మురళీమోహన్ (నటుడు)
మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచాడు.
మాగంటి మురళీమోహన్ | |
---|---|
జననం | 24 జూన్, 1940 చాటపర్రు |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ఇతర పేర్లు | రాజబాబు |
విశ్వవిద్యాలయాలు | సి.ఆర్.రెడ్డి కళాశాల |
వృత్తి | వ్యాపారి, నటుడు, రాజకీయ నాయకుడు |
భార్య / భర్త | విజయలక్ష్మి |
తండ్రి | మాగంటి మాధవరావు |
తల్లి | వసుమతీదేవి |
జీవిత విశేషాలు
మార్చుఇతని అసలు పేరు మాగంటి రాజబాబు. ఇతడు 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు[1]. ఇతని తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఇతడు 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు.
ఇతని భార్య పేరు విజయలక్ష్మి. వీరికి మధుబిందు అనే కుమార్తె రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు. కోడలు పేరు రూప.
సినిమా రంగం
మార్చు1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది. ఇతడు సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించాడు. ఇతడు తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించాడు. ఇతడు నేషనల్ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు.
వ్యాపార రంగం
మార్చుఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.
రాజకీయాలు
మార్చుఇతడు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో 2,147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో 16వ లోక్‌సభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మురళీమోహన్ నటించిన చిత్రాలు
మార్చు- జగమేమాయ (1973)
- నేరము – శిక్ష (1973)
- తిరుపతి (1974)
- రాధమ్మ పెళ్లి (1974)
- దేవుడు చేసిన పెళ్లి (1974)
- వయసొచ్చిన పిల్ల (1975)
- జేబు దొంగ (1975)
- బలిపీఠం (1975)
- భారతంలో ఒక అమ్మాయి (1975)
- బాబు (1975)
- జ్యోతి (1976)
- పొరుగింటి పుల్లకూర (1976)
- ఓ మనిషి తిరిగి చూడు (1976)
- తూర్పు పడమర (1976)
- యవ్వనం కాటేసింది (1976)
- నేరం నాది కాదు ఆకలిది (1976)
- ముద్దబంతి పువ్వు (1976)
- మహాత్ముడు (1976)
- కల్పన (1977)
- గంగ యమున సరస్వతి (1977)
- తొలిరేయి గడిచింది (1977)
- ప్రేమలేఖలు (1977)
- ఇదెక్కడి న్యాయం (1977)
- రంభ ఊర్వశి మేనక (1977)
- దేవతలారా దీవించండి (1977)
- గడుసు అమ్మాయి (1977)
- అమరదీపం (1977)
- చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
- ఆమె కథ (1977)
- దొంగల దోపిడీ (1977)
- తల్లే చల్లని దైవం (1978)
- పొట్టేలు పున్నమ్మ (1978)
- మన ఊరి పాండవులు (1978)
- శివరంజని (1978)
- కళ్యాణి (1979)
- ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
- దశ తిరిగింది (1979)
- సీతే రాముడైతే (1979)
- రావణుడే రాముడైతే (1979)
- నా ఇల్లు నా వాళ్లు (1979)
- ముద్దుల కొడుకు (1979)
- మా ఊళ్ళో మహాశివుడు (1979)
- కోరికలే గుర్రాలైతే (1979)
- నీడ (1979)
- సుజాత (1980)
- నిప్పులాంటి నిజం (1980)
- మంగళ గౌరి (1980)
- కలియుగ రావణాసురుడు (1980)
- లక్ష్మి (1980)
- పొదరిల్లు (1980)
- బుచ్చిబాబు (1980)
