కరణకమ్మ బ్రాహ్మణులు

ఆంధ్రదేశంలో ఆయా ప్రాంతాల్లో నివసించే బ్రాహ్మణులకు ఆయాప్రాంతాలపేర్లే వచ్చాయి. కడపమండలం సిద్ధవటం, పుష్పగిరి ప్రాంతంలో స్థిరపడినవారు ములికినాటి వారని, గుండ్లకమ్మ, కృష్ణానది మధ్యదేశంలో స్థిరపడినవారిని వెలనాటివారనీ ఇట్లా రకరకాల శాఖలుగా పిలుస్తున్నారు. కరణకమ్మలో కమ్మ పదం గుండ్లకమ్మ నదిని సూచించేపదం కావచ్చు. ఆనదీపరీవాహ ప్రాంతంలో స్థిరపడినవారు కరణకమ్మలుకాచ్చు.

కరణకమ్మ వైశ్యులు, కరణకమ్మ కంసాలులు ఇతరకులాల వారికి కూడా కరణకమ్మ ఉండడంవల్ల ఒక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలనే కరణ కమ్మలు అని వ్యవహరిచినట్లు అనిపిస్తుంది. కరణకమ్మ బ్రాహ్మణ శాఖీయులు ప్రకాశం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివాసముంటున్నట్లు తెలిసింది.

క్రీ.శ.1377 బ్రాహ్మణక్రాక దానశాసనంలో ప్రతిగ్రహీతలు కొందరు కరణకమ్మ బ్రాహ్మలు. కరణకమ్మలు రుగ్వేదులు, వైదికవృత్తిలో జీవించారు. కొందరు అధ్యాపకవృత్తిలో. కొందరు వైద్యులు. వీరిలో వైదికులు, నియోగులూ వున్నారు.

కేసరి సుందరరామశర్మ కరణకమ్మలు కర్ణాటక నుంచి ఆంధ్రదేశానికి వచ్చివుంటారని భావించారు. సబ్నవీసు వంటి గృహనామాలవల్ల మహారాష్ట్ర నుంచి వచ్చారనే సందేహం కలుగుతుంది. వీరందరూ మాట్లాడేది తెలుగే. వెంకటగిరి రాజాల పురోహితులు కరణకమ్మ బ్రాహ్మణులే. ఒకవీధంతా వాళ్ళదే, కరణకమ్మవీధి.

కరణకమ్మ బ్రాహ్మలు కర్ణాటక, తెలంగాణాకు వలసలు వెళ్ళనట్లు తోస్తుంది. ఇంటిపేరు, గోత్రాన్నిబట్టి, వారనుసరించే వేదాన్ని బట్టి కరణకమ్మశాఖీయులని తెలుస్తున్నా తెలంగాణాలో తాము వైదిక బ్రాహ్మణులమని మాత్రమే చెప్పుకొనడం గమనిందగినది. కర్ణాటకలో కూడా స్మార్త సంప్రదాయాలను అనుసరించే "బబ్బూరు కమ్మె బ్రాహ్మణులు" పంచద్రావిడ శాఖలుగా)ఉన్నారు. కమ్మ బ్రాహ్మణ శాఖలు చాలా ప్రాచీన కాలంలోనే, శాతవాహన, చాళుక్య, రాష్టకూతుల కాలంలో కర్ణాటక దక్షిణ భాగానికి, తమిళనాడుకు వలసలు వెళ్ళినట్లు కొన్ని గ్రంథాలలో ఆధారాలున్నవని అంటారు. ఆయా పాలకుల ఎలుబడిలో, మంత్రులుగా, పురో హితులుగా, ఆస్థానులుగా పనిచేశారని తెలుస్తోంది. వీరికి సంబంధించిన "ఉల్చు బ్రాహ్మణులు" కన్నడ మాతృభాష అయిన సమూహాలు కొన్ని కర్ణాటకలో స్థిరపడినవి. ఇంకోవాదం వీరు కాంభోజులు, రూపాంతరం చెంది, కమ్మ భోజులు, కమ్మ బ్రాహ్మణులుగా వాడుకలోకి వచ్చినట్లు అంటారు. 1936లోనే కన్నడభాషలో ఈ బ్రాహ్మణుల చరిత్ర మీద ఒక గ్రథం వచ్చినట్లు తెలిసింది.

మూలాలు

మార్చు
  • విక్రమ సింహపురి మండల సర్వస్వం, సంపాదకులు: ఎన్. ఎస్. కే., నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ.1964. కేసరి సుందరరామశర్మ కరణకమ్మలమీద రాసిన వ్యాసం.
  • BOSWEL'S NELLORE DISTRICT MANUEL, 1873.