కస్తూరి కుటుంబరావు

కస్తూరి కుటుంబరావు చేనేత కార్మికుల నేత . 1906లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కనగాల గ్రామంలో పున్నయ్య, పున్నమ్మ దంపతులకు కస్తూరి కుటుంబరావు జన్మించారు. ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లల్లో ఆయన నాల్గవ సంతానం. ఉపాధ్యాయ వృత్తి. గ్రంథాలయ ఉద్యమ నిర్మాత.చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.రేపల్లె తాలూకా పేటేరు,ఇసుక పల్లి,రేపల్లె, భట్టిప్రోలు, ఐలవరం, రాజోలు, కనగాల,చెరుకుపల్లి,పెదపులివర్రు,కనగాల,వెల్లటూరు,భట్టిప్రోలు, పల్లెకోన,గుళ్ళపల్లి గ్రామాల్లో చేనేత కార్మికులే ఎక్కువ.భార్య హైమవతి, నలుగురు పిల్లలతో 1944 మొదలు పందిళ్ళపల్లి, జాండ్ర పేట ,వేటపాలెం లలో నివాసం ఉన్నారు. 1946 జూన్‌ 19వ తేదీన రాష్ట్ర చేనేత మహాసభను పందిళ్ళపల్లిలో నిర్వహించారు.సంగీత దర్శకులు బి.గోపాలం, సినీనటి వసంత (జూ పూడి) పాల్గొన్నారు. 'నాజర్‌ దళం' బుర్రకథ ప్రజలను ఉర్రూత లూగించింది.కాంగ్రెస్‌ నాయకులు ప్రగడ కోటయ్య కమ్యూనిస్టు పార్టీ, చేనేత కార్మిక సంఘమంటేనే మండిపడేవారు. 1950 మే 12వతేదీన పాలపర్తి లో కస్తూరి కుటుంబరావు, సజ్జా సూర్య బాలానందం , బండారు వెంకటే శ్వర్లు తో పాటు,చివుకుల శేషశాస్త్రి, గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యదర్శి ముక్తినూతలపాటి లక్ష్మినారాయణ లను పోలీసులు కాల్చి చంపారు.వారి స్మృతి చిహ్నంగా పాల పర్తిలో ,ఇసుకపల్లె ,వేటపాలెం సెంటర్‌లోనూ స్తూపం నిర్మించారు.జాండ్రపేట లో కస్తూరి కుటుంబరావు స్మారక కళ్యాణ మండపము ఉంది.

మూలాలు

మార్చు