నందిగామ (కృష్ణా జిల్లా)

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండల పట్టణం
(నందిగామ నుండి దారిమార్పు చెందింది)

నందిగామ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామం.ఇది నగరపంచాయితి.

నందిగామ
—  రెవిన్యూ గ్రామం  —
నందిగామ is located in Andhra Pradesh
నందిగామ
నందిగామ
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°46′32″N 80°16′58″E / 16.775637°N 80.282910°E / 16.775637; 80.282910
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందిగామ
ప్రభుత్వం
 - నగరపంచాయితి చైర్మన్ గౌ. శ్రీమతి.మండవ.వరలక్షి గారు
జనాభా (2011)
 - మొత్తం 953
 - పురుషుల సంఖ్య 472
 - స్త్రీల సంఖ్య 481
 - గృహాల సంఖ్య 237
పిన్ కోడ్ 521 185
ఎస్.టి.డి కోడ్ 08678

ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 46 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 11575 ఇళ్లతో, 44359 జనాభాతో 2590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 22153, ఆడవారి సంఖ్య 22206. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 7954 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2142. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588883[1].

పట్టణ చరిత్రసవరించు

ఇది 2011 కు ముందు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది.2011 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమిప గ్రామలు అనసాగరం, హనుమంతులపాలెంలను దీనిలో కలిపి నగరపంచాయితి గా మార్చింది.నందిగామ నగరపంచాయితి పరిదిలో 20 ఎన్నికల వార్డులు ఉన్నయి .

సమీప గ్రామాలుసవరించు

జగ్గయ్యపేట, కోదాడ, సత్తెనపల్లి, మంగళగిరి

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

నందిగామలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట, విజయవాడ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 50 కి.మీ. విజయవాడ నుంచి నందిగామకు రైల్ లైన్ లేదు. ప్రతి పదినిమిషాలకు ఎక్స్ ప్రెస్ బస్సులు నడుస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరువలో ఉన్న నగర పంచాయితీ ఇది.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 17, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు 8, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 12 ఉన్నాయి. 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 6 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 3 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉంది.

 • జి.డి.ఎం.ఎం. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాల.
 • ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్
 • కె.వీ.ఆర్.కళాశాల
 • ఎం.ఆర్.ఆర్.కళాశాల

నందిగామలో మొదట్లో ఎన్.టి.రామారావు పేరిట కాలేజీని స్థాపించారు. కానీ అతని నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఆ తరువాత ఈ కాలేజీని కాంగ్రెస్ నాయకుడు కాకాని వెంకటరత్నం పేరిట కె.వీ.ఆర్.కళాశాలగా మార్చారు. ఈ కాలేజీలో చదివి ఐఐఎస్, డాక్టర్లు, ఇంకా జర్నలిస్టులు వంటి అనేక రంగాల్లో ముఖ్యులైన వారు ఉన్నారు.ప్రస్తుతం ఈ కాలేజీకి తుర్లపాటి కోటేశ్వరరావు ప్రిన్స్ పాల్ గా ఉన్నాడు. తుర్లపాటి నాగభూషణ రావు కేవీఆర్ కాలేజీలో చదివి (బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్- 1975 - 78) అనంతరం జర్నలిస్ట్ గా ఈనాడు, ఆంధ్రప్రభ, టివీ5 వంటి సంస్థల్లో పనిచేశాడు.అతను యునెసెఫ్, నంది అవార్డులు అందుకున్నాడు. నందిగామకు ల్యాండ్ ఆఫ్ ఎడ్యుకేషనలిస్ట్స్ (విద్యా వేత్తల భూమి) అన్న పేరు రావడానికి తొట్టతొలుతగా ఏర్పాటైన ఈ కాలేజీనే బలమైన కారణంగా చెప్పవచ్చు.

కాకతీయ అపోలో విద్యాసంస్థలుసవరించు

ఈ విద్యాసంస్థల అధినేత కాపా రవీంద్రనాధ్, 2016,అక్టోబరు-15న, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, ఢిల్లీలో అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ పురస్కారం అందుకున్నాడు. విద్యారంగంలో అతను చేయుచున్న కృషికి గుర్తింపుగా, "సిటిజెన్స్ ఇంటెగ్రేషన్ పీస్ సొసైటీ" అను సంస్థ వారు అతనికి ఈ పురస్కారాన్ని అందజేసారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

ఇంతవరకు ఈ పాఠశాలలో బ్రిటిష్ వారు నిర్మించిన గదులలోనే విద్యా బోధన చేస్తున్నారు. ఇప్పుడు 42.5 లక్షల ఆర్.ఎం.ఎస్.ఏ. నిధులతో, నూతన గదులు నిర్మించారు. ఈ గదులను వచ్చే వార్షికోత్సవంనాడు ప్రారంభించెదరు. ప్రస్తుతం ఈ పాఠశాలలో, ఆరవతరగతి నుండి పదవ తరగతి వరకు 476 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. 120 మంది పదవ తరగతిలో ఉన్నారు. నందిగామలో ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు ఉండటంతో, దూరప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, ఆ వసతి గృహాలలో బసచేయుచూ, ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో పదవ తరగతి వ్రాసిన విద్యార్థులు, 90% ఉత్తీర్ణత శాతం సాధించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అయిన శ్రీ చెన్నావఝుల శ్రీరామచంద్రమూర్తి, ఈ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం, 25వేల రూపాయల నగదు బహుమతులను అందించుచున్నారు.

ఈ పాఠశాల 104వ వార్షికోత్సవాలు, 2017,ఫిబ్రవరి-18న నిర్వహించెదరు. పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 18-2-2017న ఈ పాఠశాలలో, మండల స్థాయిలో, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకొరకు, ఒక విద్యా, వైఙానిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసెదరు.

రామకృష్ణా విద్యాసంస్థలు (ఎయిడెడ్)సవరించు

కార్పొరేట్ పోటీని తట్టుకొని, నాలుగు దశాబ్దాలుగా, పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుచున్న ఈ విద్యాసంస్థల 40వ వార్షికోత్సవం, 2017,ఏప్రిల్-23న ఘనంగా నిర్వహించారు.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

నందిగామలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఐదు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 10 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో12 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 12 మంది, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, 10 మంది నాటు వైద్యులు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యంసవరించు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సాంస్కృతిక సంస్థలుసవరించు

బళ్ళారి రాఘవ కళాసమితిసవరించు

తెలుగు పద్య నాటకం ఉన్నంత వరకు, బళ్ళారి రాఘవ పేరు చిరస్థాయిగా నిలిచిపోవును. నందిగామలో ఆ మహానుభావుని పేరుమీద, ఈ సంస్థను 50 సంవత్సరాలక్రితం స్థాపించారు. దీని వ్యవస్థాపకులు గోపాల కృష్ణసాయి. ఈ సంస్థలో ప్రతి సంవత్సరం బళ్ళారి రాఘవ జయంతిని ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుండి, దాతల సహకారంతో, కళారంగంలో పేరుపొందిన ప్రముఖుల జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు, 2014, ఆగస్టు-9న స్థానిక ఏ.ఎం.సి. కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రసంగించి, బళ్ళారి రాఘవ నాటకరంగానికి చేసిన కృషిని కొనియాడినారు. ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు కళాకారులు జాతీయ, దేశభక్తి, అభ్యుదయ గీతాలు ఆలపించారు. అనంతరం ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నవి.

పరిపాలనసవరించు

శాసనసభ నియోజకవర్గంసవరించు

పూర్తి వ్యాసం నందిగామ శాసనసభ నియోజకవర్గంలో చూడండి.నందిగామ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట గా ఉండేది. కాని 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల.సౌమ్య పై వై.యాస్.ఆర్ కాంగ్రస్ పార్టీ అభ్యర్థి మెండితోక. జగన్ మోహన్ రావు విజయం సాదించి రికార్డ్ శ్రుష్టించారు.

