కల్యంపూడి రాధాకృష్ణ రావు

భారతీయ-అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు

సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన కల్యంపూడి రాధాకృష్ణారావు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు. ఇతడు అమెరికన్ భారతీయుడు. ప్రస్తుతం ఇతను పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్. ఇతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు,, గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి[2]. ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ , మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు[3][4].

కల్యంపూడి రాధాకృష్ణారావు
ఏప్రిల్ 2012లో చెన్నైలోని ఐఎస్సై-భారత గణాంకశాస్త్ర సంస్థ వద్ద కల్యంపూడి రాధాకృష్ణారావు
జననం (1920-09-10) 1920 సెప్టెంబరు 10 (వయస్సు 101)/ 1920, సెప్టెంబరు 10
హదగళి, మైసూరు రాజ్యం,
బ్రిటీషు ఇండియా
నివాసంభారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా
పౌరసత్వంఅమెరికా[1]
రంగములుగణితశాస్త్రం , గణాంకశాస్త్రం
వృత్తిసంస్థలుభారత గణాంకశాస్త్ర సంస్థ
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
పెన్న్ స్టేట్ విశ్వవిద్యాలయం
స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో
చదువుకున్న సంస్థలుఆంధ్ర విశ్వవిద్యాలయం
కలకత్తా విశ్వవిద్యాలయం
కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జి
పరిశోధనా సలహాదారుడు(లు)రోనాల్డ్ ఫిషర్
డాక్టొరల్ విద్యార్థులుRadha Laha
V. S. Varadarajan
S. R. Srinivasa Varadhan
ప్రసిద్ధిక్రేమర్–రావు పరిమితి
రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం
Orthogonal arrays
Score test
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్
National Medal of Science
S. S. Bhatnagar Prize
Guy Medal (Silver 1965, Gold 2011)

ప్రారంభ జీవితంసవరించు

రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10 న బళ్ళారి జిల్లాలోని హదగళిలో జన్మించాడు.ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవారు.ఆ తర్వాత నూజివీడు, నందిగామ గ్రామాల్లో చదివారు.విశాఖపట్నంలో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ (ఆనర్స్) చేసారు.ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు. విశాఖపట్నం నుండి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.[2] ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.[citation needed]ఆయన విశ్వవిద్యాలయ ఫస్టు ర్యాంకు సాధించారు. సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా పరిశోధనలు ప్రారంభించారు. పరిశోధనలతో భాఅంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు. పరిశోధనాంశములతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రెస్ వారి ఈయన గ్రంథ రచనను వెలువరించారు. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.

  1. "The Numberdars". Archived from the original on 2016-03-23. Retrieved 2013-05-06.
  2. 2.0 2.1 "Statisticians in History: Calyampudi R. Rao". American Statistical Association. Archived from the original on 2016-03-03. Retrieved 2015-06-27. {{cite web}}: horizontal tab character in |title= at position 28 (help)
  3. "C.R.Rao in News". C.R.Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science. Archived from the original on 2015-07-11. Retrieved 2015-06-27.
  4. "Indian Heart Association". Indian Heart Association Webpage. Retrieved 27 April 2015.