కనకదుర్గ వారధి
కనకదుర్గ వారధి భారతదేశం లోని విజయవాడ లోని కృష్ణా నది పై విస్తరించిన ఒక బీమ్ వంతెన. ఆంధ్రప్రదేశ్ నందు గోదావరి నది పై నిర్మించిన వంతెనల తర్వాత మాత్రమే ఇది మూడవ అతి పొడవైన రహదారి వంతెన. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అన్ని వంతెనలలో ఇది అతి పొడవైంది. [1]
కనకదుర్గ వారధి | |
---|---|
నిర్దేశాంకాలు | 16°29′34″N 80°37′09″E / 16.49278°N 80.61917°E |
OS grid reference | [1] |
దీనిపై వెళ్ళే వాహనాలు | 4 వరుసల రోడ్డు |
దేనిపై ఉంది | కృష్ణా నది |
స్థలం | విజయవాడ |
ఇతర పేర్లు | విజయవాడ-గుంటూరు వారధి |
Preceded by | ప్రకాశం బ్యారేజి |
లక్షణాలు | |
డిజైను | బీం బ్రిడ్జి |
మొత్తం పొడవు | 2.6 కిలోమీటర్లు (1.6 మై.) |
అత్యంత పొడవైన స్పాన్ | 34 మీటర్లు (112 అ.) |
స్పాన్‌ల సంఖ్య | 47 |
చరిత్ర | |
ప్రారంభం | 1985 |
ప్రదేశం | |
చరిత్ర
మార్చువిజయవాడ యొక్క రవాణా అవసరాలను అందించే ప్రకాశం బారేజి అనే పాత బారేజ్ నిర్మాణం తరువాత ఇది జరిగింది. [2] మొట్టమొదట, వంతెన 2,200 మీటర్ల పొడవు ఉండి, ఇందులో 34 మీటర్లతో 47 స్పానులు సరళ రేఖలో ఏ వంకర లేకుండా ఉంటాయి. విజయవాడ నుండి చెన్నై వరకు ఎన్‌హెచ్16 ను విస్తరించే ప్రాజెక్టులో భాగంగా తరువాత ఇది విస్తరించ బడింది.ఇప్పుడు ఈ వంతెన 2.6 కి.మీ. పొడవు ఉంది.ఈ కనకదుర్గ వారధి ఒక ఫ్లైఓవర్ కలిగి,ఒక వక్రంతో, ఎన్‌హెచ్ 65 తోటి కలుస్తుంది. ఇది మచిలీపట్నంను హైదరాబాదు తో కలుపుతుంది. ఇది భారతదేశంలో 27 వ అతిపెద్ద వంతెన. [3]
భౌగోళికం
మార్చుకనకదుర్గ వారధి, కృష్ణ నదిపై (దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది, 1,000 కిలోమీటర్లు (620 మైళ్ళ) పొడవున గోదావరి నది తరువాత ఇది మాత్రమే) నిర్మించినది. ఇది వంతెన దిగువ నుండి 95 కిలోమీటర్ల (59 మైళ్ళు) డెల్టా ప్రాంతం ప్రయాణించి, చివరికి సముద్రంలోకి చేరుతుంది. ఇది భారతదేశంలో నాల్గవ అతిపెద్ద నది.
విజయవాడ సమీపంలోని వంతెన ప్రదేశంలో, నది సుమారు 1.8 కిలోమీటర్ల (1.1 మైళ్ళు) వెడల్పుతో ప్రవహిస్తుంది, నదిలో ఉన్న యనమలకుదురు అనే ద్వీపం ఉంది. ఇక్కడ నది రెండు మార్గాలలో 700 మీ. 400 మీటర్ల వెడల్పులతో ప్రవహిస్తుంది. నదిలో గుర్తించిన గరిష్ట ఉత్సర్గం (డిస్‌చార్జి) సుమారు 1,110,000 క్యూ.అ. / s (31,000 m3 / s) గా నమోదైంది. [4]
నిర్మాణం
మార్చుహైదరాబాద్ వైపు ట్రాఫిక్‌ను తగ్గించడానికి విజయవాడ వైపు కనక దుర్గ వారధి విస్తరించడం ద్వారా 2012 లో 'ఎన్‌హెచ్‌ఎఐ' ఒక వంతెనను నిర్మించింది. ఇది ఏలూరు నుండి చిలకలూరిపేట వరకు జాతీయ రహదారి 16 విస్తరణలో భాగంగా ఉంది. [5] అమరావతి మహాచైత్యం గుర్తుగా చుట్టూ చుక్కలు ఉన్న ధర్మచక్రాలతో 40 అడుగుల వ్యాసార్థం కలిగిన ఈ ఉద్యానవనానికి క్రింద అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పార్క్ నిర్మించింది. [6] ఈ ప్రాజెక్ట్ కోల్‌కతా, చెన్నైల మధ్య రవాణా సౌకర్యాన్ని పెంచి దూరాన్ని తగ్గిస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ":: Master Plans ::". crda.ap.gov.in. Archived from the original on 2018-11-05. Retrieved 2018-11-04.
- ↑ "'Iconic bridge' across River Krishna: A year on, Andhra Pradesh yet to take final call on designs". The New Indian Express. Retrieved 2018-11-04.
- ↑ "Two new flyovers proposed at VMC council meet to ease traffic snarls - Times of India". The Times of India. Retrieved 2018-11-04.
- ↑ "Managing historic flood in the Krishna river basin in the year 2009". Archived from the original on 26 అక్టోబరు 2017. Retrieved 4 November 2018.
- ↑ Reporter, Staff (2012-03-19). "NHAI constructing flyover near Varadhi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-11-04.
- ↑ "Come April Dharmachakra to greet people at Varadhi junction". The New Indian Express. Retrieved 2018-11-04.