అరకు

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండల గ్రామం


అరకు ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలం లోని గ్రామం, పర్యాటక ప్రదేశం. ఇది తూర్పు కనుమలులో వున్నది. ఇక్కడ ప్రధానంగా గిరిజనులు నివసిస్తారు. ఈ ప్రాంతంలోని లోయ, బొర్రా గుహలు చూడదగినవి.

రెవిన్యూ గ్రామం
పటం
నిర్దేశాంకాలు: 18°20′18″N 82°50′49″E / 18.3383238°N 82.8469191°E / 18.3383238; 82.8469191Coordinates: 18°20′18″N 82°50′49″E / 18.3383238°N 82.8469191°E / 18.3383238; 82.8469191
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండలండుంబ్రిగుడ మండలం
విస్తీర్ణం
 • మొత్తం22.6 km2 (8.7 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం2,279
 • సాంద్రత100/km2 (260/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1099
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్531151 Edit this on Wikidata

భౌగోళిక అంశాలుసవరించు

 
OSM పటము

ఇది మండల కేంద్రమైన డుంబ్రిగూడ కి 13 కి. మీ., సమీప పట్టణమైన విజయనగరంకి 89 కి. మీ., విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉంది. సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది.

అరకులోయసవరించు

 
అరకు లోయ
 
నాట్యం చేస్తున్న గిరిజనులు.

అరకులోయ ప్రకృతి సౌందర్యానికి పేరుగాంచినది. శీతాకాలంలో వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో మరింత అందంగా తయారవుతాయి. అరకు చేరే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది.

విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే లైను కొత్తవలస - కిరండూల్లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వున్నాయి. రైలు ప్రయాణంలో "సిమిలిగుడ" అనే స్టేషను భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్గేజ్ స్టేషను. బొర్రా గుహలు చూడటానికి ఇక్కడ దిగాలి. అరకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ వసతి గృహాలు వున్నాయి.

దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. అరకు నుండి 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 574 ఇళ్లతో, 2279 జనాభాతో 2260 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1086, ఆడవారి సంఖ్య 1193. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 6 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1682.[3]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2115.[4] ఇందులో పురుషుల సంఖ్య 1016, మహిళల సంఖ్య 1099, గ్రామంలో నివాసగృహాలు 479 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి అరకులోయలో ఉంది.సమీప జూనియర్ కళాశాల అరకులోయలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పాడేరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విశాఖపట్నంలోను, పాలీటెక్నిక్ పాడేరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అరకులోయలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విశాఖపట్నంలోనూ ఉన్నాయి.

భూమి వినియోగంసవరించు

అరకులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 101 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 48 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2110 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2110 హెక్టార్లు

వర్తక వాణిజ్యాలుసవరించు

గిరిజన ఉత్పత్తులు, తేనె.

పాలనా విభాగాలుసవరించు

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్రస్థానం. ఇది పాడేరు రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

చూడవలసిన ప్రదేశాలుసవరించు

  • బొర్రా గుహలు
  • పద్మాపురం గార్డెన్స్
  • ట్రైబల్ మ్యూజియం
  • చాపరాయి
  • మత్స్యగుండ౦
  • కవిటి వాటర్ ఫాల్స్
  • రణ జల్లెడ వాటర్ ఫాల్స్
  • అనంత గిరి వాటర్ ఫాల్స్

చిత్రమాలికసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2014-01-04.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అరకు&oldid=3829163" నుండి వెలికితీశారు