కర్త కర్మ క్రియ
కర్త కర్మ క్రియ 2018లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమాకు నాగు గవర దర్శకత్వం వహించాడు. వసంత సమీర్, సహేర్ ఆఫ్స హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2018 నవంబర్ 8న విడుదలైంది.[1][2]
కర్త కర్మ క్రియ | |
---|---|
![]() | |
దర్శకత్వం | నాగు గవర |
రచన | నాగు గవర |
నిర్మాత | చదలవాడ పద్మావతి |
నటవర్గం | వసంత సమీర్, సహేర్ ఆఫ్స, రవి వర్మ |
ఛాయాగ్రహణం | దుర్గ కిషోర్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ |
విడుదల తేదీలు | 2018 నవంబరు 8 |
నిడివి | 130 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
సిద్ధు (సమీర్) ఓ సెల్ ఫోన్ మెకానిక్ గా పని చేస్తుంటాడు. అతను బైక్ షో రూమ్ లో పని చేసే మైత్రి (సెహర్) ని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ దగ్గరవుతున్న తరుణంలో అప్పటికే మైత్రి అక్క దివ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని దివ్య చావుకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే మైత్రి ఉందని మైత్రి ద్వారానే సిద్ధుకు తెలుస్తోంది. ఈ విషయంలో సిద్దు మైత్రికి సహాయం చేస్తుంటాడు. ఈ ఆత్మహత్యకూ, నగరంలో జరిగిన మరో రెండు ఆత్మహత్యలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రవివర్మ వస్తాడు. ఆయన విచారణలో తేలిన నిజాలేంటి ? ఈ మరణాల వెనుక కారణమేంటి ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులుసవరించు
- వసంత సమీర్ [3]
- సహేర్ ఆఫ్స
- రవివర్మ
- కాదంబరి కిరణ్
- కాశీ విశ్వనాథ్
- జయప్రకాశ్ రెడ్డి
- చంద్రమహేష్
- లోహిత్ కుమార్
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్
- సమర్పణ: చదలవాడ శ్రీనివాసరావు [4]
- నిర్మాత: చదలవాడ పద్మావతి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: నాగు గవర
- సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: దుర్గ కిషోర్
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
మూలాలుసవరించు
- ↑ The Times of India (8 November 2018). "Kartha Karma Kriya Movie: Showtimes, Review,". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Zee Cinemalu (4 November 2018). "'కర్త కర్మ క్రియ' రిలీజ్ డేట్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Sakshi (11 November 2018). "రైటర్ టు హీరో". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Sakshi (5 November 2018). "'బిచ్చగాడు'లా హిట్ అవ్వాలి". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.