అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటులు, నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వర రావు యొక్క కుమారుడు.
అక్కినేని నాగార్జున | |
---|---|
![]() అక్కినేని నాగార్జున | |
జననం | అక్కినేని నాగార్జున రావు ఆగష్టు 29, 1959 |
ఇతర పేర్లు | నాగ్, యువసామ్రాట్ King |
పూర్వ విద్యార్థులు | అన్నా విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు, సినీ నిర్మాత, |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
Notable work | శివ (1989), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006) |
జీవిత భాగస్వాములు | లక్ష్మీ రామానాయుడు దగ్గుపాటి (1984–1990 divorced) అమల అక్కినేని (1992–present) |
పిల్లలు | అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ |
తల్లిదండ్రులు | అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ |
వ్యక్తిగతంసవరించు
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [1] నాడు లక్ష్మితో [2] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్కు సోదరి [3]. వీరిరువురు విడాకులు తీసుకున్నారు[4]. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) [1] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[1] రెండవ భార్య కొడుకు.
సినిమా జీవితముసవరించు
నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.
పురస్కారములుసవరించు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
- జాతీయ చిత్ర పురస్కారాలు
- 1997 - నిన్నే పెళ్ళాడతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1998 - అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- నంది పురస్కారాలు
- నటుడిగా
- 2011 - రాజన్న సినిమాకి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- 2006 - శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు
- 2002 - సంతోషంలో నంది ఉత్తమ నటుడు[5]
- 1997 - అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు [5]
- నిర్మాతగా
- 1996 - నిన్నే పెళ్ళాడుతా కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం)
- 1999 - ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం
- 2000 - యువకుడు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం[6]
- 2002 - మన్మధుడు నంది ఉత్తమ చిత్రం
- 2011 - రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం [7]
- 1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు.
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు.
- దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం
- సినీ'మా' పురస్కారాలు
- 2012 - రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు[9]
- 2013 - శిర్డీసాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం [10]
- ఇతర పురస్కారాలు
- 1990 - శివ సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఆకృతి చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం
- 2000 - ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టు పురస్కారం
- 2011- టీ. సుబ్బరామిరెడ్డి కళారత్న పురస్కారం
- భరతముని పురస్కారాలప
- వంశీ బర్కిలీ పురస్కారాలు
- ఏపీ సినీ గోయర్స్ పురస్కారం
- 1989 - గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు.
అవీ-ఇవీసవరించు
- ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. భరణికి ఇతను మంచి మిత్రుదు.
నటించిన చిత్రాలుసవరించు
అక్కినేని వంశ వృక్షంసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-28. Retrieved 2007-05-25.
- ↑ http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-05-16. Retrieved 2007-05-25.
- ↑ 5.0 5.1 "Many Happy Returns to Nag". IndiaGlitz. 29 August 2007. Retrieved 2 March 2010.
- ↑ "Nandi Awards -2000". 19 September 2002. Retrieved 18 November 2011.
- ↑ "2011 Nandi Awards winners list - The Times of India". The Times of India. Retrieved 2012-10-13.
- ↑ "SIIMA: Nagarjuna and others for Telugu nominations - South Cinema - Telugu News - ibnlive". Ibnlive.in.com. 2012-06-05. Retrieved 2012-10-24.
- ↑ 5.50 PM IST 06.18.2012 (2012-06-18). "Kamal Haasan graces CineMAA awards 2012 - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at". Bollywoodlife.com. Archived from the original on 2018-09-12. Retrieved 2012-10-24.
- ↑ Nitya, Nag bag awards on star-studded night | The Hindu
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Akkineni Nagarjuna. |