కశిశ్ మెథ్వానీ
కశిశ్ మెథ్వానీ (ఆంగ్లం: Kashish Methwani; జననం 2001 జనవరి 09), ఒక భారతీయ మోడల్. ఆమె 21 సంవత్సరాల వయస్సులో గ్లామానంద్ సూపర్ మోడల్ ఇండియా 2022 విజేతగా నిలిచింది.[1] ఆ తర్వాత, ఆమె మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 టైటిల్ గెలుచుకుంది. 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీచేత భారతదేశంలో ఉత్తమ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) క్యాడెట్ అవార్డును అందుకుంది.
కశిశ్ మెథ్వానీ | |
---|---|
జననం | ఉల్హాస్‌నగర్, ముంబై | 2001 జనవరి 9
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | అందాల పోటీ టైటిల్ హోల్డర్ |
మోడల్‌గా కొనసాగుతూనే, చదువులో రాణించడంతో ఆమెకు, 2024లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది. అయితే, ఆమె మోడలింగ్, చదువు రెండూ కాకుండా భారత సైనిక దళంలో అడుగుపెడుతున్నాని ప్రకటించింది.[1]
విద్యాభ్యాసం
మార్చుకశిశ్ మెథ్వానీ 2001 జనవరి 9న ముంబైలోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించింది. ఆమె సింధీ కుటుంబానికి చెందినది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె తండ్రి సైన్యంలో పనిచేయగా, తల్లి పూణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. కశిశ్ మెథ్వానీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనే చదువుకుంది. ఆ తరువాత, ఆమె పూణే విశ్వవిద్యాలయంలో చేరింది. ఆ తరువాత, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నుంచి ఎంఎస్‌సీ న్యూరోసైన్స్ పూర్తిచేసింది.
కెరీర్
మార్చుమోడలింగ్తో పాటు, ఆమె భరతనాట్యం నర్తకి, తబలా ప్లేయర్, జాతీయ స్థాయి పిస్టల్ షూటర్ కూడా. స్థానికంగా నిర్వహించే సమ్మర్ ప్రిన్సెస్ అందాల పోటీలో ఆమె 7 సంవత్సరాల వయస్సులో పాల్గొన్నది. అలా మొదలైన ఆమె కెరీర్, 2202లో గ్లామానంద్ సూపర్‌మోడల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. తద్వారా, ఆమె మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2022 కిరీటాన్ని పొందింది. ‘క్రిటికల్ కాజ్’ అనే ఎన్‌జీఓనీ నడుపుతోంది. ఆమె టెడెక్స్ స్పీకర్ కూడా.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Kashish Methwani: అందాల రాణి... ఆర్మీలోకి | a-beautiful-lady-in-army". web.archive.org. 2024-12-16. Archived from the original on 2024-12-16. Retrieved 2024-12-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)