కన్వల్జిత్ సింగ్

మాజీ భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్.

కన్వాల్జిత్ సింగ్ (జననం 15 ఏప్రిల్ 1958) హైదరాబాదు, తమిళనాడు క్రకికెట్ జట్టు తరఫున ఆడిన మాజీ భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్. హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున 100 మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఇద్దరు ఆటగాళ్లలో కన్వాల్జిత్ ఒకడు.[1] పదవీ విరమణ తరువాత క్రికెట్ కోచ్ గా పనిచేశాడు.

కన్వల్జిత్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1958-04-15) 1958 ఏప్రిల్ 15 (వయసు 66)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్పిన్ బౌలింగ్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81–2000/01హైదరాబాదు క్రికెట్ జట్టు
1986/87తమిళనాడు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 111 20
చేసిన పరుగులు 668 32
బ్యాటింగు సగటు 10.12 6.40
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 50 14
వేసిన బంతులు 25,110 1,026
వికెట్లు 369 24
బౌలింగు సగటు 28.24 27.95
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 21 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 4 n/a
అత్యుత్తమ బౌలింగు 8/86 4/29
క్యాచ్‌లు/స్టంపింగులు 49/– 2/–
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2015 డిసెంబరు 31

కన్వాల్జిత్ 1958, ఏప్రిల్ 15న తెలంగాణలోని సికింద్రాబాదులో జన్మించాడు.

క్రీడారంగం

మార్చు

1980–81 రంజీ ట్రోఫీ సందర్భంగా 1980 డిసెంబరులో కన్వల్జిత్ హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టినప్పటికీ, జట్టులో సీనియర్ స్పిన్నర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఉండటం వల్ల అతను చాలా సంవత్సరాలపాటు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.[2] 1994-95 సీజన్ వరకు అతను సౌత్ జోన్, ఇండియా ఎ, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరఫున ఆడిన తరువాత గుర్తింపు పొందాడు. 21.31 సగటుతో 47 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసుకున్నాడు. 1998-99 సీజన్లో, 23.58 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు.[3] 1998లో ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ఐదుగురు క్రికెటర్లలో కన్వల్జిత్ ఒకడు.[4] 1999–00 రంజీ ట్రోఫీ సీజన్‌లో 42 సంవత్సరాల వయసులో కన్వల్‌జిత్ 62-7 వికెట్లు తీసుకున్నాడు.[5] 2001లో చివర్లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో పాల్గొని, తొమ్మిది వికెట్లు తీశాడు. జట్టు నుండి తొలగించబడిన తరువాత పదవీ విరమణ ప్రకటించాడు.[6]

పదవీ విరమణ చేసిన తరువాత క్రికెట్ కోచ్ గా మారాడు. హైదరాబాదు క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా కూడా పనిచేశాడు. 2018లో డెక్కన్ చార్జర్స్ కు అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు.[7] 2010లో తన పదవికి రాజీనామా చేయడానికి ముందు హైదరాబాదు అండర్ -19 కోచ్ గా కూడా పనిచేశాడు.[8] హైదరాబాద్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అప్పటి బిసిసిఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ సోదరుడిపై దాడి చేశాడనే ఆరోపణతో 2014లో హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కన్వల్జిత్ ను సస్పెండ్ చేసింది.[9]

2018, ఆగస్టులో నాగాలాండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితులయ్యాడు.[10]

మూలాలు

మార్చు
  1. "Most Appearances for Hyderabad". CricketArchive. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. Ramnarayan, V. (2000-05-06). "Square pegs in round holes on cricket stage". The Hindu. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "First-class bowling in each season by Kanwaljit Singh". CricketArchive. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "ఇండియాn Cricket Cricketers of the Year". CricketArchive. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  5. "Most Wickets in a Season in Ranji Trophy". CricketArchive. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  6. Veera, Sriram. "One that drifted away". ESPNcricinfo. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. Shankar, Ajay S. "Bangalore line up Martin Crowe". ESPNcricinfo. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  8. "Hyderabad coaches resign, four senior players dropped". ESPNcricinfo. Archived from the original on 7 ఆగస్టు 2018. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  9. "HCA suspends Kanwaljit Singh". The Hindu. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  10. "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved ఆగస్టు 31 2018. {{cite web}}: Check date values in: |access-date= (help)

బయటి లింకులు

మార్చు