కన్నౌజ్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
(కనౌజ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కన్నౌజ్ జిల్లా ఒకటి. కాన్పూర్కు వాయవ్యంలో ఉన్న చారిత్రిక నగరం కన్నౌజ్ ఈ జిల్లాకు కేంద్రం.

కన్నౌజ్ జిల్లా
कन्नौज जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో కన్నౌజ్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో కన్నౌజ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుకాన్పూర్
ముఖ్య పట్టణంకన్నౌజ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుకన్నౌజ్
విస్తీర్ణం
 • మొత్తం1,993 కి.మీ2 (770 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం13,86,227
 • జనసాంద్రత700/కి.మీ2 (1,800/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి
తిర్వా దగ్గర సూర్యాస్తమయం

భౌగోళికం

మార్చు
  • కన్నౌజ్ పట్టణం 27.07 ఉత్తర అక్షాంశం 79.92 తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 139 మీటర్ల ఎత్తులో ఉంది.
  • జిల్లాలో ప్రధానంగా గంగానది ఈశాన్య సరిహద్దులో ప్రవహిస్తుంది. ఉత్తర సరిహద్దులో కాళి నది ప్రవహిస్తుంది. ఇషాన్ నది జిల్లాగుండా ప్రవహిస్తుంది.
  • జిల్లాలో వేడి పొడి వేసవి, ఆహ్లాదకరమైన చల్లని శీతాకాలం. జిల్లాలో వర్షపాతం 80 మి.మీ.
  • 1997 సెప్టెంబరు 18 న ఫరూకాబాద్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి కన్నౌజ్ జిల్లా రూపొందించబడింది.

సరిహద్దులు

మార్చు

కన్నౌజ్ ఉత్తర సరిహద్దులో ఫరూఖాబాద్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో హర్దోయి జిల్లా, తూర్పు సరిహద్దులో కాన్పూర్ నాగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కాన్పూర్ దేహత్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఔర్య జిల్లా, నైరుతీ సరిహద్దులో ఏతవా జిల్లా, పశ్చిమ సరిహద్దులో మైన్‌పురిజిల్లా జిల్లా ఉన్నాయి.

విభాగాలు

మార్చు
  • జిల్లా 3 తాలూకాలుగా విభజించబడింది
  • జిల్లా 7 మండలాలుగా విభజించబడింది.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,658,005,[1]
ఇది దాదాపు. గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 299 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 792 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 74.01%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001 గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జనసంఖ్య 1,388,923
గ్రామీణ జనసంఖ్య 1,156,951 (83.3%)
నగరప్రాంతం 231,972 (16.7%)[4]

చారిత్రక ప్రాముఖ్యత

మార్చు

కన్నౌజ్ జిల్లాలో పలు ఆలయాలు ఉన్నాయి. ఇవి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. హర్షవర్ధనుని సామ్రాజ్యంలో ఇది భాగంగా ఉంది. సెంటు తయారీకి ఇది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది పర్‌ఫ్యూం నగరంగా కూడా గుర్తించబడుతుంది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582
  4. "Interactive map, Uttar Pradesh, Census of India 2001". Archived from the original on 2015-04-25. Retrieved 2014-12-16.