కల్పన (సినిమా)
'కల్పన' తెలుగు చలన చిత్రం, శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైసెస్ 1977 ఏప్రిల్ 22 న విడుదల చేసింది.ఈ చిత్రంలో మురళీమోహన్, జయచిత్ర జంటగా నటించారు.కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
కల్పన (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
తారాగణం | మురళీమోహన్, జయచిత్ర |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుమాగంటి మురళి మోహన్
జయచిత్ర
గుమ్మడి వెంకటేశ్వరరావు
గిరిబాబు
కైకాల సత్యనారాయణ
అల్లు రామలింగయ్య
జయమాలిని .
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కె.రాఘవేంద్రరావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాణ సంస్థ: శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైసెస్
గీత రచయితలు: సి నారాయణ రెడ్డి, వేటూరి సుందర రామమూర్తి,మైలవరపు గోపి,
గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి ఆనంద్
విడుదల:22:04:1977.
చిత్రకథ
మార్చుహిందీ చిత్రం "అనామిక" తెలుగురూపం ఈ చిత్రం.అపరిచితురాలైన జయచిత్ర, మురళీమొహన్ భార్యనంటూ అతని ఇంటికి వస్తుంది. ద్వేషంతో మొదలైనా, ఆమెను అతడు ప్రేమిస్తాడు. తర్వాత జయచిత్ర అతనికి దూరమౌతుంది. కొంత సస్పెన్స్ తో చిత్ర కథ నడుస్తుంది. చిత్రం నలుపు తెలుపులో నిర్మించబడింది.
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
వదలనురా నిను రఘురామా నా జీవితము నవపారిజాతము ఏనాడో అది నేకే అంకితము | వేటూరి | చక్రవర్తి | పి.సుశీల |
ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం | వేటూరి | చక్రవర్తి | బాలసుబ్రహ్మణ్యం |
దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ | వేటూరి సుందర రామమూర్తి | చక్రవర్తి | జి. ఆనంద్ |
అర్థరాత్రిరీ పొద్దుపొడిచేనా నీటిమాటున నిప్పు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
పొద్దు వాలిపోయాక వూరు సద్దుమణిగాక, రచన:మైలవరపు గోపి, గానం.పులపాక సుశీల .
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.