కలెక్టర్ గారి అబ్బాయి
కలెక్టర్ గారి అబ్బాయి బి. గోపాల్ దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, రజని, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పంపిణీ చేయబడింది. ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.
కలెక్టర్ గారి అబ్బాయి | |
---|---|
దర్శకత్వం | బి. గోపాల్ |
రచన | గణేష్ పాత్రో (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఎ. ఆంజనేయ పుష్పానంద్ |
కథ | కొమ్మనాపల్లి గణపతిరావు ఎ. ఆంజనేయ పుష్పానంద్ ఎస్. రామ్మోహన రావు |
నిర్మాత | యార్లగడ్డ సురేంద్ర |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, రజని, శారద |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాల రెడ్డి |
కూర్పు | కె. ఎ. మార్తాండ్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఎస్. ఎస్. క్రియేషన్స్ |
పంపిణీదార్లు | అన్నపూర్ణ స్టూడియోస్ |
విడుదల తేదీ | 8 ఏప్రిల్ 1987 |
సినిమా నిడివి | 170 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకలెక్టరు రమాకాంతరావు తన వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వాడు. ఆయనకు చట్టం, న్యాయం అంటే ఎనలేని గౌరవం. వారిది ముచ్చటైన కుటుంబం, భార్య లక్ష్మీదేవి, కొడుకు రవి, కూతురు జ్యోతిలతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. తండ్రికి, కొడుక్కి అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. రవి కొన్ని సార్లు చట్టాన్ని ఉల్లంఘించకపోతే న్యాయం జరగదు అంటూ ఉంటాడు. దానికి అతని తండ్రి అంగీకరించడు. వ్యాపారవేత్త అయిన అప్పారావు, అతని భాగస్వామి ఏలిముద్రల ఎల్లయ్య కలిసి వారి కొడుకులు కన్నారావు, చిన్నారావుతో కలిసి దొంగ వ్యాపారాలు చేస్తుంటారు.
తారాగణం
మార్చు- రమాకాంతరావుగా అక్కినేని నాగేశ్వరరావు, కలెక్టరు
- రవిగా, అక్కినేని నాగార్జున, రమాకాంతరావు కొడుకు
- రజని
- లక్ష్మీదేవిగా శారద, రమాకాంతరావు భార్య
- జ్యోతిగా వరలక్ష్మి
- అప్పారావుగా కోట శ్రీనివాసరావు, వ్యాపారవేత్త
- ఏలిముద్రల ఎల్లయ్యగా నూతన్ ప్రసాద్
- కన్నారావుగా సుధాకర్
- శుభలేఖ సుధాకర్
- సుత్తి వేలు
- సూర్య
- పి ఎల్ నారాయణ
- నర్రా వెంకటేశ్వరరావు
- శ్రీలక్ష్మి
- రమాప్రభ.
పాటలు
మార్చుఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. పాటలు ఎ. వి. ఎం మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "అందమా అంటుకోనీవే" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల | 4:11 |
2. | "నచ్చిన చోట" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల | 3:41 |
3. | "బంగారు లేడిని కోరినా" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల | 3:53 |
4. | "మన్మథా మన్మథా" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల | 3:36 |
5. | "సన్నాయి ఆపకు బావా" | మనో, పి. సుశీల, ఎస్. పి. శైలజ | 5:00 |