కరోనా వైరస్ ఉపరితలాలపై జీవిత కాలం
కోవిడ్ COVID-19 కి కారణమయ్యే కరోనావైరస్ ప్రధానంగా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారు ఎవరైనా దగ్గు లేదా తుమ్మినప్పుడు లేదా వారి ఊపిరి ద్వారా వైరస్ కలిగిన బిందువులను గాలిలోకి పంపుతారు, పీల్చడం ద్వారా వచ్చే ఫ్లూ వైరస్ లాగే, కోవిడ్-19 ఉన్న వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చు. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు, ఇతర ఉపరితలాలపై పడతాయి. కానీ, కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి.[1] ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే సంస్థ లోని ఒక అధ్యయనం ప్రకారం వైరల్ కణాలు పడిన ఉపరితలాన్ని బట్టి అవి మూడుగంటల నుంచి మూడురోజుల వరకు జీవించి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.[2] ఆరోగ్యకరమైన వ్యక్తి ఆ బిందువులలో కూడిన గాలిన పీల్చుకోవచ్చు. లేదా వైరస్ ఉన్న ఉపరితలం లేదా వస్తువును తాకి, ఆపై మీ నోరు, ముక్కు లేదా కళ్ళను తాకితే కూడా మీరు వైరస్ను మీలొ ప్రవేశించవచ్చు. కరోనావైరస్ కౌంటర్‌టాప్స్, డోర్క్‌నోబ్స్ వంటి ఉపరితలాలపై గంటల నుండి రోజుల వరకు జీవించగలదు. ఇది ఎంతకాలం జీవించి ఉందో ఉపరితలం నుండి తయారైన పదార్థంపై ఆధారపడి ఉంటుంది. ఈ వైరస్ ను ప్రయోగశాల లోపల జాగ్రత్తగా నియంత్రిత పరిస్థితుల్లో ఉష్ణోగ్రత, తేమ, వెంటిలేషన్, నిక్షిప్తం చేయబడ్డ వైరస్ యొక్క మొత్తం సహా కారకాలపై ఆధారపడి ఉన్న డేటా , వాస్తవ-ప్రపంచ పరిస్థితుల్లో ఈ సమయాలు మారవచ్చు.ఉపరితలాలపై కరోనావైరస్ ఎలా ఉ౦టు౦దో మనకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు.[3] సమీక్ష ప్రకారం, వైరస్ లు 2 గంటల నుంచి నెల రోజుల వరకు ఎక్కడైనా ఉపరితలాలపై మనుగడ సాగించగలవు.[4] సాధారణంగా, అధిక ఉష్ణోగ్రతలు లేదా తేమ కరోనావైరస్ లు ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం కల్పిస్తాయి . మనం తరచుగా ఉపయోగించే వస్తువుల తో జాగ్రత్తగా ఉండాలి వీటిని వాడిన తరువాత కళ్లు, ముక్కు, నోటి ప్రాంతాలను నేరుగా తాకడం జరుగుతుంది.ఇతర అధ్యయనాల్లో ఈ వైరస్ గ్లాస్, మెటల్, ప్లాస్టిక్ పై తొమ్మిది రోజుల వరకు జీవించవచ్చని కనుగొన్నారు. తరచుగా తాకిన ఉపరితలాలను క్రమం తప్పకుండా నిర్జలీకరణ చేయడం ద్వారా సంక్రామ్యతను నిరోధించవచ్చు . స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ వెక్టర్ చేసిన అధ్యయనం, మరిగే ఉష్ణోగ్రత వద్ద నీరు COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ను పూర్తిగా, తక్షణమే నాశనం చేయగలదని సూచించింది సార్స్-కొవ్-2 అనేది నావెల్ కరోనా వైరస్‌కు సాంకేతిక నామం.. గది ఉష్ణోగ్రత నీటిలో 90 శాతం వైరస్ కణాలు 24 గంటల్లో, 99.9 శాతం 72 గంటల్లో చనిపోతాయని పరిశోధనలో తేలింది.గాలిలో వేడి 70 ° C కన్నా ఎక్కువ ఉంటే 5 నిమిషాల్లో కరోనావైరస్ను చంపగలదు, గది ఉష్ణోగ్రత పరిస్థితులలో 14 రోజులు పడుతుంది.ఉపరితలాలపై మిగిలి ఉన్న విషయానికి వస్తే, కాగితం, కలప లేదా వస్త్రం వంటి ఆకృతిని కలిగి ఉన్న ఉపరితలాలపై వైరస్ వేగంగా విచ్ఛిన్నమవుతుందని పరిశోధకులు కనుగొన్నారు .సున్నితంగా ఉపరితలాలు మీద వైరస్ ఎక్కువసేపు ఉంటుంది.వైరస్ విస్తృతమైన పిహెచ్ పరిస్థితులలో కూడా స్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది.ఎక్కడైనా తట్టుకుని జీవించగలిగే సామర్థ్యం ఉన్న వైరస్‌లలో కరోనావైరస్‌లు ముఖ్యమైనవి. వైరస్ మలంలో కూడా ఎక్కువసేపు ఉంటుందనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరైనా టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకుంటా దేన్నైనా ముట్టుకుంటే, వాటిని వైరస్‌తో కలుషితం చేసే ప్రమాదం ఉంది.
