కలెక్టర్ గారి భార్య
కలెక్టర్ గారి భార్య 2010 లో టేకుల కృపాకర రెడ్డి దర్శకత్వంలో విడుదలైన మహిళా హక్కుల పోరాట చిత్రం. ఇందులో ప్రకాష్ రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. వృత్తి రీత్యా నిజాయితీ, నిబద్ధతకు పేరు గాంచిన ఓ కలెక్టర్ తన భార్య విషయంలో మాత్రమే కేవలం పుత్ర సంతానం కోసం వేధించడం, దానికి బదులుగా ఆయన భార్య చేసిన పోరాటం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.
కలెక్టర్ గారి భార్య | |
---|---|
దర్శకత్వం | టేకుల కృపాకరరెడ్డి |
రచన | టేకుల కృపాకరరెడ్డి |
నిర్మాత | వి.వనితా వాణి, ఎ.రాధికా రెడ్డి |
తారాగణం | ప్రకాశ్ రాజ్, భూమిక |
ఛాయాగ్రహణం | పూర్ణ కంద్రు |
సంగీతం | చిన్నా |
విడుదల తేదీ | నవంబరు 5, 2010 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |