కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా

భారత న్యాయమూర్తి
(కళ్యాణ్ జ్యోతి సెంగుప్తా నుండి దారిమార్పు చెందింది)

కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా (జ. 7 మే 1953) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాదులోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా పనిచేశాడు.[1] 2013, మే 21వ తేది నుండి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు.[2]

జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా

చైర్ పర్సన్, లోకాయుక్తా, సిక్కిం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 మే 2015

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
21 మే 2013 – 6 మే 2015

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
17 జూలై 1997 – 18 నవంబరు 2012

ఉత్తరాఖాండ్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
18 నవంబరు 2012 – 20 మే 2013

వ్యక్తిగత వివరాలు

జననం 7 మే 1953
బైద్యాపూర్, తెన్యా, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతదేశం

కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా 1953, మే 7న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ముర్షిదాబాద్ జిల్లాలోని బైద్యాపూర్ గ్రామంలో జన్మించాడు.

వృత్తి జీవితం

మార్చు

కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా 1981, ఏప్రిల్ 21న న్యాయవాదిగా చేరి సివిల్, కాన్స్టిట్యూషనల్, క్రిమినల్ విషయాలు, మధ్యవర్తిత్వ విషయాలలో కలకత్తా హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. అటు తరువాత 1997లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[3] కొంతకాలం కలకత్తా హైకోర్టులో యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశాడు.[4] 2012-2013 మధ్యకాలంలో ఉత్తరాఖాండ్ హైకోర్టు న్యాయమూర్తిగా, 2013-2015 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 2015 మే 18న సిక్కిం రాష్ట్ర లోకాయుక్త చైర్ పర్సన్ గా నియమించబడ్డాడు.[5]

మూలాలు

మార్చు
  1. "KJSGJ". tshc.gov.in. Retrieved 2021-06-16.
  2. http://hc.tap.nic.in/aphc/kjsgj.html
  3. "Calcutta High Court - Judges". www.calcuttahighcourt.gov.in. Retrieved 2021-06-16.
  4. "Justice Kalyan Jyoti Sengupta is new Chief Justice of the AP high court". Times of India. 18 May 2013. Retrieved 16 June 2021.
  5. "Justice Kalyan Jyoti Sengupta sworn-in as Sikkim Lokayukta Chairperson". The Economic Times. Retrieved 2021-06-16.