కందుల వెంకటేష్

కందుల వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాణేల సేకర్త, పరిశోధకుడు.

కందుల వెంకటేష్ (జననం 1979 జనవరి 12) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాణేల సేకర్త(numismatist), పరిశోధకుడు.[1][2][3]

కందుల వెంకటేష్
జననం (1979-01-12) 1979 జనవరి 12 (వయసు 45)
కాకినాడ, ఆంద్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
జాతీయతభారతీయుడు India
విద్య జేఎన్టీయూ హైదరాబాద్
భార్య / భర్తఇందిరా శేషుమాంబ

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకుని వివిధ ప్రైవేటు సంస్థలలో (డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, శ్రీని ఫార్మా, గ్లోబియాన్ ఇండియా) లలో పనిచేసి ప్రస్తుతం దక్కను కెమికల్స్ అనే సంస్థలో ఇంజనీరింగు మేనేజరుగా పనిచేస్తున్నాడు.

తొలినాళ్ళ జీవితం మార్చు

వెంకటేష్ తల్లిదండ్రులు వీరభద్ర రావు, చిన్నాదేవి. ఇతను చిన్నప్పటినుండే తన తాత గోలి సత్తిరాజు ప్రోత్సాహంతో పురాతన నాణెములు సేకరించడం అభిరుచిగా మలచుకున్నాడు.

కెరీర్ మార్చు

జేఎన్టీయూ హైదరాబాద్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకుని వివిధ ప్రైవేటు సంస్థలైన డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, శ్రీని ఫార్మా, గ్లోబియాన్ ఇండియా లలో పనిచేసి ప్రస్తుతం దక్కను కెమికల్స్ అనే సంస్థలో ఇంజనీరింగు మేనేజరుగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటినుండి నాణేల సేకరణపై ఉన్న మక్కువతో సేకర్తగా మారాడు.

నాణేల సేకర్తగా మార్చు

తెలుగునేలను పరిపాలించిన జనపదులు,  చక్రవర్తులు, రాజులు, సుల్తానులు తమ పరిపాలనా కాలములో చలామణిలోకి తెచ్చిన నాణెములు అలాగే తెలుగు జాతికి చెందిన రాజులు వేరే ప్రాంతాలను పరిపాలించిన కాలములో చలామణిలోకి తెచ్చిన నాణెములను సేకరించి వాటిని పరిశోధించి  ఆ నాణెములను ప్రదర్శిస్తూ నలుగురికీ  చరిత్రపై అవగాహన కల్పించడం ఇతని అభిరుచి.  ఈ పురాతన నాణెములు ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ వైభవం, తెలంగాణ బుద్ధ సంగీతి, ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సమావేశాలు, కాకినాడ, రాజమహేంద్రి, విశాఖపట్నం లాంటి మ్యూజియంలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసాడు.[4]

ఈ ప్రదర్శనల ద్వారా మన ప్రాంత గొప్ప చరిత్ర అలాగే సంస్కృతి పైన ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాడు. "ఎవరైతే తమ చరిత్రను తెలుసుకోరో .. ఎవరైతే చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోరో .. వారికి చరిత్ర గుణపాఠం నేర్పుతుంది" అని చెప్పిన అంబేద్కర్ మాటలు ననుసరించి నాణేముల ద్వారా తెలుగు వారి చరిత్ర నిర్మించేందుకు కృషి చేస్తున్నాడు.[5]

వెంకటేష్ తెలుగు నేలపైన లభించిన పురాతన నాణెముల ద్వారా నాటి ఆర్థిక స్థితిగతులను,సాంకేతిక మార్పులను, లిపి పరిణామాన్ని,  భాషలను, రాజుల వంశక్రమాన్ని, లోహ శాస్త్ర పరిణామాన్ని, మత విధానములను, దుస్తుల పరిణామాన్ని, సంకేతాలను , రాజకీయ & సామాజిక మార్పులను పరిశోధిస్తున్నాడు. పురాతన నాణేముల  పరిశోధన కోసం భారతదేశపు తొలి లిపి, ప్రస్తుత భారత దేశపు లిపులకు మూలమైన బ్రహ్మీ లిపిని వెంకటేష్ అధ్యయనం చేసాడు. వెంకటేష్ సేకరణలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి  అశ్మక జనపదం, ఆంధ్ర జనపదము, మౌర్య సామ్రాజ్యం(కీ. పూ. ౩వ శతాబ్దము), శాతవాహనులకు పూర్వం పాలించిన గోబద, నరన, సిరి కమ, సిరివాయ, సమ గోప వంటి రాజులు నాణెములు. శాతవాహన రాజులైన సిరి శిముక (కీ. పూ. 1 వ శతాబ్దము), సిరి శాతవాహన(కీ. పూ. 1 వ శతాబ్దము), సిరి శాతకర్ణి, సిరి పులమావి వంటి రాజుల నాణెములు, ఇక్షాకులు(కీ. శ. ౩వ శతాబ్దము)  , విష్ణుకుండినులు (కీ. శ. 4-6 వ శతాబ్దము), చాళుక్యులు (కీ. శ. 7 -11 వ శతాబ్దము), కాకతీయులు, చోడులు, విజయనగర సామ్రాజ్యం, మొగల్ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, నిజాం నవాబులు, ఈస్టిండియా కంపెనీ నాణెములు, బ్రిటిష్ ఇండియా నాణెములు వెంకటేష్ సేకరణలో చూడవచ్చు.[6]

మైలు రాళ్లు మార్చు

  • 276 దేశాలకు చెందిన 1200 నాణేలు.
  • 100 దేశాలకు చెందిన 250కి పైగా నోట్లు.
  • 93 దేశాలకు చెందిన స్టాంపులను సేకరించాడు.

మూలాలు మార్చు

  1. "కందుల వెంకటేశం.. పురాతన నాణేల మ్యూజియం". Samayam Telugu. Retrieved 2021-07-19.
  2. "An Avid Collector of Ancient Telugu Coins | Mintage World". web.archive.org. 2021-07-19. Archived from the original on 2021-07-19. Retrieved 2021-07-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Ganguly, Nivedita (2018-05-19). "Revisiting history through coins". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-07-20.
  4. "కందుల వెంకటేశం.. పురాతన నాణేల మ్యూజియం". Samayam Telugu. Retrieved 2021-07-19.
  5. Reporter, Staff (2018-09-07). "A treat for numismatic enthusiasts". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-07-20.
  6. Feb 15, Mahesh Buddi / TNN /; 2011; Ist, 23:24. "A treasure trove of coins, stamps | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)