కందుకూరి అంబికా వరప్రసాదరావు

కందుకూరి అంబికా వరప్రసాదరావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు, న్యాయవాది.[1]

అంబికా వరప్రసాదరావు
జననం1884
ఏలూరు
మరణంసెప్టెంబరు 20, 1964
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు , న్యాయవాది

అంబికా వరప్రసాదరావు 1884లో ఏలూరులో జన్మించాడు

రంగస్థల ప్రస్థానం

మార్చు

ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత ముంజులూరి కృష్ణారావుతో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. వేదం వేంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది. ప్రతాపరుద్రీయంలో పేరిగాని పాత్రలో నటించి, అచ్చంగా తెలంగాణా రజకుడనిపించేలా తన ప్రతిభను ప్రదర్శించాడు.

నటించిన పాత్రలు

మార్చు
  • పేరిగాడు
  • వాసుదేవమూర్తి
  • అక్బరు
  • సలీం
  • రామప్పంతులు
  • కరండకుడు
  • పిచ్చిరామ శాస్త్రి
  • రాజా కళింగ గంగు

సన్మానాలు

మార్చు

60 సంవత్సరాలకు పైగా నాటకరంగానికి సేవలందించిన వరప్రసాదరావు 1964, సెప్టెంబరు 20న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.182.