కొమ్మనాపల్లి గణపతిరావు

కొమ్మనాపల్లి గణపతిరావు తెలుగు నవలా సాహిత్యంలో పేరెన్నికగన్న రచయితలలో ఒకడు.[1] కొమ్మనాపల్లి శైలి సున్నితంగా భావగర్భితంగా ఉండి మనసును హత్తుకుంటుంది. రాసినవి కొన్ని నవలలే అయినాకూడా పాఠకుల ఆదరణ పొందగలిగినవి. అతను అనేక సినిమాలకు, సీరియళ్లకు కథలు, సంభాషణలు రాసాడు.

కొమ్మనాపల్లి రచయిత

జీవిత విశేషాలుసవరించు

తాను పుట్టిన 11వనెలలోనే తన తల్లి మరణించింది. తరువాత అతను అనుకోకుండా అమ్మమ్మ వద్ద పెరిగాడు. తన అమ్మ తమ్ముడు అతనిని విశాఖపట్నంలో చదివించి తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. ఆమె భార్య పేరు లక్ష్మి. అతను హెచ్.ఎం.టి ఇంజనీరుగా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత ఉద్యోగం చేస్తూనే రచయితగా మారి తన రచనా ప్రస్థానాన్ని కొనసాగించాడు.

తన చిన్నతనంలో తన తాతగారింట ఉన్నప్పుడు అతని తాత మహాభారతం కథలను సరిగా కనిపించక చదవలేక వాటిని అతనితో చదివించేవాడు. తరువాత వాటికి అర్థాలు చెప్పేవాడు. అది అతనికి భాషపై పట్టు రావడానికి తోడ్పడింది. హెచ్.ఎం.టి లో జాయిన్ అయిన కొత్తలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న సమయంలో కథలు రాయడం ప్రారంభించాడు. అతను రాసిన మొదటి కథ " చీకటి ఆర్పేసింది" ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. తరువాత కథలు, నవలలు, సినిమాలు వంటి రకరకాల ప్రక్రియలలో రచనలు రాసాడు.

అతను తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించాడు. దీనికి కారణం అందరూ రాసేటట్లు కుటుంబ నేపధ్యం ఉన్నవి మత్రమే రాయకుండా కుక్కపిల్లలు, పాములు వంటి జంతువులను కథలో పాత్రలుగా సమ్మిళితం చేసి అలా నవలకీ, నవలకీ వైవిధ్యం ఉండేటటట్లు రచనలు చేసాడు. ఆ సమయంలో ఆంధ్రభూమి ఎడిటర్ అతనిని మొదటి సారి ఒక రచయితను వీక్లీ కవర్ పేజీపై వచ్చే విధంగా చేసారు. ఆంధ్రభూమి వీక్లీలో హంసధ్వని అనే నవల సీరియల్ రూపంలో వచ్చేది. అది చదివిన తరువాత కాట్రగడ్డ మురారి అనే నిర్మాత అతనిని రచయితగా సినిమా రంగంలోకి ఆహ్వానించాడు. ఆ తరువాత అతను దాసరి నారాయణ రావుని పరిచయం చేసాడు. అతను రచయితగా మొదటి తెలుగు సినిమా శోభన్ భాబు కథానాయకునిగా విడుదలైన అభిమన్యుడు . అతై 1964లో విడుదలైంది. అతను దాసరి నారాయణ రావు వద్ద సినీ రచయితగా మెళకువలు నేర్చుకున్నాడు. సుమారు 40 సినిమాలకు కథలు రాసాడు. అతను దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, క్రాంతికుమార్, రామ్‌గోపాల్ వర్మ వంటి వారికి తన కథలను అందించాడు. అతను కథలను రాయడమే కాకుండా త్రివిక్రం శ్రీనివాస్ రచయితను సినీ పరిశ్రమకు పరిచయం చేసాడు. అదే విధంగా రాం గోపాల్ వర్మను కూడా ప్రోత్సహించే వ్యక్తులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. ఇలా అనేక మంది సంభాషణా రచయితలను, రచయితలను సినిమా రంగానికి పరిచయం చేసాడు.

బాల్యంలో తల్లిదండ్రులను కోల్పోయినందున ప్రేమ, వాత్సల్యం కోసం తపించిపోయే జీవితం అయినందున అతను ఎక్కువగా కుటుంబ కథలను రాయడానికి ఇష్టపడేవాడు. అతని నవలలు, సీరియళ్లలో ఎక్కువగా తల్లి, పిల్లల సెంటిమెంటుతో ఎక్కువగా పాఠకులను ఆకట్టుకున్నాడు.

అతనికి ఐదు నంది పురస్కారాలు లభించాయి. 2016లో ఈటీవీలో దాసరినారాయణరావు కథ "అభిషేకం" కు అతను స్క్రీన్ ప్లే చేసాడు. దానికి భారతీయ భాషలలో సోలో రచయితగా 2390 ఎపిసోడ్సు రాసిన స్క్రీన్ ప్లే రచయితగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం లభించింది.

సినిమాలుసవరించు

నవలా జాబితాసవరించు

 • అగ్నిశ్వాస
 • అరణ్యకాండ
 • అసురవేదం
 • బలిధానం
 • బెట్టర్ హెర్
 • బ్లాక్ మాంబా
 • దేవ గాంధారం
 • గోరు వెచ్చని సూర్యుడు
 • గ్రాండ్ మాష్టర్
 • హంసగీతం
 • కాండవ దహనం
 • మేజర్ సంగ్రామ్
 • మృత్యుంజయుడు
 • మిస్.మేనక. ఐపియస్
 • నాని
 • ఒక్క క్షణం
 • ప్రణయ ప్రభంధం
 • రోషనారి
 • శత ధినోత్సవం
 • శతగ్ని
 • సినీస్టార్
 • ది జడ్జిమెంట్
 • పడిలేచే కడలి తరంగం

మూలాలుసవరించు

 1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-17.

బాహ్య లంకెలుసవరించు