జి. ఆనంద్ తెలుగు నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు. అతను నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించాడు.[1]

గేదెల ఆనందరావు.
G.anand.jpg
జి. ఆనంద్
జననంగేదెల ఆనందరావు.
1957
తులగం, శ్రీకాకుళం జిల్లా
మరణం6 మే 2021
మరణ కారణంకరోనా
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీత దర్శకులు, నేపద్య గాయకులు

జీవిత విశేషాలుసవరించు

అతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అతని పూర్తిపేరు గేదెల ఆనందరావు. అతని పుట్టినజిల్లా పట్ల ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. అతను అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 2,500 పాటలు పాడాడు. 150 ఆల్బమ్‌సు చేసాడు . సినిమా అవకాశాలు లేకపోయిన సందర్భంలో కూడా డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణించాడు.

పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశాడు. అతను తన తొలి పాట "ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా.." ను చిరంజీవి నటించిన సినిమాకే పాడాడు[2].

షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందించారు. ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.

సినిమాలుసవరించు

ఖ్యాతి తెచ్చిన పాటలుసవరించు

  • ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).
  • దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).
  • విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)
  • దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)

మరణంసవరించు

జి. ఆనంద్ కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతుతూ సకాలంలో ఆక్సిజన్ అందక 2021 మే 6న మృతి చెందాడు.[3]

మూలాలుసవరించు

  1. Telugu, TV9 (2021-05-07). "G Anand passed away : మహమ్మారి కాటుకు మరో సీనియర్ సింగర్ బలి.. కరోనాతో కన్నుమూసిన జి. ఆనంద్ .. - veteran telugu singer g anand passes away due to corona". TV9 Telugu. Retrieved 2021-05-07.
  2. "ఆయన తొలిపాటకి నేనే నర్తించాః గాయకుడు జి.ఆనంద్‌ మృతికి చిరు సంతాపం". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-05-07.
  3. "G Anand passes away : కరోనాతో కన్నుమూసిన మరో ప్రముఖ తెలుగు సింగర్." News18 Telugu. Retrieved 2021-05-07.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జి._ఆనంద్&oldid=3832064" నుండి వెలికితీశారు