ఎం.కరుణానిధి
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు,[2] వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[3] కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.[4] 2004 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) లోక్‌సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఇ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.
ఎం. కరుణానిథి | |||
| |||
తమిళనాడు 2వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2006 మే 13 – 2011 మే 15 | |||
ఎం. కె. స్టాలిన్ (నుండి 2009) | |||
ముందు | జె.జయలలిత | ||
తరువాత | జె.జయలలిత | ||
నియోజకవర్గం | చేపక్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1996 మే 13 – 2001 మే 13 | |||
ముందు | జె.జయలలిత | ||
తరువాత | జె.జయలలిత | ||
నియోజకవర్గం | చేపక్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1989 జనవరి 27 – 1991 జనవరి 30 | |||
ముందు | జానకీ రామచంద్రన్ | ||
తరువాత | జె.జయలలిత | ||
నియోజకవర్గం | హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1971 మార్చి 15 – 1976 జనవరి 31 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1969 ఫిబ్రవరి 10 – 1971 జనవరి 4 | |||
ముందు | వి.ఆర్.నెడుంచెజియన్(ఆపద్ధర్మ) | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు
తిరువారూర్ నియోజకవర్గం | |||
పదవీ కాలం 2011 మే 15 – 2018 ఆగస్టు 7 | |||
ముందు | యు.మాధివానం | ||
నియోజకవర్గం | తిరువారూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుకువలై, మద్రాసు రాజ్యం, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం నాగపట్టిణం జిల్లా, తమిళనాడు) | 1924 జూన్ 3||
మరణం | 2018 ఆగస్టు 7[1] చెన్నై, తమిళనాడు | (వయసు 94)||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
ఇతర రాజకీయ పార్టీలు | జస్టిస్ పార్టీ , ద్రావిడర్ ఖగజం (1949 కి ముందు) | ||
జీవిత భాగస్వామి | పద్మావతి అమ్మాళ్ దయాళు అమ్మాళ్ రాజతి అమ్మాళ్ | ||
సంతానం | 6, (ఎం.కె.ముత్తు, ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ , ఎం.కె.కనిమొళి లతో పాటు) | ||
నివాసం | గోపాలపురం, చెన్నై |
బాల్యం
మార్చుఅతని పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు 1924 జూన్ 3 న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలై అతని స్వస్థలం. తెలుగు నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .
రాజకీయాలు
మార్చు2006 మే 13 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ఆయన చెన్నైలోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కాడు. 1971 సంవత్సరంలో అన్నాదురై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
సాహిత్యం
మార్చుతమిళ సాహిత్యంలో కరుణానిధి తనదైన ముద్ర వేసాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో అతనికి ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్రసీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
మరణం
మార్చుతీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా కొద్దిరోజులు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొంది కరుణానిధి 2018, ఆగష్టు 7న సాయంత్రం గం. 6.10 ని.లకు మరణించాడు.[5][6]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Narayan, Pushpa. "M Karunanidhi, DMK chief and former Tamil Nadu chief minister, dies aged 94". The Times of India. No. 7 August 2018. Retrieved 7 August 2018.
- ↑ "Biography in official party website". Archived from the original on 15 అక్టోబరు 2013. Retrieved 26 డిసెంబరు 2007.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2007-12-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-02. Retrieved 2007-12-26.
- ↑ బిబిసి తెలుగు (13 August 2015). "కరుణానిధి కన్నుమూత". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
- ↑ నమస్తే తెలంగాణ (13 August 2015). "తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూత". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.