గ్రామ పంచాయతీసవరించు

 1. ఎంతోకాలంగా మేజరు పంచాయతీగా ఉన్న నందిగామను మున్సిపాలీటీగా మార్చాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వము నుండి 2011 సం.న ఆమోదము లభించింది. 2011 సంవత్సరానికి మొత్తము జనాభా సుమారు 50,000. మొత్తము వార్డులు 21. వార్షిక ఆదాయము సుమారు 2 కోట్లు.
 2. 2001లో నందిగామ మేజరు పంచాయతీగా ఉన్నప్పుడు, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 27 ఏళ్ళ వయసు లోనే శాఖమూరి స్వర్ణలత సర్పంచిగా పోటీచేసి గెలుపొందారు. గెలవగానే ఈమె మిగతావారిలాగా భర్తకు పెత్తనమిచ్చి ఇంటికే పరిమైతం కాలేదు. తన బాధ్యతలను తానే నిర్వహించారు. వీధి దీపాల సమస్య రాకుండా చూశారు. అంతర్గత రహదారులు అభివృద్ధి చేయటంతో పాటు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. యాభై వేల జనాభా ఉన్న నందిగామలో మహిళ అయినప్పటికీ ప్రజలకుఅందుబాటులో ఉంటూ పనిచేయటంతో రెండుసార్లు కలెక్టర్, ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి చేతులమీదుగా ఉత్తమ సర్పంచి పురస్కారం అందుకున్నారు.
 3. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న నందిగామ పంచాయతీకి స్వతంత్రంగా పోటీచేసి, మూడుసార్లు సర్పంచిగా ఎన్నికై రికార్డు సృష్టించారు, యరగొర్ల వెంకటనరసింహం. రాజకీయ ఉద్దండులు నిలబెట్టిన అభ్యర్థులపై విజయం సాధించి, 1981 మే 30 నుండి 2001 ఆగస్టు 14 వరకూ, వరుసగా 20 ఏళ్ళపాటు ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. ప్రస్తుత పంచాయతీ భవననిర్మాణం, కీసర నుండి నందిగామ వరకూ మఛ్నీటి పధకం ఆయన చేయించినవే. మునిసిపల్ కాంప్లెక్స్ నిర్మాణం ఈయన హయాంలో జరిగినవే.

అనాసాగారంసవరించు

అనాసాగారం గ్రామం జాతీయ రహదారి 9కి ఆనుకొని వున్నది, నందిగామ నుండి రెండు కి.మీ.ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రామం నందిగామలో పూర్తిగా కలిసిపోయింది. ఈ గ్రామం ఇప్పుడు నందిగామలో ఒక వార్డుగా ఉంది. అనాసాగారంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఇతర గ్రామాల నుండి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరు అవుతున్నారు. ఈ పాఠశాల కొర్లపాటి చిన్నమల్లయ్యగారి ప్రోద్భలముతో నిర్మించబడింది. ఆ తరువాత వివిధ రాజకీయ నాయకులు దీని అభివృద్ధికి తొడ్పడినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ శుక శ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం(శివాలయం)సవరించు

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు. ఈ దేవాలయంలో నాలుగు దిక్కులా రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామివారల ఉపాలయాలున్నవి. మధ్యలోని ప్రధానాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామివారు కొలువుదీరి ఉండటంతో, ఈ దేవాలయము పంచలింగక్షేత్రము గా ప్రసిద్ధిచెందినది. అందువలన నందిగామ అను పేరువచ్చినది ఈ ఆలయానికి 275 ఎకరాల మాన్యం భూములున్నవి. ఆ భూముల వలన ప్రతి సంవత్సరం ఆలయానికి లక్షల రూపాల ఆదాయం వచ్చుచున్నది. ఈ ఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖవారి ఆధీనములోఉండి వాసిరెడ్డి రామనాథబాబు ధర్మకర్తగా ఉన్నారు. ఈ దేవాలయములో ప్రతిపూర్ణిమకు, మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి కార్తీక మాసంలో ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ మాసమందు నెలరోజుల పాటు భక్తుల గోత్ర నామాలతో అభిషేకాలు, కార్తీక పూర్ణిమ రోజు జ్వాలాతోరణము, కార్తీక మాస శివరాత్రిరోజు లక్షబిళ్వార్చన చాలా బాగా జరుగును.

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంసవరించు

ఈ ఆలయం స్థానిక దుర్గానగర్‌లో ఉంది.

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

స్థానిక నెహ్రూనగర్‌లోని ఈ అలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2017,ఏప్రిల్-25వతేదీ మంగళవారంనాడు వైభవంగా ప్రారభమైనవి.

శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవముగా జరుగును. 2011వ సంవత్సరంలో జరిగిన కల్యాణము, మన గవర్నరు, ఇ.యస్.యన్.ల్. నరసింహన్ గారి చేతుల మీదుగా బ్రహ్మాండముగా జరిగింది.

నందిగామలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని, పుష్కర నిధులు విరాళాలు, 26 లక్షలతో నూతనంగా పునర్నిర్మించారు. నూతన ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఏప్రిల్-22వతేదీ శనివారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, వైభవోపేతంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల మూల విరాట్టును, యంత్రాన్నీ ప్రతిష్ఠించారు. జీవధ్వజస్తంభం, ఆంజనేయస్వామి, విఖనస మహర్షి, రామానుజస్వామి, రాధాకృష్ణులు, విమాన శిఖరాలను ప్రతిష్ఠ చేసారు. సమీపగ్రామాలనుండి ఆలయానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ఆవరణ క్రిక్కిరిసినది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. [12]

ఈ ఆలయం పునఃప్రతిష్ఠించి, 40 రోజులైన సందర్భంగా, 2017,జూన్-1వతేదీ గురువారం రాత్రి, స్వామివారి ఉత్సవమూర్తులకు కనులపండువగా పుష్పయాగం నిర్వహించారు.