వివిధ రకాల ఉపరితలాలు | కరోనా వైరస్ జీవించే కాలము సుమారుగా[5] |
---|---|
రాగి - పూత లేని కాపర్ , కాపర్ అలాయ్ , ఇత్తడి, కాపర్ నికిల్[6] | 4 గంటలు |
అల్యూమినియం[7] | 8 గంటలు |
ఇతర లొహాలు
ఉదాహరణలు: డోర్క్‌నోబ్స్, నగలు, వెండి సామాగ్రి |
5 రోజులు |
చెక్క
ఉదాహరణలు: ఫర్నిచర్, ఆఫిస్ డెస్క్ , ఇతర కలప సామాగ్రి |
4 రోజులు |
ప్లాస్టిక్స్
ఉదాహరణలు: పాల కంటైనర్లు, డిటర్జెంట్ బాటిల్స్, సబ్వే, బస్సు సీట్లు, బ్యాక్‌ప్యాక్‌లు, ఎలివేటర్ బటన్లు |
2 నుండి 3 రోజులు |
స్టెయిన్లెస్ స్టీల్
ఉదాహరణలు: రిఫ్రిజిరేటర్లు, కుండలు, చిప్పలు, సింక్లు, కొన్ని నీటి సీసాలు |
2 నుండి 3 రోజులు |
కార్డ్బోర్డ్
ఉదాహరణలు: షిప్పింగ్ బాక్సులు |
24 గంటలు |
అల్యూమినియం
ఉదాహరణలు: సోడా డబ్బాలు, టిన్‌ఫాయిల్, వాటర్ బాటిల్స్ |
2 నుండి 8 గంటలు |
గాజు
ఉదాహరణలు: ఆహారానికి వాడే గాజు పాత్రలు , కొలిచే కప్పులు, అద్దాలు, కిటికీలు |
5 రోజుల వరకు |
సెరామిక్స్
ఉదాహరణలు: వంట పాత్రలు , కుండలు, కప్పులు |
5 రోజులు |
ఆహార పదార్ధాలు
ఉదాహరణలు: పొట్లాలలో ఉన్న ఆహార పదార్ధాలు |
ఆహారం ద్వారా వ్యాపించడం లేదు అయితే పొట్లాల ద్వారా వ్యాపించవచ్చు |
పేపర్
ఉదాహరణలు: మెయిల్, వార్తాపత్రిక |
కొన్ని నిమిషాలు మాత్రమే జీవిస్తాయి, మరికొన్ని 5 రోజుల వరకు జీవిస్తాయి. |
నీరు
కొరోనావైరస్ తాగునీటిలో కనుగొనబడలేదు. ఇది నీటి సరఫరాలోకి వస్తే, మీ స్థానిక నీటి శుద్ధి కర్మాగారం నీటిని ఫిల్టర్ చేసి క్రిమిసంహారక చేస్తుంది, ఇది ఏదైనా సూక్ష్మక్రిములను చంపుతుంది. |
|
బట్టలు
ఉదాహరణలు: బట్టలు, నారలు వైరస్ ఫాబ్రిక్ మీద ఎంతకాలం జీవిస్తుందనే దానిపై ఎక్కువ పరిశోధనలు లేవు, కాని ఇది కఠినమైన ఉపరితలాలపై ఉన్నంత కాలం కాదు. |
పూర్తి పరిశోధనలు లేవు |
చర్మం, జుట్టు
‘కరోనా వైరస్ మనిషి శరీరంపై ఫ్లూ వైరస్ కన్నా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. దాదాపు 9గంటలకు పైగా చర్మంపై నిలిచి ఉండే అవకాశం ఉంది.[8] దీంతో వైరస్ సులువుగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. |
9గంటల వరకు అయితే పూర్తి పరిశోధనలు లేవు |
ప్లాస్టిక్ - వైరస్ ప్లాస్టిక్ ఉపరితలాలపై సుమారు 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కిరాణా దుకాణాల్లోని పాల కంటైనర్లు, ప్లాస్టిక్ సీసాలు, చిప్స్, నామ్‌కీన్ రేపర్లు వంటి వస్తువులను తరచూ ప్రజలు తాకుతారు, ఇది వైరస్‌కు గురవుతుంది.
