కథల్: ది కోర్ 2023లో మలయాళంలో విడుదలైన సినిమా. మమ్ముట్టి కంపానీ బ్యానర్‌పై మమ్ముట్టి నిర్మించిన ఈ సినిమాకు జియో బేబీ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, జ్యోతిక, సుధీ కోళికోడ్, పూజా మోహన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ  సినిమాను 23 నవంబర్ 2023న విడుదలై,  అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో 2024 జనవరి 4న మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

కథల్: ది కోర్
దర్శకత్వంజియో బేబీ
రచన
  • ఆదర్శ్ సుకుమారన్
  • పాల్సన్ స్కారియా
నిర్మాతమమ్ముట్టి
తారాగణం
ఛాయాగ్రహణంసాలు కె. థామస్
కూర్పుఫ్రాన్సిస్ లూయిస్
సంగీతంమాథ్యూస్ పులికాన్
నిర్మాణ
సంస్థ
మమ్ముట్టి కంపానీ
పంపిణీదార్లువేఫేరర్ ఫిల్మ్స్
విడుదల తేదీ
23 నవంబరు 2023 (2023-11-23)
సినిమా నిడివి
114 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం
బాక్సాఫీసు₹14.5 కోట్లు [1]

జార్జ్ (మమ్ముట్టి) బ్యాంకులో ప‌ని చేసి రిటైర్ అవుతాడు. ఆయన భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. ఆ గ్రామంలో ఎన్నికలు రావడంతో మమ్ముట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే అత‌డు నామినేష‌న్ వేసిన త‌ర్వాత జ్యోతిక అత‌డిపై విడుకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. డ్రైవింగ్‌ స్కూల్‌ నడిపే వ్యక్తితో జార్జ్‌ స్వలింగ సంపర్క బంధం ఉంద‌ని అందుకే విడాకులు కావాలని కోరుతుంది. అయితే ఈ ఆరోపణలను మమ్ముట్టి ఖండిస్తాడు. అయితే ఆ తరువాత ఎం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు
  • మమ్ముట్టి - మాథ్యూ దేవస్సీ, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్
  • జ్యోతిక - ఓమన ఫిలిప్ మాథ్యూ, మాథ్యూ భార్య
  • సుధీ కోళికోడ్ - థంకన్‌, మాథ్యూ స్నేహితురాలు
  • పూజా మోహన్‌రాజ్ - థంకన్ సోదరి
  • ఆర్.ఎస్. పనికర్ - దేవస్సీ, మాథ్యూ తండ్రి
  • జోజి జాన్టా - మీగా, మాథ్యూ బావమరిది
  • అమీరా - అడ్వకేట్‌ ముత్తుమణి
  • చిన్ను చాందిని - అడ్వకేట్‌ సజిత
  • అలెక్స్ అలిస్టర్ - కుట్టాయి
  • కళాభవన్ హనీఫ్ - న్యాయమూర్తి
  • అనఘ మాయ రవి - ఫెమీ మాథ్యూ, మాథ్యూ, ఓమన కూతురు
  • జోసీ సిజో - సిబిన్ టీకోయ్‌

మూలాలు

మార్చు
  1. "Kaathal The Core Box Office : മമ്മൂട്ടിക്ക് അടുത്ത ഹിറ്റ്? 'കാതല്‍' കേരളത്തില്‍ നിന്ന് 11 ദിവസം കൊണ്ട് നേടിയ കളക്ഷനും ഷെയറും". www.asianetnews.com. Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  2. Namaste Telangana (4 January 2024). "ఓటీటీలోకి వ‌చ్చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'కాథల్ ది కోర్'.. కానీ వారికి మాత్రమే.!". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  3. Andhrajyothy (4 January 2024). "ఆ దేశాల్లో బ్యాన్ చేసిన సౌత్‌ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  4. Eenadu (8 January 2024). "మలయాళ బ్లాక్‌బస్టర్‌.. ఇప్పుడు ఓటీటీలో." Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.

బయటి లింకులు

మార్చు