పానగల్లు
గమనిక: పానగల్లు (పానగల్ అని కూడా పిలవబడుతుంది) ని మహబూబ్ నగర్ జిలాలోని అదేపేరుగల (పానగల్) మండలంతో వ్యత్యాసాన్ని గమనించగలరు.
పానగల్లు | |
— రెవిన్యూ గ్రామం — | |
పానగల్లు లోని ఛాయ సోమేశ్వర దేవాలయం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°05′36″N 79°17′47″E / 17.093199°N 79.296467°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండలం | నల్గొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,413 |
- పురుషుల సంఖ్య | 1,217 |
- స్త్రీల సంఖ్య | 1,196 |
- గృహాల సంఖ్య | 605 |
పిన్ కోడ్ | . 508 001 |
ఎస్.టి.డి కోడ్ | 08682. |
పానగల్లు, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలంలోని గ్రామం.[1]
ఇది మండల కేంద్రమైన నల్గొండ నుండి 3 కి.మీ. దూరంలో ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గ్రామ జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2,413 - పురుషుల సంఖ్య 1,217 - స్త్రీల సంఖ్య 1,196 - గృహాల సంఖ్య 605
చరిత్ర
మార్చుతొలి కాకతీయులకు సమకాలీనులైన కందూరు చోడులకు పానగల్లు గ్రామం పాలనా కేంద్రంగా ఉండేది. మధ్యయుగాల్లో ఈ గ్రామం వర్తక కేంద్రంగా ఉండేది.
గ్రామ విశేషాలు
మార్చుఇక్కడ ప్రాచీన పచ్చల సోమేశ్వర దేవాలయం, ఛాయా సోమేశ్వరాలయం ఉన్నాయి.[3][4] ఇక్కడ నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాంచనపల్లి శింగరాజు నిర్మించినట్టుగా చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తుంది.భోగ శ్రీనివాసమూర్తి ఇరు దేవేతలతో నెలవైన ఈ ఆలయం, భక్తులపాలిట పుణ్యధామమై విలసిల్లుతుంది. ఇప్పటికి 850 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది.[5] ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది.
గ్రామం ప్రత్యేకత
మార్చు- స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవాది, విప్లవకారుడు, మానవతావాది కాంచనపల్లి చినరామారావు జన్మస్థలం ఇదే.
వెలుపలి లింకులు
మార్చుప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
మార్చు- కట్టా నర్సింహారెడ్డి - మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ - హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) వైస్ చాన్స్లర్
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ విశాలాంధ్ర, నల్లగొండ (28 May 2011). "కళా నిలయాలు.... ఈ దేవాలయాలు..!". Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "పచ్చల సోమేశ్వరాలయం". www.ntnews.com. నగేష్ బీరెడ్డి. Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019.
- ↑ ఈనాడు జిల్లా ఎడిషన్, 28 సెప్టెంబరు 2013.