కపిల్ దేవ్ ప్రసాద్
కపిల్ దేవ్ ప్రసాద్ బీహార్‌కు చెందిన నేతకారుడు. అతను చీరలు, బెడ్‌షీట్‌లు, కర్టెన్‌లపై బౌద్ధ కళలైన 'బవన్ బూటీ' (52 మూలాంశాలు) లను నేయడానికి ప్రసిద్ధి చెందాడు.[1]
జీవితం, వృత్తి
మార్చుకపిల్ దేవ్ ప్రసాద్ 1954 లో జన్మించాడు. చేనేత, అతని కుటుంబ వృత్తి. అతను బీహార్‌లోని నలందా జిల్లా ముఖ్యపట్టణమైన బీహార్ షరీఫ్‌కు ఈశాన్యాన 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాస్మన్ బిఘా గ్రామానికి చెందినవాడు.[2]
2023 లో అతను, దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Padma awardee hopeful of 'bawan buti' revival". Retrieved 29 January 2023.
- ↑ ""Overwhelmed With This Honour": Bihar Handloom Artist On Padma Award". Retrieved 29 January 2023.
- ↑ "Back Padma awards 2023 unsung heroes: From 'India's gift to world' to 'Hero of Heraka'". Retrieved 29 January 2023.