ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు

కలవరమాయే మదిలో
(2009 తెలుగు సినిమా)

సినిమా పోస్టరు
దర్శకత్వం సతీష్ కాసెట్టి
నిర్మాణం మోహన్ వడ్లపట్ల
రచన సతీష్ కాసెట్టి
వనమాలి
తారాగణం కలర్స్ స్వాతి
కమల్ కామరాజు
తనికెళ్ళ భరణి
సంగీతం శరత్ వాసుదేవన్
ఛాయాగ్రహణం రాజేంద్ర కేసాని
కూర్పు బస్వా పైడి రెడ్డి
విడుదల తేదీ 17-07-2009
దేశం భారతదేశం
భాష తెలుగు

కథా విశేషాలు

మార్చు

తల్లితో కలిసి ఉండే శ్రేయ(కలర్స్ స్వాతి) అనే అమ్మాయి హోటల్లో పాటలు పాడుతుంటుంది. ఒక సారి ఆ హోటలుకు వచ్చిన ప్రఖ్యాత సంగీతం మాస్టారు ఆమెకు సంగీతం తెలియదని మందలిస్తాడు. సంగీతం నేర్చుకోడానికి అతని ఇంటికి వెళ్ళిన ఆమెను మళ్ళీ రవద్దని పంపేస్తాడు. అయినా పట్టు వదలని శ్రేయ అతని ఇంట్లో పనిమనిషిగా ఉంటూ ఆయన అభిమానం సంపాదించి సంగీతం నేర్చుకొంటుంది.

శ్రేయ ("కలర్స్ స్వాతి") ఓ గాయని. శాస్త్రీయ సంగీతం రాదు, ఓ హోటల్లో పాటలు పాడుతూ ఉంటుంది. మరో పక్క చార్టెడ్ అకౌంటేన్సి చదువుతూ ఉంటుంది. తండ్రి లేని శ్రేయకి తల్లే (ఢిల్లీ రాజేశ్వరి) అన్నీ. ఆ తల్లికి సంగీతం అంటే కిట్టదు. ఎప్పటికైనా రెహ్మాన్ దగ్గర పాడాలన్నది శ్రేయ కల. (హమ్మయ్య.. హీరోయిన్ కీ ఓ లక్ష్యం ఉంది) లండన్ లో ఉండే శ్రీను (కమల్ కామరాజు, ఆవకాయ్-బిర్యాని ఫేం) ఓ ఆరు నెల్ల ప్రాజెక్టు కోసం హైదరాబాదు వచ్చి హోటల్లో శ్రేయని చూస్తాడు. తొలిచూపులోనే శ్రీనుతో ప్రేమలో పడిపోతుంది శ్రేయ. పాపం, అతనికి ఇవేవీ తెలియవు, ఫారిన్ రిటర్న్డ్ కదా.. ఇలా చకచకా కథ సాగిపోతుండగా రావు గారు (విక్రం గోఖలే) అనే సంగీత విద్వాంసుడు ఓ రోజు హోటల్లో శ్రేయ సంగీతాన్ని అవమానిస్తాడు, దారుణంగా. శ్రీనూ కూడా శ్రేయ నేర్చుకోవాల్సింది చాలా ఉందనీ, రావుగారైతేనే సరైన గురువు అనీ చెబుతాడు. అసిస్టెంట్ శాస్త్రి (తనికెళ్ళ భరణి) మినహా తనకంటూ ఎవరూ లేని రావుగారు ముక్కోపి. కృత్యదవస్థ మీద ఆయన్నితనకి పాఠాలు చెప్పడానికి ఒప్పిస్తుంది శ్రేయ. శ్రేయ తల్లికి సంగీతం అంటే ఎందుకంత అలెర్జీ? రావుగారి గతం ఏమిటి? శ్రేయ తన లక్ష్యం సాధించిందా? శ్రీనూకి తన ప్రేమని ప్రకటించిందా? ఇవన్నీ సినిమా రెండో సగం.

'హోప్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సతీష్ కాసెట్టికి దర్శకుడిగా ఇది రెండో సినిమా.

పాటల జాబితా

మార్చు

పాటల రచయిత వనమాలి

కలవరమాయే మదిలో , రచన: వనమాలి , గానం.కె.ఎస్.చిత్ర

తొలి తొలి ఆశలెన్నో , గానం.కె ఎస్ చిత్ర

నీలో అణువంత , గానం.కె ఎస్ చిత్ర , రోషన్ సెబాస్టియన్

కరివరదుని , గానం.కె ఎస్ చిత్ర , శరత్

గురు బ్రహ్మ , గానం.కె ఎస్ చిత్ర

ఓ నువ్వే ఓ నేనని , గానం.హరిచరన్ , కల్పన

సరిగర సరిగరి , గనం. శరత్

పల్లవించని , గానం.కె ఎస్ చిత్ర.

బయటి లింకులు

మార్చు