స్టెయిన్లెస్ స్టీల్ - మీ వంటగది పాత్రలు, రోజువారీ తినే కత్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాటిలో స్టెయిన్లెస్ స్టీల్ కలిగి ఉంటాయి. వైరస్ అటువంటి ఉపరితలాలపై 2-3 రోజులు ఉంటుంది.
గృహోపకరణాలు- రోజువారీ గృహ వస్తువులైన పండ్లు, కూరగాయలు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు మొదలైనవి వైరస్ బారిన పడేవి కావు, కాని వాటిని శుభ్రంగా ఉంచడం ఇంకా మంచిది. పండ్లు, కూరగాయలు రోజువారీ వినియోగం కోసం కాబట్టి వాటిని వాడటానికి ముందు ప్రతిరోజూ కడగడం చాలా ముఖ్యం.
ఉపరితలాలను క్రిమిరహితం చేయటం
మార్చుసోడియం హైపోక్లోరైట్ ఉన్న ఇంట్లో వాడే బ్లీచింగ్ సాయంతో ఒక్క నిమిషంలో కరోనావైరస్ ఉన్న ఈ ఉపరితలాలను తుడవటం , లేదా జల్లిచటం ( స్ప్రే ) చేయటం ద్వారా క్రిమిరహితం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి 62% ఇథనాల్, 0.5% హైడ్రోజన్ పెరాక్సైడ్, 0.1% సోడియం హైపోక్లోరైట్ లేదా బ్లీచ్ సాంద్రతలతో సహా అనేక సాధారణ శుభ్రపరిచే ఉత్పత్తులలో కనిపించే బయోసిడల్ ఏజెంట్ల ద్వారా 1 నిమిషంలో HCoV ను సమర్థవంతంగా క్రియారహితం చేయవచ్చని ఒక పరిశొధన వెల్లడించింది.[9] కరోనావైరస్లను చంపడంలో బెంజల్కోనియం క్లోరైడ్ వంటి ఇతర సాధారణ ఏజెంట్లు చాలా తక్కువ ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. 1: 100 పలుచన (0.05%) ను ఉత్పత్తి చేయడానికి 5% సోడియం హైపోక్లోరైట్‌ను నీటితో కరిగించడం ద్వారా బ్లీచ్ ఉత్పత్తి అవుతుంది. ఇది 1 నిమిషం లోపల ప్రభావవంతంగా వైరస్ లను చంపటానికి , 1:50 పలుచన (0.1%) ఘాడతను ను రెట్టింపు చేయాలని సమీక్షకులు సూచిస్తున్నారు[10].సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉండేలా ప్రతిదానికీ ప్రత్యేక పాత్రలను ఉంచడానికి ప్రయత్నించండి.క్రిమిసంహారక కోసం ద్రావణాన్ని ఉపయోగిస్తున్నప్పుడు చేతి తొడుగులు ధరించేలా చూసుకోండి. బ్లీచ్‌ను అమ్మోనియా లేదా మరే ఇతర రసాయనంతో కలపవద్దు. ఒకసారి కలిపిన తరువాత, బ్లీచ్ దాని శక్తిని కోల్పోతుంది, అది నిల్వ చేసిన కంటైనర్‌ను కూడా దెబ్బతింటుంది కాబట్టి అలా చెసిన ద్రావణాన్ని ఒక రోజుకు మించి ఉంచవద్దు.
