కట్లపాము
కట్లపాము | |
---|---|
Banded krait, Bungarus fasciatus | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Family: | |
Genus: | Bungarus |
కట్లపాము (కామన్ క్రెయిట్) (లాటిన్ Bungarus caeruleus) భారత ఉపఖండానికి చెందిన అడవులలో కనిపించే సాధారణ పాము. ఇది అత్యంత విషపూరితమైన పాము. భారతదేశములో "నాలుగు పెద్ద పాములు"గా భావించే పాములలో ఇది ఒకటి.
శరీర వర్ణన
మార్చుఈ పాము శరీరము యొక్క రంగు ముదురు స్టీలు నీలము లేదా నలుపు నుండి మాసిపోయిన నీలము-గ్రే రంగులలో ఉంటుంది. దీని సగటు పొడవు 1 మీటరు. తెల్లటి అడ్డపట్టీలు తోక ప్రాంతములో మరింత ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.
మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది. ఇది అత్యంత విషపూరితమైన సర్పం.దీని విషం నాగు పాము కంటే 16 రెట్లు విషపూరితమైనది. దీని విషము కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
భౌగోళిక విస్తరణ
మార్చుకట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి పశ్చిమ బెంగాల్ మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశమంతటా, శ్రీలంకలోనూ కనిపిస్తుంది.
నివాసము
మార్చుకట్లపాము అనేక రకాలైన ఆవాస ప్రాంతాలలో నివసిస్తుంది. పొలాలలో, పొద అడవుల్లో, జనావాసము లేని పరిసరప్రాంతాలలో ఆవాసమేర్పరచుకుంటుంది. వీటికి పందికొక్కులంటే చాలా ఇష్టం అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో, ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం అందువల్లసాధారణంగా నీటిలో లేక నీటి దగ్గరలో కనిపిస్తుంటాయి.