కచ్ ఏజెన్సీ
కచ్ ఏజెన్సీ | |||||
ఏజెన్సీ | |||||
| |||||
కచ్ ఏజెన్సీ మ్యాపు | |||||
చరిత్ర | |||||
- | Established | 1819 | |||
- | వెస్టర్న్ ఇండియా స్టేట్స్ ఏజెన్సీ ఏర్పాటు | 1924 | |||
విస్తీర్ణం | |||||
- | 1901 | 19,725 km2 (7,616 sq mi) | |||
జనాభా | |||||
- | 1901 | 4,88,022 | |||
Density | 24.7 /km2 (64.1 /sq mi) |
బ్రిటిషు భారతదేశం లోని ఏజెన్సీలలో కచ్ ఏజెన్సీ ఒకటి. రాజకీయ ఏజెంటుగా నియమితుడైన వ్యక్తి,19,725 చదరపు కిలోమీటర్లు (7,616 చ. మై.) విస్తీర్ణంలో ఉన్న కచ్ సంస్థానం ఒక్క దాన్నే చూసుకునేవాడు. ఇందులో రాన్ ఆఫ్ కచ్ భాగం కాదు.
ఏజెన్సీ ప్రధాన కార్యాలయం భుజ్‌లో ఉండేది.[1] ఏజెంట్ అక్కడే నివసించేవాడు. అతను బొంబాయి ప్రెసిడెన్సీలోని పొలిటికల్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం అధీనంలో ఉండేవాడు.[2]
చరిత్ర
మార్చు1819లో కచ్ రాష్ట్రం బ్రిటిషు రక్షిత ప్రాంతంగా మారినప్పుడు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసారు.[3]
కెప్టెన్ జేమ్స్ మాక్‌ముర్డో మొదట ఏజెంటుగా, కచ్ కలెక్టర్‌గా, రెసిడెంటుగా నియమితుడయ్యాడు. కచ్ సంస్థానానికి రాజధానైన భుజ్‌కు దూరంగా, అంజర్‌లో అతని కార్యాలయం ఉండేది.[4]
కచ్ ప్రగతిశీల ప్రయాణం 1899-1900 కరువుతో ఆగిపోయింది.[3] కరువు సంస్థానమంతటా తీవ్ర ప్రభావం చూపింది. 1891 లో 5,58,415 గా ఉన్న కచ్ జనాభా, కరువు కారణంగా 1901 లో 4,88,022 కి తగ్గింది. [5]
1924 అక్టోబరు 10 న కచ్ ఏజెన్సీని రద్దు చేసి, వెస్టర్న్ ఇండియా స్టేట్స్ ఏజెన్సీలో విలీనం చేసారు.[6][1][7]
ఇవి కూడా చూడండి
మార్చు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 The Indian Year Book, Volume 11 by Bennett, Coleman & Company, 1924,pp:151-152
- ↑ Sessional Papers - Volume 31, Great Britain. Parliament. House of Commons published by H.M. Stationery Office, 1900 - Page 464
- ↑ 3.0 3.1 Chisholm, Hugh, ed. (1911). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. .
- ↑ Gazetteer, Volume 5 By Bombay (India : State). 1880. p. 268. Retrieved 20 September 2014.
- ↑ The Imperial Gazetteer of India, British India Office.
- ↑ The India Office and Burma Office List by Harrison and sons, Limited, 1922- Page 393
- ↑ The Indian and Pakistan Year Book, Volume 23. 1936. p. 172.