వైరా

ఖమ్మం జిల్లాకు వైరా మండలానికి చెందిన పట్టణం.

వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం.

వైరా రోడ్డు దృశ్యం

ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ఇది వైరా పురపాలకసంఘంగా ఏర్పడింది.

గణాంకాలుసవరించు

2001 జనగణన ప్రకారం వైరా జనాభా సుమారు 51,205. ఇందులో మగవారు 25,984 ఆడువారు 25,221. అక్షరాస్యత 60.59%; మగవారిలో అక్షరాస్యత 70.20%, ఆడువారిలో అక్షరాస్యత 50.73%.

ఆలయాలుసవరించు

వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్దషిర్డీ సాయిబాబా గుడి ఉంది. శివాలయం ఉంది.

వైరా జలాశయంసవరించు

వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చింది. ఈ చెరువులో 19 బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించాడు. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతోంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.

విద్యా సంస్థలుసవరించు

  • కె.వి.సి.ఎమ్. డిగ్రీ కాలేజి
  • మధు విద్యాలయం, జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజీ
  • టాగోర్ విద్యాలయం
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • క్రాంతి జూనియర్ కాలేజి

బ్యాంకులుసవరించు

  1. నాగార్జున గ్రామీణ బ్యాంక్.
  2. ఆంధ్రా బ్యాంక్.
  3. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపంలో ).

వ్యవసాయంసవరించు

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.

రవాణా సౌకర్యాలుసవరించు

ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.హైదరాబాద్కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గంసవరించు


మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వైరా&oldid=3218820" నుండి వెలికితీశారు