ప్రధాన మెనూను తెరువు

కాదంబరి కిరణ్ ఒక తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధానమైన, సహాయ పాత్రల్లో నటించాడు.[2] 270 కి పైగా సినిమాల్లో నటించాడు. టీవీ కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు. మనం సైతం అనే సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.[3] మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.[4]

కాదంబరి కిరణ్
కాదంబరికిరణ్.jpeg
జననంకాదంబరి కిరణ్ కుమార్
గురజాన పల్లి, కాకినాడ
నివాసంహైదరాబాదు
చదువుబి.కామ్
విద్యాసంస్థలుశ్రీ రామచంద్ర కాలేజి, హైదరాబాదు.
వృత్తినటుడు
జీవిత భాగస్వామికల్యాణి
పిల్లలుశ్రీకృతి
తల్లిదండ్రులు
  • కె. వి. ఎస్. మూర్తి[1] (తండ్రి)
  • అన్నపూర్ణ (తల్లి)

వ్యక్తిగత జీవితంసవరించు

కాకినాడలో జన్మించిన ఈయన 1973 లో హైదరాబాదులో ఉన్న మేనమామల దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. నటనపై ఆసక్తితో మొదటగా నాటకాల్లో పాల్గొనేవాడు. 1986 లో టీవీ రంగంలో ప్రవేశించాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే ధారావాహికను నిర్మించి దర్శకత్వం వహించాడు. అది విజయవంతం కావడంతో టీవీలో అన్ని విభాగాల్లో పనిచేశాడు.[3]

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "కాదంబరి కిరణ్ కుమార్ ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 6 March 2018.
  2. "తెలుగు హాస్యనటుడు కాదంబరి కిరణ్ కుమార్". nettv4u.com. Retrieved 6 March 2018.
  3. 3.0 3.1 "అసహాయులకు అండ..మనం సైతం". sakshi.com. సాక్షి. Retrieved 6 March 2018.
  4. "సినిమా కష్టాలు తీర్చేస్తున్నారు". ఈనాడు. ఈనాడు. 23 April 2018. మూలం నుండి 24 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 24 April 2018.