విశ్వకర్మీయుల/విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము.ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాసీ డాకలి పై సుత్తె దెబ్బలు తినాల్సిందే. భగభగ మండే కొలిమి ముందు కూర్చుని వేడిని లెక్క చేయక రైతుకు అవసరమైన పనిముట్లు చేస్తాడు. కమ్మరి కొలిమి రాజేసి ఇనప ముక్కలతో కొడవళ్ళు గునపాలు నాగళ్ళు చేస్తాడు. కొడవళ్ళకు కక్కు కొడతాడు.రెడీమెడ్‌ పనిముట్లు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇనుముతో రకరకాల పనిముట్లు తయారు చేసే కమ్మరి కి పని పోయింది.రైతులు గతంలో మాదిరి కొలిమి దగ్గరకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు చేయించుకొనే ఓపిక ఇప్పుడు లేదు. దాంతో వారు రెడీమెడ్‌ పనిముట్లు తీసుకొని తమ పనులు గడుపుకొంటున్నారు. అనావృష్టి, అతివృష్టితో రైతులు వ్యవసాయం చేయకపోవడంతో వ్యవసాయ పనిముట్లుతయారు చేసే కమ్మరి పని పోయింది.వీరు ఇప్పుడు ప్రవేటు ఫ్యాక్టరీలలో కార్మికులయ్యారు.కదిరి ప్రాంతంలో ముస్లిములు ఎక్కువమంది కమ్మరి పని చేస్తున్నారు.ఆధునిక యంత్ర పనిముట్లు రావడం వల్ల కమ్మరి వృత్తి పూర్తిగా అంతరించిపోవుటకు సిద్దమైంది. ట్రాక్టర్లు రావడం వల్ల నాగళ్లు, పొలాన్ని దున్నేందుకు ఉపయోగం లేకుండా పోయాయి.

పూర్వం ఈ వృత్తిని చేసికొని బతికే సంచార జాతి ఇంకొకటి వున్నది. వారిని 'బైట కమ్మరులు అంటారు. వీరు ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 10వ కులం. వీరు కమ్మరి పనికి కావల్సిన పని ముట్లతో ఊరూరు తిరుగుతుంటారు. వీరు ఊర్లోకి రాకుండా ఊరి బైటనే కొలిమి పెట్టుకుని కొద్ది రోజులు ఉండి వెళ్ళి పొతారు. వీరికీ విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి పోలిక కానీ సంబంధంకానీ లేదు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మర&oldid=3866251" నుండి వెలికితీశారు