కంభంపాటి లక్ష్మారెడ్డి

కంభంపాటి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుండి 2008 వరకు నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

కంభంపాటి లక్ష్మారెడ్డి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 నుండి 2008
ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి
తరువాత రేవూరి ప్రకాష్ రెడ్డి
నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1962
నర్సంపేట, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 23 మార్చి 2014
రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నర్సమ్మ
జీవిత భాగస్వామి ధనలక్ష్మి
సంతానం సరిత, కిరణ్
నివాసం నర్సంపేట
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం సవరించు

కంభంపాటి లక్ష్మారెడ్డి 1962లో తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నర్సంపేటలో జన్మించాడు. ఆయన 10వ తరగతి వరకు చదివాడు.

రాజకీయ జీవితం సవరించు

కంభంపాటి లక్ష్మారెడ్డి మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన 1998 నుంచి తునికాల కాంట్రాక్టర్‌గా కొనసాగాడు. ఆయన మాలి దశ తెలంగాణ ఉద్యమంలో 2001లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో గ్రామా స్థాయి కార్యకర్తగా చేరాడు. ఆయన 2004 ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా నర్సంపేట నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై 14,908 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

కంభంపాటి లక్ష్మారెడ్డి 2007లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్నికారణాల వల్ల టిఆర్ఎస్ పార్టీని విడి మూఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఆయన ఆ తర్వాత 2009లో రాజశేఖర్‌రెడ్డి మరణంతో రాజకీయలకు దూరంగా ఉన్నాడు.

మరణం సవరించు

కంభంపాటి లక్ష్మారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ 23 మార్చి 2014న మరణించాడు. ఆయనకు భార్య ధనలక్ష్మి, కూతురు సరిత, కుమారుడు కిరణ్ ఉన్నాడు.[2]

మూలాలు సవరించు

  1. Entrance India (9 October 2018). "Narsampet 2004 Assembly MLA Election Telangana". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  2. Sakshi (24 March 2014). "కంభంపాటి'కి కన్నీటి నివాళి". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.