కఠినమైన ఉపరితలాలను శుభ్రం చేయడానికి, కనీసం 70 శాతం ఆల్కహాల్‌తో ఆల్కహాల్ సొల్యూషన్స్ వాడాలి. డిటర్జెంట్, నీటితో ఉపరితలం శుభ్రం చేసిన తరువాత ఆ ఉపరితలం మీద ఆల్కహాల్ ద్రావణాన్ని 30 నిమిషాలపాటు వుంచి , ఆపై తుడిచివేయండి. ఆల్కహాల్ దాదాపు అన్ని ఉపరితలాలపై ఉపయోగించడం సురక్షితం, అయినప్పటికీ ఇది కొన్ని రకాల ప్లాస్టిక్, పెయిట్ ఉపరితలాలకు హాని చేస్తుంది. టీవీ స్క్రీన్లు మొదలైన మీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం, వాటిలో 70% ఆల్కహాల్ ఉండే స్ప్రేలతో వాటిని శుభ్రం చేయండి ఆయితే వాటిని పూర్తిగా పవర్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తరువాత మాత్రమే చేయండి . స్విచ్ బోర్డులు వాటి మీద శానిటైజర్ తో శుభ్రం చేయవద్దు ఆల్కహాల్ చాలా త్వరగా మండే లక్షణం కలిగి ఉంటుంది.
ఈ సిఫార్సు అధ్యయనాల నుండి వచ్చిన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది మీరు తదుపరి ఉపరితలం క్రిమిసంహారక చేసినప్పుడు వెంటనే వర్తించవచ్చు ప్రమాదకరమైన రసాయనాలు వాడే విషయంలో తగు జాగ్రత్త వహించండి . వైరస్ను నాశనం చేయడానికి కనీసం 20 సెకన్ల పాటు గోరువెచ్చని నీటితో మీ చేతులను సబ్బు, నీటితో కడగాలి. మీరు ఏదైనా సబ్బును ఉపయోగించవచ్చు .సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ వైరస్ను చంపడంలో ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులతో తాకబడి ఉన్న ఉపరితలాలను శుభ్రపరచండి, క్రిమిసంహారక చేయండి. ఉదాహరణకు టేబుల్స్, డోర్క్‌నోబ్స్, లైట్ స్విచ్‌లు, కౌంటర్‌టాప్‌లు, హ్యాండిల్స్, డెస్క్‌లు, ఫోన్లు, కీబోర్డులు, మరుగుదొడ్లు, మెట్ల ఆధారాలు, తలుపు కోనలు , బటన్లు , సింక్‌లు మొదలైనవి.ఉపరితలాలు మురికిగా ఉంటే, మొదట వాటిని సబ్బు, నీటితో శుభ్రం చేసి, ఆపై క్రిమిసంహారం చేయండి.పండ్లు, కూరగాయలను మీరు తినడానికి ముందు నీటిలో కడగడం మంచిది.మెయిల్ లేదా ఇతర రవాణా వస్తువులు డెలివరీ చేయడానికి తీసుకునే వలన సమయం వైరస్ మనుగడలో ఉండదు. అయితే వాటిని పంపిణీ చేసే వ్యక్తి నుండి అత్యధిక ప్రమాదం వస్తుంది. మీకు వీలైనంత వరకు డెలివరీ వ్యక్తులతో మీ పరిచయాన్ని పరిమితం చేయండి. మీరు ప్యాకేజీలను కొన్ని గంటలు బయట ఉంచవచ్చు లేదా వాటిని తీసుకురావడానికి ముందు క్రిమిసంహారక మందుతో పిచికారీ చేయవచ్చు.
మూలాలు
మార్చు- ↑ "కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?". BBC News తెలుగు. 2020-03-25. Retrieved 2020-08-09.
- ↑ "గరిష్ఠంగా 3 రోజులు!". ntnews. 2020-03-21. Retrieved 2020-08-09.
- ↑ https://www.who.int/docs/default-source/coronaviruse/risk-comms-updates/update-20-epi-win-covid-19.pdf
- ↑ "Q&A on coronaviruses (COVID-19)". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2020-08-09.
- ↑ "Can COVID-19 Survive on Surfaces?". WebMD (in ఇంగ్లీష్). Retrieved 2020-08-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-29. Retrieved 2020-08-09.
- ↑ https://www.medrxiv.org/content/10.1101/2020.03.09.20033217v1.full.pdf
- ↑ "మనిషి చర్మంపై కరోనా ఎంతసేపు ఉంటుందంటే!". www.eenadu.net. Archived from the original on 2020-10-19. Retrieved 2020-10-08.
- ↑ "కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇలా చేయడమే బెటర్." www.andhrajyothy.com. Retrieved 2020-08-09.
- ↑ Chamary, J. V. "We Still Don't Know How Long Coronavirus Lasts On Surfaces". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2020-08-09.