సిద్ధవటం

ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలం లోని గ్రామం


సిద్ధవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ జిల్లా, సిద్ధవటం మండలం లోని గ్రామం.ఇది సమీప పట్టణమైన కడప నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో జైనులు నివసిస్తూ ఉండేవారు.

రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 14°28′N 78°58′E / 14.47°N 78.97°E / 14.47; 78.97
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంసిద్ధవటం మండలం
Area
 • మొత్తం7.43 km2 (2.87 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం4,787
 • Density640/km2 (1,700/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1027
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్516237 Edit this on Wikidata

చరిత్ర మార్చు

విజయనగర సామ్రాజ్య చక్రవర్తియైన వీర నరసింహదేవరాయలు సా.శ. 1506 నుంచి 1509 వరకూ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని సంబెట గురవరాజు అనే సామంతుడు పరిపాలిస్తూండేవాడు. సంబెట గురవరాజు ఘోరమైన శిక్షలు విధించేవారు. ప్రజల వద్ద డబ్బు స్వీకరించేప్పుడు సొమ్ము ఇవ్వనివారి స్త్రీల సంఖ్యను పట్టి అసభ్యంగా వారి స్తనాలకు చిరతలు పట్టించేవాడు. కూచిపూడి భాగవతులు ఈ గ్రామానికి వచ్చి ప్రదర్శనలు చేస్తూన్నప్పుడు గురవరాజు ఘోరకృత్యాలను చూసి తట్టుకోలేక విద్యానగరం (విజయనగరం) వెళ్ళిపోయారు. వీర నరసింహరాయల సమక్షంలో కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇచ్చేప్పుడు అవకాశం వినియోగించుకుని గురవరాజు వేషం, ఆయన ధనం సంపాదించే ప్రయత్నాలు చేయడం, చివరకు యువతి వేషం వేసుకున్న నటుడిని అసభ్యంగా స్తనాలకు చిరుతలు పట్టించడం వంటివి ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శన చూసి, ఇది ఇలా ఎందుకు ఉందని మంత్రులను, కొందరు సన్నిహితులైన సామంతులను ప్రశ్నించారు. వారిలో కొందరు సంబెట గురవరాజు చేస్తూన్న ఘోరకార్యకలాపాల గురించి వివరించారు. దీనిపై ఆగ్రహోదగ్రుడైన రాయలు తర్వాత రోజు ఉదయాన్నే గురవరాజుపైకి సైన్యాన్ని పంపి, బందీని చేసి తీసుకువచ్చి, మరణశిక్ష విధించి వధించారు.[2]

1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి ష్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి.

భౌగోళికం మార్చు

జిల్లా కేంద్రమైన కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది.

జనగణన గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1119 ఇళ్లతో, 4787 జనాభాతో 743 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2362, ఆడవారి సంఖ్య 2425. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1402 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 133. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 593399[3].పిన్ కోడ్: 516237.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కడపలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు మార్చు

బళ్లారి - కృష్ణపటం పోర్టు రహదారిపై సిద్ధవటం ఉంది.

భూమి వినియోగం మార్చు

సిద్ధవటంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 268 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 250 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 14 హెక్టార్లు
  • బంజరు భూమి: 29 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 169 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 213 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 213 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

వరి, పసుపు, ఉల్లి

పర్యాటక ఆకర్షణలు మార్చు

 
సిద్ధవటం కోట

సిద్ధవటం కోట మార్చు

పవిత్ర పెన్నానది ఒడ్డున సా.శ .పూ. 40-30 సంవత్సరాల మధ్యకాలంలో సిద్దవటం కోట రూపుదిద్దుకుంది. సుమారు 36 ఎకరాలపైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తకసంఘం వరకూ ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకూ సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకూ ఉన్న మట్టి కోట కాస్తా రాతికట్టడంగా మారింది. సా.శ. 1792లో టిప్పుసుల్తాన్‌ చేతి నుంచి నైజాము నవాబుల పాలనలోకి, వారి నుంచి 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలోకి ఈ కోట చేరింది. బ్రిటిష్‌పాలనలో 1808 నుంచి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా ఉండి, పరిపాలన కేంద్రంగా భాసిల్లింది. ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. మట్లి రాజులు నాయంకరంగా ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టి కోట. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు మొదట ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతిరాయలు|రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కకుత్‌స్థ విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు. మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ వశమయింది.[4] కోటకు పడమట, తూర్పున రెండు ద్వారాలున్నాయి.ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహు గ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణి దర్బారు, ఈద్గా మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న కామాక్షి ఆలయాన్ని మరమ్మత్తులు చేసి ఉంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు. లంకమల లోని నిత్యపూజకోనలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. జిల్లాలో పెద్దయెత్తున శివరాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాలలో పొలతల తరువాతి స్థానం నిత్యపూజకోనదే.

ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "శిల్పకళా తోరణం.. సిద్ధవటం". సూర్య. సూర్య. జూలై 10, 2012. Retrieved 29 December 2014.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=సిద్ధవటం&oldid=4125801" నుండి వెలికితీశారు