కొండవలస లక్ష్మణరావు
కొండవలస లక్ష్మణరావు (ఆగష్టు 10, 1946 - నవంబర్ 2, 2015) గారు సుప్రసిద్ధ తెలుగు నాటక మరియు చలనచిత్ర నటులు. వీరు మొదట నాటకరంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. పిమ్మట ప్రసిద్ధ దర్శకులు వంశీ, తన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో వీరిని తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేసారు. సుమారు 200 సినిమాల్లో నటించారు.
కొండవలస లక్ష్మణరావు | |
![]() | |
జన్మ నామం | కొండవలస లక్ష్మణరావు |
జననం | ఆగష్టు 10, 1946 | 1946 ఆగస్టు 10 /
మరణం | నవంబర్ 2, 2015 హైద్రాబాద్, తెలంగాణ |
ప్రముఖ పాత్రలు | ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం లో పొట్టిరాజు, ఎవడి గోల వాడిది లో బక్కరెడ్ది |
విషయ సూచిక
జననంసవరించు
ఆగష్టు 10, 1946లో జన్మించారు. ఆయనది శ్రీకాకుళం జిల్లా లోని కొండవలస అనే పల్లెటూరు ఆయన ఇంటిపేరు కూడా అదే. కొండవలస లక్ష్మణరావు నాన్నగారు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. అమ్మ గృహిణి. 9వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదువుకున్నారు. 1959లో విశాఖ వచ్చారు. ఏవీఎన్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత 1967లో విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉద్యోగం చేశారు. అక్కడి నుంచి 2001 వరకు వైజాగ్‌లోనే ఉన్నారు. తండ్రి రైల్వే ఉద్యోగి. కళాశాల చదువు విశాఖపట్నంలో సాగింది. కళాశాలలో ఉండగానే నాటకాలు బాగా వేసేవాడు. డిగ్రీ పూర్తవగానే విశాఖ పోర్టు ట్రస్ట్ లో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చేస్తూ కూడా అందులోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.1961 నుంచి 2001 వరకు స్టేజ్ ఆర్టిస్ట్‌గా కొనసాగారు.
సినిమా రంగంలో దర్శకుడు వంశీ ఆయనకు మొదటగా ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో అవకాశం ఇచ్చాడు. నాటకరంగంలో ఆయనకు 378 అవార్డులు వచ్చాయి. అందులో రెండు నంది అవార్డులు కూడా ఉన్నాయి. నవరాగం అనే నాటకానికి ఉత్తమ నటుడు, కేళీ విలాసం అనే నాటకంలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డులు లభించాయి.
ఆయన కుమారుడు మణిధర్ కూడా సినీరంగంలోనే ఉన్నాడు.
నటించిన చిత్రాలుసవరించు
మరణంసవరించు
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ 2015, నవంబర్ 2 న తుదిశ్వాస విడిచారు [3].
బయటి లింకులుసవరించు
|website=
(help)