కన్నాట్ ప్లేస్

న్యూ ఢిల్లీ జిల్లా, ముఖ్యపట్టణం
(కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)

కన్నాట్ ప్లేస్, (న్యూ ఢిల్లీ), భారతదేశంలోని, న్యూ ఢిల్లీ జిల్లాలో ప్రధాన ఆర్థిక, వాణిజ్య,వ్యాపార కేంద్రాలకు నిలయమైన ఒక పట్టణం.ఇది కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో (సిపి) నిర్మించబడింది.ఈ ప్రాంతంలో అనేక భారతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.న్యూ ఢిల్లీలో ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం.నైట్ లైఫ్ పర్యాటక కేంద్రం.దీనిని రాబర్ట్ టోర్ రస్సెల్ రూపొందించారు. 2018 జూలై నాటికి కన్నాట్ ప్లేస్ ప్రపంచంలోని తొమ్మిదవ ఖరీదైన కార్యాలయ ప్రదేశంగా గుర్తించబడింది. ఈప్రాంతంలో చ.అ.1కి యుఎస్ $ 153 వార్షిక అద్దెవిలువ ఉంది.[3][4][5]

కన్నాట్ ప్లేస్,
వ్యాపార జిల్లా
కన్నాట్ ప్లేస్‌ అంతర్గత వృత్తం, సెంట్రల్ పార్కు విస్తృత దృశ్యం
కన్నాట్ ప్లేస్‌ అంతర్గత వృత్తం, సెంట్రల్ పార్కు విస్తృత దృశ్యం
Nickname: 
సిపి
కన్నాట్ ప్లేస్, is located in ఢిల్లీ
కన్నాట్ ప్లేస్,
కన్నాట్ ప్లేస్,
భారతదేశంలో ఢిల్లీ స్థానం
Coordinates: 28°37′58″N 77°13′11″E / 28.63278°N 77.21972°E / 28.63278; 77.21972
దేశంభారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాన్యూ ఢిల్లీ
Government
 • Bodyఢిల్లీ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికార
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
110001[2]
లోక్‌సభ నియోజకవర్గంన్యూ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం

ఇది ఢిల్లీ కొత్త నగరానికి ప్రధాన వాణిజ్య ప్రాంతం.న్యూ ఢిల్లీ నగరంలో గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది.న్యూ ఢిల్లీ లోని అగ్ర వారసత్వ నిర్మాణాలుఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి.ఇది మధ్య ఢిల్లీ జిల్లాలో లుటియెన్స్ ఢిల్లీ అభివృద్ధి ప్రాంతంగా అభివృద్ధి చేయబడింది.ఒకటవ డ్యూక్ ఆఫ్ కొనాట్, స్ట్రాథెర్న్ ప్రిన్స్ ఆర్థర్ పేరు మీద, నిర్మాణ పనులు 1929లో ప్రారంభించి,1933 లో పూర్తైనవి.

ఈ ప్రాంతం నేడు న్యూ ఢిల్లీ పురపాలక సంఘం (ఎన్డీఎంసి) పరిధిలోకి వస్తుంది.అందువల్ల నిర్వహణ కోసం నిధుల పరంగా దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.[6] న్యూ ఢిల్లీ వాణిజ్యదారుల సంఘం (ఎన్డీటిఎ) అనేది కన్నాట్ ప్లేస్ లోని చిల్లర దుకాణాలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళవంటి సంస్థల వాణిజ్య ప్రయోజనాలు, నిర్వహణ సమస్యలను అధిగమించటానికి, ఎన్డీఎంసి వంటి ప్రభుత్వ సంస్థలకు సూచించడానికి, సంబంధాలు పెట్టుకోవటానికి (ఎన్డీటిఎ) ప్రధాన పాత్ర పోషిస్తుంది.కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో నిర్మించిన మెట్రో రైల్వే స్టేషన్‌కు రాజీవ్ గాంధీ మరణించిన తరువాత రాజీవ్ చౌక్ అని పేరు పెట్టారు.[7]

చరిత్ర

మార్చు
 
1970 లలో నిర్మించిన కన్నాట్ ప్లేస్‌ లోని భూగర్భ వాణిజ్య సముదాయం పాలికా బజార్ ప్రవేశం

