కనకాంగి రాగం

(కనకాంగి నుండి దారిమార్పు చెందింది)

కనకాంగి రాగము కర్ణాటక సంగీతంలో మొదటి మేళకర్త రాగము.[1]

కనకాంగి C వద్ద షడ్జమం

రాగ లక్షణాలు మార్చు

  • ఆరోహణ : స రిగా మ ప ధని స
(S R1 G1 M1 P D1 N1)
  • అవరోహణ : సని ధ ప మగా రి స
(S N1 D1 P M1 G1 R1)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం , శుద్ధ నిషాధం. ఇది 37 మేళకర్త సాలగం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు మార్చు

చాలామంది వాగ్గేయకారులు కనకాంగి రాగంలో కీర్తనల్ని రచించారు.

  • శ్రీగణనాథం భజామ్యహం - త్యాగరాజ స్వామి వారు రచించిన ప్రసిద్ధిచెందిన కీర్తన.
  • సింధుభైరవి సినిమాలోని మోహం అనుడు హాలాహలమిదే అన్న పాట.

జన్య రాగాలు మార్చు

కనకాంగి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నాయి. వీనిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లవంగి ఒకటి.

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్