కర్నూలు విమానాశ్రయం

కర్నూలు విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్ వద్ద ఉన్న విమానాశ్రయం. ఇది జాతీయ రహదారి 40 (కర్నూలు-నంద్యాల్ హైవే) తూర్పు వైపున, కర్నూలు నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్), నిర్మించింది.[2]

కర్నూలు విమానాశ్రయం
కర్నూలు విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రభుత్వ నిర్వహణ
యజమానిఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రాల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్
సేవలుకర్నూలు
ప్రదేశంఓర్వకల్లు
టైమ్‌జోన్IST (+5:30)
ఎత్తు AMSL ft / 280.4 m
అక్షాంశరేఖాంశాలు15°42′22″N 78°09′39″E / 15.70611°N 78.16083°E / 15.70611; 78.16083
వెబ్‌సైటుhttps://www.apadcl.com
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
10/28 6,562 2,000
Source: APADCL[1]

మారుమూల ప్రాంతాల సంపర్కాలను మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో కూడిన విమానాశ్రయాల అభివృద్ధి కోసం 2013 లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 50 స్థానాల్లో కర్నూలు ఒకటి.[3] విమానాశ్రయం 639 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. 456 ఎకరాలు పుడిచెర్లా కింద, ఓర్వకల్‌లో 115 ఎకరాలు, కన్నమడకాలలో 67 ఎకరాలు ఉన్నాయి.[4] భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2016 లో ఓర్వకల్ స్థలాన్ని ఆమోదించింది.[5] ఫిబ్రవరి 2017 లో రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూన్ 2017 లో శంకుస్థాపన చేయగా,[6] విమానాశ్రయం పనులు 18 నెలల్లో పూర్తయ్యాయి, రన్వే ప్రయోగాత్మక ఉపయోగం 2018 డిసెంబరులో విజయవంతంగా జరిగింది.[7] ఈ విమానాశ్రయాన్ని 2019 జనవరి 8 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించాడు.

2021 మార్చి 28 న ఇండిగో కర్నూలు నుండి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమాన సేవలు ప్రారంభించనుంది.[8]

మూలాలు మార్చు

  1. "S.I.T.C. of NIGHT LANDING FACILITIES AT KURNOOL AIRPORT IN ANDHRA PRADESH" (PDF). ANDHRA PRADESH AIRPORTS DEVELOPMENT CORPORATION LIMITED. p. 8. Archived from the original (PDF) on 2 ఫిబ్రవరి 2019. Retrieved 2 February 2019.
  2. "SPV formed for Bhogapuram airport to speed up works". The Hindu. 21 May 2015. Retrieved 2015-06-23.
  3. "Centre to focus on low-cost Airports along tourist circuits". The Times of India. 5 July 2014. Retrieved 6 February 2017.
  4. "639 acres alienated for Greenfield Airport in Kurnool district". The Hindu. 4 February 2017. Retrieved 6 February 2017.
  5. "Centre gives nod for Nellore, Kurnool airport sites". The Times of India. 3 February 2016. Retrieved 6 February 2017.
  6. "Orvakal airport will accelerate growth: Naidu". Evening Standard. 22 June 2017. Archived from the original on 4 జనవరి 2019. Retrieved 4 January 2019.
  7. "Trial run successful for Kurnool Airport". The Hindu. 31 December 2018. Retrieved 4 January 2019.
  8. "కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి విమాన సేవలు". asianetnews. 2021-01-29. Retrieved 2021-02-04.