- మూగకు మాటొస్తే (1980)
- యువతరం కదిలింది (1980)
- చేసిన బాసలు (1980)
- దీపారాధన (1980)
- వారాలబ్బాయి (1981)
- డబ్బు డబ్బు డబ్బు (1981)
- ఎర్రమల్లెలు (1981)
- ప్రేమ నాటకం (1981)
- ప్రేమాభిషేకం (1981)
- ఆశాజ్యోతి (1981)
- అద్దాలమేడ (1981)
- చలాకీ చెల్లెమ్మ (1982)
- జయసుధ (1982)
- చందమామ (1982)
- రామాయణంలో పిడకలవేట (1982)
- యువరాజు(1982)
- ప్రతీకారం(1982)
- బొబ్బిలి పులి (1982)
- రుద్రకాళి (1983)
- పిచ్చిపంతులు (1983)
- మరో మాయాబజార్ (1983)
- కుంకుమ తిలకం (1983)
- కోటికొక్కడు (1983)
- దుర్గాదేవి (1983)
- దేవీ శ్రీదేవి (1983)
- ఆడదాని సవాల్ (1984)
- భలే రాముడు (1984)
- సీతమ్మ పెళ్ళి (1984)
- నిర్దోషి (1984)
- మనిషికో చరిత్ర (1984)
- కుటుంబ గౌరవం (1984)
- జస్టిస్ చక్రవర్తి (1984)
- ఆలయదీపం (1984)
- చిరంజీవి (1985)
- శ్రీమతిగారు (1985)
- ఓ తండ్రి తీర్పు (1985)
- ముగ్గురు మిత్రులు (1985)
- శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
- కర్పూర దీపం (1986)
- ఇదే నా సమాధానం (1986)
- శ్రావణ మేఘాలు (1986)
- అందరికంటే ఘనుడు (1987)
- న్యాయానికి సంకెళ్ళు (1987)
- కిరాయి దాదా (1987)
- ఆత్మ బంధువులు (1987)
- కలెక్టర్ విజయ (1988)
- చినబాబు (1988)
- నవభారతం (1988)
- పృథ్వీరాజ్ (1988)
- రావుగారిల్లు (1988)
- త్రినేత్రుడు (1988)
- ముగ్గురు కొడుకులు (1988)
- యుద్ధభూమి (1988)
- శివ (1989)
- ముత్యమంత ముద్దు (1989)
- సూత్రధారులు (1990)
- సీతారామయ్యగారి మనవరాలు (1991)
- గ్యాంగ్ లీడర్ (1991)
- నిర్ణయం (1991)
- పెళ్ళాం చెబితే వినాలి (1992)
- చిరునవ్వుల వరమిస్తావా
- అల్లరి అల్లుడు (1993)
- తీర్పు (1994)
- ఘరానా బుల్లోడు (1995)
- ఆయనకి ఇద్దరు (1995)
- మాయాబజార్ (1995)
- ఓహో నా పెళ్ళంట (1996)
- సంప్రదాయం (1996)
- సూపర్ హీరోస్ (1997)
- శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి (1998)
- చంద్రలేఖ (1998)
- నేటి గాంధీ (1999)
- ప్రేమతో రా (2001)
- ప్రేమించు (2001)
- రాఘవేంద్ర (2003)
- విజయం (2003)
- విష్ణు (2003)
- లక్ష్మీనరసింహా (2004)
- అర్జున్ (2004)
- భద్ర (2005)
- అల్లరి బుల్లోడు (2005)
- రిలాక్స్ (2005)
- బొమ్మరిల్లు (2006)
- అధినేత (2009)
- బంగారు బాబు (2009)
- ఓం శాంతి (2010)
- మిస్టర్ పర్ఫెక్ట్ (2011)
- రాజ్ (2011)
- శ్రీరామరాజ్యం (2011)
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
- సుప్రీమ్ (2016)
- ఒక్కడు మిగిలాడు (2017)
- జైసింహా (2018)
- పరంపర (2021)
- గాడ్ ఫాదర్ (2022)
పురస్కారాలు
మార్చునంది పురస్కారాలు
మార్చుసంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1985 | ఓ తండ్రి తీర్పు | నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు | గెలుపు |
ఇతర పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sixteenth Lok Sabha Members Bioprofile Maganti, Shri Murali Mohan". లోక్‌సభ అధికారిక వెబ్సైటు. Archived from the original on 10 మే 2019. Retrieved 18 February 2019.