కలియుగ రావణాసురుడు
ఇది 1980లో విడుదలైన సినిమా.బాపూ గారి చాలా సినిమాల్లాగే ఇది కూడా రామాయణం సోషల్ వెర్షన్. బాపు రమణ ద్వయం రావణుని చే సీతాపహరణాన్ని, సీతారామ వియోగాన్ని సాంఘికరూపంలో ఈ చిత్రంలో చూపారు. రావుగోపాలరావు రావణాసురుడు, మురళీమోహన్ రాముడు, శారద సీతగా కనిపిస్తే...ఆంజనేయుడి రెండు వెర్షన్స్ లో (బాలాంజనేయుడు, వీరాంజనేయుడు) బేబీ తులసి, శ్రీధర్ కనిపిస్తారు. అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, దీప ఇతర ముఖ్య తారాగణం. కథకు వస్తే రావుగోపాలరావు ఒక అటవీప్రాంతంలో భూస్వామిగా ఉండి,తన కిందివారికి జీవిత బీమా చేయించి వారిని పులిరూపంలో హతమారుస్తూ, వారి స్త్రీలను బలత్కరిస్తూ, బీమా సొమ్ము కాజేస్తుంటాడు. మురళీమోహన్ బీమా కంపెనీ తరఫున వస్తాడు.అతని భార్య శారదను రావుగోపాలరావు చూసి మోహించి, ఆమెను కిడ్నాప్ చేసి తన కోటలో బంధిస్తాడు. పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ పథకం వేసి సీతను చెర విడిపిస్తాడు. "నల్లానల్లని కళ్ళు, నమోనమో హనుమంతా' మొదలైన మంచి పాటలున్నాయి ఈ చిత్రంలో.
కలియుగ రావణాసురుడు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బాపు |
తారాగణం | రావుగోపాలరావు, మాగంటి మురళీమోహన్, శారద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రాజలక్ష్మీ సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
కథ,మాటలు,స్క్రీన్ ప్లే : ముళ్ళపూడి వెంకట రమణ, సంగీతం: కె. వి. మహాదేవన్, పాటలు: వేటూరి,సినారె. బాలూమహేంద్ర కెమేరా.అనివార్యకారణాల వల్ల ఆయన వెళ్ళిపోతే అహ్మద్ ఆజ్మీవచ్చి పూర్తిచేశాడు.నిర్మాత: అంగర సత్యం సినిమా లొకేషన్స్ : ద్రాక్షారామ పక్క దొడ్డంపేట జమీందార్ కోట, మారేడుమిల్లి అడవి.
పాటల జాబితా
మార్చు1.నమో నమో హనుమంత మహిత గుణవంత, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
2.నల్ల నల్లని కళ్ళు నవ్వీ నవ్వనీ కళ్ళు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
3.పుట్టేటి భానుడా పుష్యరాగపు ఛాయ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల
4.సింగరాల కొండకాడ సింగాన్ని కొట్టబోయి, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి బృందం
5.సెరువులో సేపఉంది చేతిలో గాలముంది, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
6.ఇన్నాళ్లు నేనెరుగనమ్మఅమ్మా అమ్మా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.
7.టకీలా ధగడ్ మియా చికిటా, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి, గేదెల ఆనంద్ బృందం.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.