కపాల నాడులు
కపాల నరాలు (Cranial nerves) జతలుగా ఉండి, మెదడు నుండి ఏర్పడతాయి. ఇవి ఉల్బరహిత జీవులు, సర్పాలలో 10 జతలు, ఉల్బధారులలో 12 జతలు ఉంటాయి.
కపాల నరాల వివరాలు
మార్చు# | పేరు | పుట్టుక | ధర్మము |
0 | కపాల నరము 0 (CN0 సాంప్రదాయికంగా గుర్తింపబడలేదు.)[1] | ఘ్రాణ త్రిభుజాకారపు ద్వారం, మధ్య ఘ్రాణ గైరస్, లామిన టెర్మినాలిస్ |
ఇప్పటికీ వివాస్పదం కొత్త పరిశోధనల ప్రకారం "ఫెరోమోనిస్" వ్యాధిని గుర్తించడంలో CN0 తన పాత్రను పోషిస్తుంది. [2][3] |
I | ఘ్రాణ నరము | పూర్వ ఘ్రాణ కేంద్రకము | ఘ్రాణ సంకేతాలను ప్రసరిస్తుంది. |
II | దృష్టి నరము | పార్శ్వ జేనిక్యులేట్ కేంద్రకము | దృష్టి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది. |
III | నేత్రీయ చాలక నరము | అక్షి చాలక కేంద్రకము, ఎడింగర్- వెస్ట్ ఫాల్ కేంద్రకము | కనుగుడ్లను నలువైపులకూ తిప్పే కండరాలు ఇవి : పైకి తిప్పే కండరాలు ( ప్రుష్ట రెక్టస్ కండరం - superior rectus), మూలలకు, మధ్యకు తిప్పే కండరాలు (medial rectus), కిందకు తిప్పే కండరాలు (నిమ్న రెక్టస్ కండరం - inferior rectus), అవనమ రెక్టస్ కండరాలు (inferior oblique). నేత్రీయ చాలక నరము ఈ కండరాలకు మెదడు నుంచి సంకేతాలను పంపి ఉత్తేజింపచేస్తుంది. |
IV | ట్రోక్లియర్ నరము | ట్రోక్లియర్ కేంద్రకము | ఊర్ధ్వ అవనమ కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.ఈ కండరం కనుగుడ్లను లోపాలకి లాగడానికి, ప్రక్కలకు తిప్పటానికి సహకరిస్తుంది. |
V | త్రిధార నరము | ప్రధాన ఘ్రాణ త్రిధార కేంద్రకము, కశేరు త్రిధార కేంద్రకము, ప్రుష్టగోర్ధపు త్రిధార కేంద్రకము , త్రిధార చాలక కేంద్రకము | ముఖము నుండి సంవేదనలను స్వీకరిస్తుంది, నమలటానికి ఉపయోగపడే కండరాలకు ఉతేజాన్ని ఇస్తుంది. |
VI | ఢమరుకాకార నరము (ఆబ్డుసెన్స్ నాడి) | ఆబ్డుసెన్స్ కేంద్రకము | కంటిని తిప్పటానికి ఉపయోగపడే పార్శ్వ రెక్టసు కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది. |
VII | ఆస్య నరము | ఆస్య కేంద్రకము, ఏక కేంద్రకము, పృష్ట లాలాజల కేంద్రకము | స్తేపెడియమునకు, ముఖ వ్యక్తీకరణకు ఉపయోగపడే కండరాలకు చాలక ఉతేజాన్ని ఇస్తుంది, ముందరి 2/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది, లాలాజల గ్రంధులు (పెరోటిడు తప్పించి ), అశ్రు గ్రంధులకు వాటివాటి స్రావాలను స్రవించడానికి ఉతేజాన్ని ఇస్తుంది. |
VIII | శ్రవణ నరము (లేదా శ్రవణ - అలింద నాడి లేదా స్తెతోఅకస్టిక్ నాడి ) | అలింద కేంద్రకము, కర్నావర్త కేంద్రకము | శబ్దము, భ్రమణము, గురుత్వాకర్షణకు (సమతుల్యత, చలనము కొరకు అత్యవసరము) సంబంధించిన అనుభూతులను స్వీకరిస్తుంది. |
IX | జిహ్వ గ్రసని నరము | ఆంభిగ్యుస్ కేంద్రకము, నిమ్న లాలాజల కేంద్రకము, ఏక కేంద్రకము | వెనుకటి 1/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన సంవేదనను స్వీకరిస్తుంది, పెరోటిడు గ్రంధిని తన స్రావము విడుదల చేసేలా ఉతేజింప చేస్తుంది, స్టైలో ఫారెంజియస్ కు చాలక ఉతేజాన్ని ఇస్తుంది. |
X | వేగస్ నరము | ఆంభిగ్యుస్ కేంద్రకము, పృష్ట యాంత్రీక్, ఏక కేంద్రకము | స్వరపేటిక, గ్రసనికి సంభందించిన చాలామటుకు కండరాలకు ఊపిరికి సంభందించిన చాలక ఉతేజాన్ని ఇస్తుంది, రొమ్ము మొదలుకుని ఉదరములోని ప్లీహపు వంపు వరకు ఉండే దాదాపు అన్ని అంతర్ అవయములకు సహసహానుభూత పోగులను అందజేస్తుంది, ఉపజిహ్విక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది. |
XI | అనుబంధ నరము (లేదా కపాల అనుబంధ నాడి లేదా కశేరు అనుబంధ నాడి) | ఆంభిగ్యుస్ కేంద్రకము, కశేరు అనుబంధ కేంద్రకము | మెడ లొని కండరాల పని చేయాడానికి సంభందించిన నరాలను వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది. |
XII | అధో జిహ్వ నరము | అధో జిహ్వ కేంద్రకము | ఈ నాడి నాలుక కండరాలకు సంకేతం పంపే నరాలు తీసుకొని వెళ్ళుతుంది. |
మూలాలు
మార్చు- ↑ Fuller GN, Burger PC. "Nervus terminalis (cranial nerve zero) in the adult human." Clin Neuropathol 9, no. 6 (Nov-Dec 1990): 279-283.
- ↑ Merideth, Michael. "Human Vomeronasal Organ Function." Archived 2007-10-17 at the Wayback Machine Oxford Journals: Chemical Senses, 2001.
- ↑ Fields, R. Douglas. "Sex and the Secret Nerve." Archived 2007-09-28 at the Wayback Machine Scientific American Mind, February 2007.