ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజక వర్గానికి 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఎమ్.ఎల్.ఏగా సేవలందింఛారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పద్ధతులు, రాస్ట్ర అగ్రనాయకత్వం పనితీరు నచ్చటం లేదని పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి ( నెలలో గడువు ముగుస్తుందడగా) రాజీనామా చేశారు. యుక్తవయసునుంచి రాజకీయాలలో ఉన్నారు, మధిర , కల్లూరు , సత్తుపల్లి , వైరా, తల్లాడ మండలాల్లో మంచి ప్రజామద్దతు ఉన్ననేత.

మార్క్సిస్టు పార్టిలో ఉండి, మధిర యం.యల్.ఎగా ఎన్నికయ్యి. మధిర యస్.సికి రిజర్వ్ అయ్యిన వెంటనే పార్టికి రాజీనామా చేయటం విమర్శలకు దారి తీసింది. జిల్లాలో 2009 ఎన్నికలలో పార్టికి ఎదురు దెబ్బ తగలడం వెనుక కాంగ్రెస్ కి తోడ్పాటు అందిచారనె అపవాదు ఉంది.

ఇతను నాయకత్వం అందించిన పార్టీ శాఖ లలో సిద్దాంతానికంటె ఇతని ప్రభావం ఉందనే చెప్పవచ్చు

ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇటీవల సుమారు 25 ఎకరాల వ్యవసాయభూమిని అమ్మారు అని ప్రజలు భావిస్తారు.

కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వైదొలగినా ఇంకా ఆపార్టీ ప్రాంతీయ సభలకి, కార్యకర్తల సభలకు వెళ్తుంటారు . ఇంకా వేరే పార్టీలో చేరలేదు.