చలనం
(చలనము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చలనం లేదా కదలడం అనగా ఒక జీవులు లేదా వస్తువుల స్థానంలో మార్పుచెందడం అనగా స్థానభ్రంశం.
అతి చిన్న సూక్ష్మజీవుల నుండి ఖగోళంలోని అతి పెద్ద గ్రహాల వరకు అన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి.
రకాలు
మార్చు- సరళరేఖా చలనం
- సరళ హరాత్మక చలనం : ఒక వస్తువు స్థిర పథంలో ఉంటూ, దాని త్వరణం దాని స్థానబ్రంశానికి అనులోమానుపాతంలోను, విరామ స్థానం వైపుగాను ఉండేటట్లుగా, ముందుకి, వెనుకకి ఉంటే, ఆ వస్తువు "సరళ హరాత్మక చలనం" చేస్తున్నదని అంటాము.
- బ్రౌనియన్ చలనం
- వర్తులాకార చలనం
- ప్రకంపనం
- స్థానాంతర చలనం: ఒక వస్తువు నిర్థిష్ట కాలవ్యవథిలో ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చలనం చేయటాన్ని స్థానాంతర చలనం అంటారు.
- డోలాయమాన చలనం: ఒక వస్తువు ఒక స్థిర బిందువు నుండి ఇరువైపులా డోలనాలు చేసే చలనాన్ని డోలాయమాన చలనం అంటారు. దీనినే కంపన చలనం అని కూడా అంటారు.
చలనచిత్రాలు
మార్చుకదిలే చిత్రాలు లేదా చలనచిత్రాలు ఆధునిక కాలంలో సినిమా అంటున్నాము. ప్రాచీన కళల్వాలు పాఠ్యంలోని చిత్రపటాలు కదలకుండా స్థిరంగా ఉంటాయి. వానితో పోలిస్తే వీనిలో చలనం ఉంటుంది.
చలనాంగాలు
మార్చుచలనానికి ఉపయోగపడే అవయవాలు చలనాంగాలు.
- మానవులలో, ఇతర జంతువులలో కాళ్ళు చలనాంగాలు.
- అమీబా వంటి కొన్ని ఏకకణ జీవులలో మిధ్యాపాదాలు (Pseudopodia) చలనాంగాలు.
- బాక్టీరియా వంటి సుక్ష్మక్రిములలో కశాభాలు (Flagella) చలనాంగాలు.
- చేపలు మొదలైన జలచరాలలో తోక ముఖ్యమైన చలనాంగం. ఇవి ఈదుకొని ముందుకు కదులుతాయి.
- పక్షులు మొదలైన గాలిలో ఎగిరే జీవులకు రెక్కలు చలనాంగాలు. ఇవి భూమి మీదనుండి గాలిలోకి ఎగరడానికి, ఎగురుతుండగా వాటి దిశను మార్చుకోడానికి దిగడానికి కూడా ఉపయోగపడతాయి.