". Journal of Molecular and Cellular Cardiology. 28 (7): 1463–77. doi:10.1006/jmcc.1996.0137. PMID 8841934.
"https://te.wikipedia.org/w/index.php?title=కండరము&oldid=3850648" నుండి వెలికితీశారు