కన్నాట్ ప్లేస్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం అంతా కికార్ చెట్లతో కప్పబడి, నక్కలు, అడవి పందులతో నిండిన ఒక శిఖరంగా ఉంది.పార్ష్‌రిడ్జ్ వేట కోసం కాశ్మీర్ గేట్, సివిల్ లైన్సు ప్రాంత నివాసితులు వారాంతాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు.[8] ఇక్కడ ఉన్న హనుమాన్ ఆలయం, పాత గోడల నగరం నుండి చాలా మంది సందర్శకులను ఆకర్షించింది. సందర్శకుల ప్రతి మంగళ, శనివారాలలో ఈ ఆలయాన్ని దర్శించేవారు.చీకటిలో తిరుగు ప్రయాణం ప్రమాదకరమైందని భావించి, సూర్యాస్తమయానికి ముందు మాత్రమే వచ్చేవారు.

కన్నాట్ ప్లేస్ నిర్మాణం, దాని సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్నిఖాళీ చేయడానికి మాధోగంజ్, జైసింగ్ పురా, రాజాకా బజార్ సహా గ్రామాల నివాసితులు తొలగించబడ్డారు.ఈ గ్రామాలు ఒకప్పుడు చారిత్రాత్మక కుతుబ్ రోడ్, షాజహానాబాద్, గోడల నగరం ఢిల్లీ (ప్రస్తుతం పాత ఢిల్లీ అని పిలుస్తారు) మొఘల్ కాలం నుండి దక్షిణ ఢిల్లీ నగరంలోని కుతుబ్ మినార్ వరకు కలిపే ప్రధాన రహదారిలో ఉన్నాయి.చెట్లు, అడవి పొదలు మాత్రమే ఉండే రాతి ప్రాంతం నుండి, స్థానభ్రంశం చెందిన ప్రజలను పశ్చిమ కరోల్ బాగ్‌ ప్రాంతానికి మార్చారు.అయినప్పటికీ మూడు నిర్మాణాలు హనుమాన్ ఆలయం, జైసింగ్‌పురాలోని జైన దేవాలయం, జంతర్ మంతర్ భవనం కూల్చివేత నుండి మినహాంచబడ్డాయి.[9][10]

నిర్మాణం

మార్చు
 
రాబర్ట్ టోర్ రస్సెల్ కన్నాట్ ప్లేస్ వాస్తుశిల్పి
 
వారాంతంలో రద్దీగా ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతం.

భారతదేశ సార్యభౌమసంబంధమైన కొత్త రాజధాని నిర్మాణం ప్రారంభం కావడంతో, కేంద్ర వ్యాపార జిల్లాలను కలిగి ఉన్న ప్రణాళికలు అభివృద్ధి చేయబడ్డాయి.ప్రధాన వాస్తుశిల్పి డబ్ల్యూహెచ్ నికోల్స్ నేతృత్వంలో, ఈ ప్రణాళికలలో యూరోపియన్ పునరుజ్జీవనం ఆధారంగా సెంట్రల్ ప్లాజా క్లాసికల్ శైలిలో రూపొందించి భారత ప్రభుత్వానికి అందించాడు.అయినప్పటికీ నికోలస్ 1917 లో భారతదేశాన్ని విడిచిపెట్టాడు.లుటియెన్స్, బేకర్ రాజధానిలో పెద్ద భవనాల నిర్మాణాల పనిలో బిజీగా ఉండటంతో, ప్రధాన వాస్తుశిల్పి రాబర్ట్ టోర్ రస్సెల్ నుండి ప్లాజా రూపకల్పన చివరికి భారత ప్రభుత్వంలోని ప్రజా పనుల శాఖకు (పిడబ్ల్యుడి) మారింది.[8]