మరిడ్డి మహాలక్ష్మి దేవాలయంసవరించు

దేవాలయమును రాష్ట్ర ప్రథమ స్పీకరు అయిన అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు నిర్మించారు. ఈ దేవాలయము శిథిలము చెందగా, మరల వారి కుమారులు కృష్ణమోహనరావుగారు దుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణంకావించీ, అమ్మవారి మూల విరాట్టుతో సహా ప్రతిష్ఠలు చేయించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దినారు.

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ కుమారస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం స్థానిక గాంధీనగర్ లో ఉంది.

శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి 325వ ఆరాధనోత్సవాలు 2015,మార్చి-15వ తేదీ ఆదివారం ప్రారంభమైనవి. ఈ సందర్భంగా మూలవిరాట్టులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. దంపతులతో శాంతిహోమం చేయించారు. విచ్చేసిన భక్తులతో ఆలయం క్రిక్కిరిసిపోయింది.

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయంసవరించు

నందిగామ చందమామపేటలోని ఈ పురాతన ఆలయంలో, దాతల ఆర్థిక సహకారంతో, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుచున్నవి.

శ్రీ సాయి అయ్యప్ప ఆలయంసవరించు

ఈ ఆలయ చతుర్ధ వార్షికోత్సవాలు, 2015,మే నెల-21,22,23 తేదీలలో వైభవంగా నిర్వహించెదరు. మూడవరోజు, 23వ తేదీ శనివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయంసవరించు

నందిగామ పాత బస్సుస్టాండులోని ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, కాణిపాకం ఆలయంలో మాదిరిగా, ఈ ఆలయంలో, సిద్ధి, బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి కళ్యాణాన్ని, వేదపండితుల ఆధ్వర్యంలో, వేదోక్తంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని, కన్యాదాతలుగా వ్యవహరించారు. అనంతరం, విచ్చేసిన భక్తాదులకు అన్నసమారధన నిర్వహించారు. [9]

శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంసవరించు

ఈ ఆలయం నందిగామ రైతుబజారు వద్ద ఉంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంసవరించు

ఈ ఆలయం నందిగామ చెరువు బజారులో ఉంది. ఈ మందిర వార్షికోత్సవాలను 2017,మే-31వతేదీ బుధవారంనాడు ప్రారంభించారు.

శ్రీ మలయాళ సద్గురు గీతామందిరంసవరించు

నందిగామ రైతుపేటలో నెలకొన్న ఈ ఆలయంలో 2017,ఇఊన్-11 ఆదివారంనాడు, కల్కిమానవ సేవసమితి అధ్యక్షులు యరగౌర్ల వరనరసింహారావు ఆధ్వర్యంలో, కల్కిభగవాన్, పద్మావతీ అమ్మవార్ల వార్షిక కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

నందిగామలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 892 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 166 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 44 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 58 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 60 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 113 హెక్టార్లు
 • బంజరు భూమి: 51 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1201 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 906 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 461 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

నందిగామలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 299 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 161 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

నందిగామలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి, మిరప, అపరాలు, కాయగూరలు

పారిశ్రామిక ఉత్పత్తులుసవరించు

బియ్యం, పప్పులు

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులుసవరించు

అయ్యదేవర కాళేశ్వరరావు: ఇతను రాష్ట్ర శాసనసభకు ప్రథమ స్పీకరు. నందిగామ గ్రామం మొత్తం అయ్యదేవర వంశీకుల అగ్రహార గ్రామం. అయ్యదేవర కాళేశ్వరరావు (1882 జనవరి 22 - 1962 ఫిబ్రవరి 26) స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ఇతను కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.స్వాతంత్ర్యానంతరం1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఈయన పేరు మీదుగా నిర్మించారు అదే కాళేశ్వరరావు మార్కెట్.

విశేషాలుసవరించు

నందిగామ మండలంలోని అందరు లబ్ధిదారులకూ గ్యాస్ కనెక్షన్లు అందిన సందర్భంగా, 2017,జూన్-1న్ మండలాన్ని, పొగరహిత మండలంగా ప్రకటించారు. [16]

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులుసవరించు