కటికి జలపాతం, విశాఖపట్నం సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం.[1]జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తుంటుంది. బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది గోస్తనీ నది నంచి ప్రారంభమవుతుంది. పారదర్శకంగా కనిపించే నీరు, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం దీని ప్రత్యేకతలు.

కటికి జలపాతం

ప్రయాణ సౌకర్యాలు మార్చు

రైల్లో ప్రయాణించే వారు బొర్రా గుహలు స్టేషన్ లో దిగితే అక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కటికి జలపాతం చేరుకోవడానికి కొన్ని జీపులు ఉంటాయి. ఈ జీపులు జలపాతానికి ఒక కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతాయి. అక్కడనుంచి కాలినడకనే జలపాతానికి చేరుకోవలసి ఉంటుంది.

రోడ్డు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం ఐదో నంబరు జాతీయ రహదారిలో యన్ఎడి జంక్షను వద్ద కుడివైపుకు తిరిగితే బొర్రా గుహలు జంక్షను రోడ్డు సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జంక్షను రోడ్డు దగ్గర అరకు లోయ వైపుకు తిరిగితే బొర్రా గుహలు సుమారు 10 కిలోమీటర్ల దూరం. గుహలకు సుమారు ఒక కిలోమీటరుకు ముందే గేట్ వల్సా దగ్గర ఎడమవైపుకు తిరిగితే కటికి జలపాతం కనిపిస్తుంది.

ఆటవిడుపు కార్యక్రమాలు మార్చు

జలపాతం అడుగున ఉన్న మడుగులో స్నానం చేసి సేదతీరుతుంటారు. ఇది పర్వతారోహణకు కూడా అనువైన ప్రదేశమే. అక్కడే గుడారాలు వేసుకుని వంట చేసుకుని కూడా తింటుంటారు.[2]

వాతావరణం మార్చు

కటికి జలపాతంలో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుంది. ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలం సాధారణంగా మార్చి మధ్య నుంచి జూన్ నెల మధ్య వరకు ఉంటుంది. ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు జూన్ నుంచి ప్రారంభమై సెప్టెంబరులో ముగుస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి దాకా చలికాలం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుండి డిసెంబరు మధ్య కాలం దీన్ని సందర్శించడానికి అనువైన సమయం.[2]

మూలాలు మార్చు

  1. "కటికి జలపాతం, అరకు లోయ". trawell.in. Retrieved 14 October 2016.
  2. 2.0 2.1 "కటికి జలపాతం". beautyspotsofindia.com. beautyspotsofindia.com. Archived from the original on 12 మార్చి 2016. Retrieved 22 November 2016.

వెలుపలి లంకెలు మార్చు