విక్టోరియా రాణి మూడవ కుమారుడు యునైటెడ్ కింగ్‌డమ్ రాజు జార్జ్ VI మామ ప్రిన్స్ ఆర్థర్, 1 వ డ్యూక్ ఆఫ్ కొనాట్ (1850-1942) పేరు దీనికి పెట్టారు.ఇతను1921 లో భారతదేశాన్ని సందర్శించినప్పుడు కౌన్సిల్ హౌస్ (సంసాద్ భవన్, లేదా పార్లమెంట్ హౌస్ )ను దర్శించాడు.జార్జియన్ నిర్మాణం బాత్ లోని రాయల్ క్రెసెంట్ తరువాత కొనాట్ ప్లేస్ రూపొందించబడింది.దీనిని ఆర్కిటెక్ట్ జాన్ వుడ్ ది యంగర్ రూపొందించాడు.1767, 1774 మధ్య కాలంలో దీనిని నిర్మించారు. రాయల్ క్రెసెంట్ సెమీ వృత్తాకారంలో మూడు అంతస్తుల నివాస నిర్మాణం అయితే, కన్నాట్ ప్లేస్‌లో కేవలం రెండు అంతస్తులు మాత్రమే ఉన్నాయి. ఇది మొదటి అంతస్తులోని నివాస స్థలంతో భూమిపై ఉన్న వాణిజ్య సంస్థలను ఉంచడానికి ఉద్దేశించి, దాదాపు పూర్తి వృత్తంగా నిర్మించారు.[8] ఈ వృత్తం చివరికి మూడు కేంద్రీకృత వృత్తాలతో రూపొందించబడింది.లోపలి వృత్తంగా, మధ్య వృత్తంగా, పైభాగం ఒక వృత్తంగా, ఏడు రోడ్లతో నిర్మించారు.ఈ రోడ్లను రేడియల్ రోడ్లు అని పిలుస్తారు.అసలు ప్రణాళిక ప్రకారం, కొనాట్ ప్లేస్ వేర్వేరు బ్లాకులను పై నుండి కలపాలి. వాటి క్రింద రేడియల్ రోడ్లు ఉన్నాయి.

ప్రారంభ కాలం

మార్చు
 
రీగల్ సినిమా, కన్నాట్ ప్లేస్ మొట్టమొదటి థియేటర్. ఇది 1932 లో ప్రారంభించబడింది, దీనిని సర్ శోభా సింగ్ నిర్మించారు,.దీనిని వాల్టర్ సైక్స్ జార్జ్ రూపొందించారు.
 
సిపి సెంట్రల్ పార్క్, ఇన్నర్ సర్కిల్ దృశ్యం

మొదటి అంతస్తు భవనాలు నివాసితులుతో క్రమంగా1938 నాటికి దాదాపుగా నిండిపోయాయి.కానీ ప్లాజా రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంగా మారడానికి మరో దశాబ్దం ముందు, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై, స్వాతంత్ర్య ఉద్యమ ధశకు చేరుకుంది.వాణిజ్య అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి, కానీ స్వాతంత్య్రానంతరం, 1950 లలో వ్యాపారం తిరిగి పెరగడం ప్రారంభమైంది.[8][11][12]

స్వాతంత్య్రానంతరం

మార్చు
 
జీవన్ భారతి, ఎల్ఐసి భవనం, కన్నాట్ ప్లేస్, ఔటర్ సర్కిల్, 1986 లో నిర్మించబడింది

1980 ల వరకు, హార్ట్‌ డేవిడ్సన్ రిక్షా సేవ ఫట్‌ఫాట్ సేవా, కానట్ ప్లేస్ నుండి ఎర్ర కోట, చందాని చౌక్‌కు సందర్శకులను తీసుకువెళ్ళింది.కాలుష్య సమస్యల కారణంగా ఇది ఆగిపోయింది.[13] లోపలి వృత్తాకార ఖాళీ భవనం1970 ల చివరలో భూగర్భ వాణిజ్య నిర్మాణంతో వాడుకలోకి వచ్చింది.కూడలి ప్రాంతం వద్ద ఢిల్లీలో మొదటి పాలికా బజార్ సర్కిల్ టవర్ వరకు విస్తరించి,ఇది పక్కనే ఉన్న భూగర్భ పార్కింగ్ స్థలంతో అనుసంధానించబడింది.1970 లో, బాబా కరాక్ సింగ్ మార్గంలో రేడియల్ పై స్టేట్ ఎంపోరియాలు వెలువడ్డాయి.[10] ఏదేమైనా, స్కైలైన్‌లో ఒక ప్రధాన మార్పు ఎర్ర ఇసుకరాయి కట్టడం (చారిత్రాత్మక ఎర్ర కోట నుండి ప్రేరణ పొందింది) గాజు ఆకాశహర్మ్యం, జీవన్ భారతి భవనం (ఎల్‌ఐసి భవనం) వీటిని ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా రూపొందించారు

