కటి ఎముకలతో చేయబడిన గిన్నెలాంటి భాగం. ఇది వెన్నెముకకు క్రిందిభాగంలో రెండు తొడలను మొండెంతో కలుపుతుంది. దీనిలో జననేంద్రియాలు, జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ అంత్యభాగాలు భద్రంచేయబడ్డాయి.

Gray241.png
మగ వారి కటి

కటి వ్యాయామం

మార్చు

మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే మూత్రశాలకు వెళ్లాల్సి రావటమనేది మహిళల్లో తరచుగా కనిపించే సమస్యే. అయితే ఇలాంటిది పురుషుల్లో కనిపిస్తే చాలామంది ప్రోస్టేట్ సంబంధ సమస్యగా భావిస్తుంటారు. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. మూత్రం ఆపుకోలేని మహిళలకు కటి భాగం కండరాలు బలోపేతం కావటానికి ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి స్త్రీలకు మాత్రమే కాదు ఇలాంటి సమస్యతో బాధపడే పురుషులకూ మేలు చేస్తున్నట్టు ఒక అధ్యయనంలో బటయపడింది. ఇవి మందులతో సమానంగా పనిచేస్తున్నట్టూ వెల్లడైంది. మూత్రాశయం అతిగా స్పందించే (ఓవర్‌యాక్టివ్ బ్లాడర్) గుణం గలవాళ్లు మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే మూత్రశాలకు వెళ్లాల్సిందే. ఇది క్రమంగా మూత్రం ఆపుకోలేకపోవటానికీ దారితీస్తుంది. వీళ్లు ప్రవర్తనకు సంబంధించిన మార్పులను పాటించటంతో పాటు అవసరమైతే మందులూ వేసుకోవాల్సి ఉంటుంది. మందులు వేసుకుంటున్నప్పటికీ మూత్ర సమస్యలతో బాధపడుతున్న మధ్యవయసు, వృద్ధులపై అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. అప్పటికే వేసుకుంటున్న మందులకు తోడు అదనంగా ఆక్సీబుటీనిన్ మందు వేసుకోవటం గానీ ప్రవర్తన పరమైన మార్పులను గానీ ఎనిమిది వారాల పాటు పాటించాలని వీరికి సూచించారు. ఈ పద్ధతుల్లో సాయంత్రం వేళల్లో ద్రవాలను తగ్గించటం, రాత్రిపూట మూత్రం వస్తున్నట్టు అనిపించినపుడు దాన్ని ఆపుకునే ప్రయత్నం చేయటం, కటి భాగం కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వంటివి ఉన్నాయి. ఈ వ్యాయామాల్లో భాగంగా.. కటి భాగం కండరాలు సంకోచించేలా రెండు నుంచి పది సెకన్ల పాటు గట్టిగా బిగపట్టి వదిలేయాలని చెప్పారు. ఈ వ్యాయామాన్ని రోజుకి 45 సార్లు (మొత్తం మూడు విడతల్లో) చేయాలని సూచించారు. మందులు వేసుకున్నవారితో పోలిస్తే వ్యాయామం చేసినవారిలో రాత్రిపూట మూత్రానికి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో మొత్తమ్మీద 90 శాతం మంది కొత్త చికిత్సతో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పటం విశేషం. మూత్రాశయ నియంత్రణ సమస్యలు గల పురుషుల్లో కటి వ్యాయాయం ప్రభావాలపై చేసిన తొలి అధ్యయనం ఇదేనని ఎమోరీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ తియోడోర్ ఎం.జాన్సన్ వివరిస్తున్నారు. ఈ సమస్యలకు మందులను ఇస్తున్నప్పటికీ వీటితో నోరు ఎండిపోవటం, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుండటంతో చాలామంది మధ్యలోనే మానివేస్తుంటారు. కాబట్టి తేలికైన, ఖర్చుతో పనిలేని ఈ వ్యాయామం చేయటం మంచిదని జాన్సన్ సూచిస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కటి&oldid=3253976" నుండి వెలికితీశారు