ఎముక
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎముకలు మన శరీరానికి ముఖ్యమైన ఆధారము. ఇవి రకరకాల పరిమాణాల్లో, ఆకారాలలో ఉంటాయి.
ఎముకల పట్టికసవరించు
- 1-4 - కపాలం
- 5, 6 - జంభిక
- 7 - హనువు
- 8 - మెడ వెన్నెముకలు
- 9 - నాసికాస్థులు
- 10 - ఉరోస్థి
- 11 - దండ ఎముక
- 12 - అరత్ని
- 13 - రత్ని
- 14 - కటి వెన్నెముకలు
- 15 - శ్రోణి మేఖల
- 16 - త్రికాస్థి
- 18 - తుంటి ఎముక
- 19 - జానుఫలకము
- 20 - అంతర్జంఘిక
- 21 - బహిర్జంఘిక
- 25 - జత్రుక
- 28 - పక్కటెముకలు
ఎముక విరుపుసవరించు
ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
ఎముక విరుపులోని రకాలుసవరించు
- సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture) : ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొంత భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు.
- చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture) : ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
- జటిలమైన ఎముక విరుపు (Complicated fracture) : ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
- విఖండిత విరుపు:
- లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.
ఎముక విరుపు గుర్తించడంసవరించు
- ఎముక విరిగిన చోట నొప్పిగా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేదు.
- విరిగిన చోట చుట్టూ వాపు ఉంటుంది.
- విరిగిన శరీర భాగాన్ని మామూలుగా కదల్చలేరు.
- విరిగిన చోట విరిగిన లేదా రాసుకున్న శబ్దం వస్తుంది లేదా తెలుస్తుంది.
- విరిగిన చోట కదలక అసామాన్యంగా ఉంటుంది.
- చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. దీనికి కారణం ఎముక విరిగినప్పుడు దానికి అంటిపెట్టుకొని వున్న కండరాలు సంకోచించి, విరిగిన ఎముకల కొనలను ఒక దానిపై మరొకటి వచ్చేలా లాగుతాయి. దానితో ఆ భాగం పొట్టిగా అవుతుంది.
ఎముక విరుపుకు ప్రథమ చికిత్ససవరించు
- ప్రమాదం జరిగిన చోటనే ప్రథమ చికిత్స చేయాలి.
- రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి.
- దెబ్బ తగిలిన భాగానికి కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా, గట్టిగా కట్టుకట్టాలి.
- విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు.
- ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరలోని వైద్యుని వద్దకు తీకుకొని వెళ్ళాలి.
- ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా మన ఎముకలను జాగ్రత్తగా చూసుకోవచ్చు. Pura Vida Advanced Bone Support Tablets [1] వంటి సప్లిమెంట్లను కూడా ప్రయత్నించండి. ఈ బోన్ సపోర్ట్ టాబ్లెట్‌లు ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకల పెరుగుదలను ప్రోత్సహించడానికి, రికవరీని వేగవంతం చేయడానికి మరియు ఎముకలను నయం చేయడానికి సహాయపడతాయి.
వ్యాధులుసవరించు
- బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) :ఎముకలు గుల్లబారటాన్ని (ఆస్టియోపోరోసిస్) అడ్డుకునే టీకాను బ్రిటన్ శాస్త్రవేత్తలు తయారుచేశారు.ఆస్టియోపోరోసిస్ బాధితుల్లో ఎముకలు బలహీనమై, పెళుసుగా తయారవుతాయి. వీరిలో కొత్త ఎముక కణజాలం తయారవటానికన్నా ముందే పాత ఎముక త్వరత్వరగా క్షీణిస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఎముక క్షీణతను నిలువరించటానికి మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. టీకా కొత్త ఎముక తయారయ్యే వేగాన్ని తగ్గించే స్ల్కెరోస్టిన్ అనే ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. కొత్త ఎముక రూపొందే వేగాన్ని పెంచుతుంది. (ఈనాడు 23.4.2011)
- ఎముకల క్యాన్సర్ (Bone cancer)
- దీర్ఘకాలిక మనోవేదన శరీరంలోని ఎముకలను బలహీనపరుస్తుందని, ఎముకల్లోని ఖనిజాల సాంద్రత తగ్గిపోవటం వల్ల ఇది జరుగుతుంది.ముసలితనం, అనువంశికంగా సంక్రమించటం, లైంగిక హార్మోన్లు తక్కువగా ఉండటం, కాల్షియం, విటమిన్ డీ లోపం, మానసిక ఆందోళన తదితర లక్షణాలున్నప్పుడు.. ఎముకల్లో ఖనిజాల సాంద్రత తక్కువగా ఉంటుంది. (ఈనాడు17.4.2011)
బయటి లింకులుసవరించు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up ఎముక in Wiktionary, the free dictionary.
- Educational resource materials (including animations) by the American Society for Bone and Mineral Research
- Review (including references) of piezoelectricity and bone remodelling
- A good basic overview of bone biology from the Science Creative Quarterly
- Bone Health at Got Bones?
- Osteopathic physicians