సమీప ప్రాంతాలు

మార్చు
  • బరాఖంబా రోడ్, కస్తూర్బా గాంధీ మార్గ్ - అంతర్జాతీయ బ్యాంకులు, ఇతర పెద్ద కార్పొరేట్ కార్యాలయాలకు ఇవి ప్రధాన కేంద్రాలు.
  • జనపథ్, బాబా ఖరక్ సింగ్ మార్గ్ - పెద్ద సంఖ్యలో చిన్న దుకాణాలతో స్థానిక భారతీయ హస్తకళల కోసం ప్రధాన వాణిజ్య ప్రాంతం. పురాతన హనుమాన్ ఆలయం, బాబా ఖరగ్ సింగ్ ఈ మార్గ్ ఉన్నాయి
  • పార్లమెంట్ స్ట్రీట్ - ఇది ప్రభుత్వ కార్యాలయాలకు కలిగిన ప్రాంతం. ఈ ప్రధాన రహదారిపై జంతర్ మంతర్, ఎన్డిఎంసి కార్యాలయాలు ఉన్నాయి.
  • న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్
  • బాబర్ రోడ్, బెంగాలీ మార్కెట్ - ఇవి కన్నాట్ ప్లేస్ సమీపంలో నివాస ప్రాంతాలు మాత్రమే.

చిత్ర మాలిక

మార్చు

ఇది కూడా చూడు

మార్చు

ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఇతర వాణిజ్య కేంద్రాలు:

  • జనక్‌పురి
  • నెహ్రూ ప్లేస్
  • రాజేంద్ర ప్లేస్
  • శివాజీ ప్లేస్
  • సౌత్ ఎక్స్‌టెన్షన్

మూలాలు

మార్చు
  1. "Official Language Act 2000" (PDF). Government of Delhi. 2 July 2003. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 డిసెంబరు 2020.
  2. "India PIN Code 110001 Profile and Map". www.worldpostalcodes.org. Retrieved 29 December 2019.
  3. "'Connaught Place world's 9th most expensive office location'". The Hindu. Press Trust of India. 12 July 2018. ISSN 0971-751X. Retrieved 15 July 2018.
  4. "New Delhi's Connaught Place world's 9th most expensive office location with annual rent of $153 per sq ft: CBRE". The Financial Express. 11 July 2018. Retrieved 15 July 2018.
  5. "Connaught Place Is Ranked The World's 9th Most Expensive Office Location". News18. Retrieved 15 July 2018.
  6. "New Delhi Municipal Council". www.ndmc.gov.in. Retrieved 9 October 2020.
  7. "New Delhi renames 'British' sites to honour the Gandhis". Deseret News. Associated Press. 21 August 1995. Archived from the original on 8 జూలై 2014. Retrieved 14 July 2014.
  8. 8.0 8.1 8.2 8.3 "CP's blueprint: Bath's Crescent". Hindustan Times. 8 February 2011. Archived from the original on 3 January 2013.
  9. "A tale of two cities". Hindustan Times. 1 September 2011. Archived from the original on 2 July 2015.
  10. 10.0 10.1 "A village that made way for CP". Hindustan Times. 2 June 2013. Archived from the original on 9 January 2014. Retrieved 23 September 2013.
  11. "Breathing life into New Delhi". Hindustan Times, Metro. 8 February 2011. p. 4.
  12. "The heart of Delhi, even then". Hindustan Times. 9 February 2011. Archived from the original on 11 February 2011.
  13. Horton, Patrick (2002). Delhi. Lonely Planet. p. 82. ISBN 1-86450-297-5.

వెలుపలి లంకెలు

మార్చు