వనమాలి

గీత రచయిత

వనమాలి వర్థమాన సినీ గీత రచయిత. ఈయన హ్యాపీ డేస్ చిత్రానికి ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పూర్వాశ్రమంలో ఈయన సితార పత్రికలో పాత్రికేయులుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పి.హెచ్.డి చేశారు.

వనమాలి
Vanamali.jpg
జననంమణి గోపాల్
జనవరి 31, 1974
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లువనమాలి
వృత్తిసినీ గీత రచయిత
పాత్రికేయుడు (పూర్వం)
పిల్లలువనమాలి (కుమారుడు)

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

వనమాలి అసలు పేరు మణి గోపాల్. వీరు జన్మతః తమిళులు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కడప, కదిరి లో సాగింది. పిమ్మట హిందీ భాషా పండిట్ శిక్షణ ను కూడా పూర్తి చేశాడు. తరువాత తెలుగు భాష మీద ప్రత్యేక అభిమానంతో తొలుత ఎం.ఏ చేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయం వారి ఉపకార వేతనముతో పి.హెచ్.డి పూర్తి చేశాడు.

ఉద్యోగ ప్రస్థానంసవరించు

సితార సినీ వార పత్రిక ప్రకటించిన ఉద్యోగ ప్రకటన చూసి దానికి దరఖాస్తు చేయగా 176 అభ్యర్థులలో వీరు ఎంపికయ్యాడు. తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన అభిరుచి మేరకు రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు.

సినీరంగ ప్రవేశంసవరించు

ప్రముఖ తమిళ దర్శకులు గీతాకృష్ణ గారి టైమ్ చిత్రానికి గేయాలను రచించడం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు.

ఇంతవరకు పనిచేసిన చిత్రాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వనమాలి&oldid=3719741" నుండి వెలికితీశారు